మన మహర్షులు ఆనాటికాలంలో అనేక రహస్యాలను, తమతమ అనుభవ సారాన్ని అద్భుతాన్ని కొన్ని ప్రత్యేక రీతుల్లో నిక్షిప్తంచేసి మనకి అందించారు. వాటిలో సంఖ్యాశాస్త్రం కూడా ఒకటి. అంకెల్లో అనంత రహస్యాలు దాగి వున్నాయన్న నగ్న సత్యాన్ని మనకి అందుబాటులో వుంచారు.
అంతరిక్షంలో - సూర్యుడు - చంద్రుడుతో పాటుగా ఇతర గ్రహాలు వున్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఇతర గ్రహాలు కూడా వాటివాటి నిర్ణిత కక్ష్యల్లో తిరుగుతున్నాయి. ఈ నగ్నసత్యాలన్నీ తిరుగులేనివి. శాస్త్రీయపరంగా నిరూపించ బడ్డాయి కూడా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. సూర్యుడు స్థిరమైన నక్షత్రం.
సూర్యుని చుట్టూ తిరిగే చంద్రుడు, విశ్వాంతరాల్లో కొన్ని కోట్లాది నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్ర మండలానికి దగ్గరగా ఉంటాడు. అటువంటి నక్షత్ర కూటాలు 27వున్నాయి.
ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఇవ్వబడ్డాయి.
అవి అశ్వని నక్షత్రంనుండి రేవతి నక్షత్రం వరకు. మొత్తం 27నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో - ఒక్కొక్కరోజు ఒక్కొక్క నక్షత్రం -
27నక్షత్రాలు ఒకసారి చుట్టి వచ్చేటప్పటికి ఒక చంద్రమాసం వస్తుంది. ఈ చంద్రమాసంలో రెండుపక్షాలున్నాయి. ఒక పక్షానికి ఆఖరి రోజు పౌర్ణమి. రెండో పక్షానికి ఆఖరిరోజు అమావాస్య
ఈ అమావాస్య :
పౌర్ణమి రోజుల్లో భూమి మీద వున్న సముద్రాలూ ఆటుపోటులకు గురికావడం మనకందరికీ తెలిసిందే. ఇలా ఎందుకు జరుగుతుంది?
ఒక్క క్షణం ఆలోచిస్తే దొరికే సమాధానం ఆకర్షణాశక్తి గ్రహాల మధ్యగలది అని తేలుతుంది. కాబట్టి ఇదేరకమైన ప్రభావం భూమిమీద పుట్టి, గిట్టే ప్రతిజీవరాసిలో గూడా ప్రతిఫలిస్తుందనడంలో సందేహంలేదు.
అంకెలకి ఈ సంబంధం ఎలా ఏర్పడ్డది? :
అంకెలనేవి ఏర్పడింది కూడా ఈ గ్రహాల భ్రమణపరిభ్రమణాలకీ సంబంధించి వుండటం విశేషం. కాబట్టి లెక్కల్లో చుస్తే మననిత్య జీవితం అంతా గణితంలోనూ, జీవిత రహస్యాలు అంకెల్లోనూ వున్నాయంటే అతిశయోక్తి లేదు.
ఇక ఇందులోని లోతుపాతుల్ని పరీక్షించే మన జీవితరంగాల్లో ఎటువంటి ముఖ్యపాత్రను వహిస్తుందో ప్రతివారి జీవిత అగాధాల్లో దాగిన నిజాల్ని తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాం.
ఏ మార్గంలో ప్రయాణిస్తే బాగుపడే అవకాశంవుందో తెలుసుకుని వెళితే శుభం కలుగుతుందని తెలుపుతున్నాను.
- అడుసుమల్లి మల్లిఖార్జునరావు
మన మహర్షులు ఆనాటికాలంలో అనేక రహస్యాలను, తమతమ అనుభవ సారాన్ని అద్భుతాన్ని కొన్ని ప్రత్యేక రీతుల్లో నిక్షిప్తంచేసి మనకి అందించారు. వాటిలో సంఖ్యాశాస్త్రం కూడా ఒకటి. అంకెల్లో అనంత రహస్యాలు దాగి వున్నాయన్న నగ్న సత్యాన్ని మనకి అందుబాటులో వుంచారు. అంతరిక్షంలో - సూర్యుడు - చంద్రుడుతో పాటుగా ఇతర గ్రహాలు వున్నాయి. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఇతర గ్రహాలు కూడా వాటివాటి నిర్ణిత కక్ష్యల్లో తిరుగుతున్నాయి. ఈ నగ్నసత్యాలన్నీ తిరుగులేనివి. శాస్త్రీయపరంగా నిరూపించ బడ్డాయి కూడా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. సూర్యుడు స్థిరమైన నక్షత్రం. సూర్యుని చుట్టూ తిరిగే చంద్రుడు, విశ్వాంతరాల్లో కొన్ని కోట్లాది నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్ర మండలానికి దగ్గరగా ఉంటాడు. అటువంటి నక్షత్ర కూటాలు 27వున్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఇవ్వబడ్డాయి. అవి అశ్వని నక్షత్రంనుండి రేవతి నక్షత్రం వరకు. మొత్తం 27నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో - ఒక్కొక్కరోజు ఒక్కొక్క నక్షత్రం - 27నక్షత్రాలు ఒకసారి చుట్టి వచ్చేటప్పటికి ఒక చంద్రమాసం వస్తుంది. ఈ చంద్రమాసంలో రెండుపక్షాలున్నాయి. ఒక పక్షానికి ఆఖరి రోజు పౌర్ణమి. రెండో పక్షానికి ఆఖరిరోజు అమావాస్య ఈ అమావాస్య : పౌర్ణమి రోజుల్లో భూమి మీద వున్న సముద్రాలూ ఆటుపోటులకు గురికావడం మనకందరికీ తెలిసిందే. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్క క్షణం ఆలోచిస్తే దొరికే సమాధానం ఆకర్షణాశక్తి గ్రహాల మధ్యగలది అని తేలుతుంది. కాబట్టి ఇదేరకమైన ప్రభావం భూమిమీద పుట్టి, గిట్టే ప్రతిజీవరాసిలో గూడా ప్రతిఫలిస్తుందనడంలో సందేహంలేదు. అంకెలకి ఈ సంబంధం ఎలా ఏర్పడ్డది? : అంకెలనేవి ఏర్పడింది కూడా ఈ గ్రహాల భ్రమణపరిభ్రమణాలకీ సంబంధించి వుండటం విశేషం. కాబట్టి లెక్కల్లో చుస్తే మననిత్య జీవితం అంతా గణితంలోనూ, జీవిత రహస్యాలు అంకెల్లోనూ వున్నాయంటే అతిశయోక్తి లేదు. ఇక ఇందులోని లోతుపాతుల్ని పరీక్షించే మన జీవితరంగాల్లో ఎటువంటి ముఖ్యపాత్రను వహిస్తుందో ప్రతివారి జీవిత అగాధాల్లో దాగిన నిజాల్ని తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాం. ఏ మార్గంలో ప్రయాణిస్తే బాగుపడే అవకాశంవుందో తెలుసుకుని వెళితే శుభం కలుగుతుందని తెలుపుతున్నాను. - అడుసుమల్లి మల్లిఖార్జునరావు© 2017,www.logili.com All Rights Reserved.