మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, అనంతమైన ఆత్మానందం, ప్రశాంతత ఎక్కడుందో చూపిస్తున్న మణిదీపాలివి.
బాలివుడ్ సూపర్ స్టార్ అనుపమ్ ఖేర్ ఇప్పుడు మరో సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. మీలో దాగిన మౌలిక శక్తిని మీకు తెలియచేయడానికి, మీకు మానసిక ప్రశాంతతని కలుగచేయడానికి అనుపమ్ జి తన జీవితంలో ఎదురైన మంచి చెడులు, ఉదాహరణలు ప్రస్తావిస్తూ, ఈ పుస్తకాన్ని ఒక మార్గదర్శిగా మీ చేతికి అందిస్తున్నారు. ఆ సందర్భాలు మీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. అవి మీ హృదయాంతరాల్లో సుక్ష్మాతిసూక్ష్మంగా వున్న నిగూఢ శక్తుల్ని ప్రేరేపిస్తాయి.
ఎటు చూసిన భయం, అభద్రత ఒత్తిడి, అసంతృప్తి నెలకొన్న ఈనాటి ప్రపంచంలో గందరగోళ పరిస్థితుల్ని, ప్రతికూలతని ఆశావహమైన దృక్పథంతో ఎదుర్కోవడం సాధ్యమేనంటారు అనుపమ్ జి. తనెంత సాధారణమైన నేపద్యం నుంచి వచ్చారో చెబుతూ, ఈనాడు తనింత ఘనవిజయం సాధించడానికి ఆ నేపధ్యం ఎలా అడ్డుపడలేదో తన జీవితాన్నే సోదాహరణంగా చూపించారు. అది చెప్తూనే మరో పక్క సక్సెస్ తో ఎంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుందో, లేకపోతే పర్యవసానాలు ఎంత విషాదకరంగా ఉంటాయో తెలియచేసారు. ఏ ఏ పద్దతులు, ఏ సార్థకమైన విధానాలు తనని శిఖర స్థాయికి చేర్చాయో వాటన్నిటిని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఇందులో పేర్కొన్న ప్రతి దృక్కోణానికి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పుస్తకంలో రచయిత అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మాయదారి కోపం, మార్పు లక్షణం, ఆలోచనపై నియంత్రణ, అనుబంధాలు, బాంధవ్యాలను జయించడం, భయాందోళనల నుంచి దూరంగా ఉండడం, వైఫల్యాలను అర్థం చేసుకోవడం, మన నిగూఢ శక్తిని అర్థం చేసుకోవడం, నష్టాన్ని మరణాన్ని తట్టుకోవడం, ఇలా ఎన్నో... విషయాలను ఈ పుస్తకం లో వివరించారు.
మీరేలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, మిమ్మల్ని ఈ పుస్తకం సేద తీరుస్తుంది. మార్గదర్శకం వహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే మీ సమస్యలకి అవసరమైన పరిష్కారం చూపిస్తుంది. అప్పుడే మీరు గ్రహిస్తారు. మీ అసలు గొప్పతనమంత మీరేనని మీకు అర్థం అవుతుంది.
-అనుపమ్ ఖేర్.
మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, అనంతమైన ఆత్మానందం, ప్రశాంతత ఎక్కడుందో చూపిస్తున్న మణిదీపాలివి. బాలివుడ్ సూపర్ స్టార్ అనుపమ్ ఖేర్ ఇప్పుడు మరో సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. మీలో దాగిన మౌలిక శక్తిని మీకు తెలియచేయడానికి, మీకు మానసిక ప్రశాంతతని కలుగచేయడానికి అనుపమ్ జి తన జీవితంలో ఎదురైన మంచి చెడులు, ఉదాహరణలు ప్రస్తావిస్తూ, ఈ పుస్తకాన్ని ఒక మార్గదర్శిగా మీ చేతికి అందిస్తున్నారు. ఆ సందర్భాలు మీ జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. అవి మీ హృదయాంతరాల్లో సుక్ష్మాతిసూక్ష్మంగా వున్న నిగూఢ శక్తుల్ని ప్రేరేపిస్తాయి. ఎటు చూసిన భయం, అభద్రత ఒత్తిడి, అసంతృప్తి నెలకొన్న ఈనాటి ప్రపంచంలో గందరగోళ పరిస్థితుల్ని, ప్రతికూలతని ఆశావహమైన దృక్పథంతో ఎదుర్కోవడం సాధ్యమేనంటారు అనుపమ్ జి. తనెంత సాధారణమైన నేపద్యం నుంచి వచ్చారో చెబుతూ, ఈనాడు తనింత ఘనవిజయం సాధించడానికి ఆ నేపధ్యం ఎలా అడ్డుపడలేదో తన జీవితాన్నే సోదాహరణంగా చూపించారు. అది చెప్తూనే మరో పక్క సక్సెస్ తో ఎంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుందో, లేకపోతే పర్యవసానాలు ఎంత విషాదకరంగా ఉంటాయో తెలియచేసారు. ఏ ఏ పద్దతులు, ఏ సార్థకమైన విధానాలు తనని శిఖర స్థాయికి చేర్చాయో వాటన్నిటిని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఇందులో పేర్కొన్న ప్రతి దృక్కోణానికి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పుస్తకంలో రచయిత అనేక విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మాయదారి కోపం, మార్పు లక్షణం, ఆలోచనపై నియంత్రణ, అనుబంధాలు, బాంధవ్యాలను జయించడం, భయాందోళనల నుంచి దూరంగా ఉండడం, వైఫల్యాలను అర్థం చేసుకోవడం, మన నిగూఢ శక్తిని అర్థం చేసుకోవడం, నష్టాన్ని మరణాన్ని తట్టుకోవడం, ఇలా ఎన్నో... విషయాలను ఈ పుస్తకం లో వివరించారు. మీరేలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, మిమ్మల్ని ఈ పుస్తకం సేద తీరుస్తుంది. మార్గదర్శకం వహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే మీ సమస్యలకి అవసరమైన పరిష్కారం చూపిస్తుంది. అప్పుడే మీరు గ్రహిస్తారు. మీ అసలు గొప్పతనమంత మీరేనని మీకు అర్థం అవుతుంది. -అనుపమ్ ఖేర్.
© 2017,www.logili.com All Rights Reserved.