పత్రికా రంగం గురించి, జర్నలిజం అంటే ఏమిటో వివరించే క్రమంలో ఇది నా రెండో పుస్తకం. 'వార్తలు ఎలా రాయాలి?' అనే శీర్షికతో సుమారు దశాబ్దం కిందట నేను రాసిన రిపోర్టర్స్ రిఫరెన్స్ పుస్తకాన్ని అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా అశేషంగా అభిమానిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఆ పుస్తకం కాపీలు ప్రస్తుతం మార్కెట్లో దొరకకపోవడం వల్ల చాలా మంది ఫోన్లు చేసి మరీ కాపీలు ఉంటే ఇమ్మని కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం కృష్ణారావు రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా, రచయితగా అందరికి సుపరిచితులు. వివిధ వార్తా పత్రికలూ, మీడియా సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. పాత్రికేయ ప్రముఖుల, విద్యాసంస్థల ప్రశంసలందుకున్న రిఫరెన్స్ గ్రంథం "వార్తలు ఎలా రాయాలి?"ను 2006 లో రాశారు. మీడియా రంగంలోని దిగజారుడుతనం పై 'నడిచే నీడలు, కలాల వనంలో కలుపు మొక్కలు' అనే నవలలు రాశారు. ఇవి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మీడియా అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు 'మీరే జర్నలిస్ట్' గ్రంథాన్ని వెలువరిస్తున్నారు. బౌద్ధ ధమ్మంపై అధ్యయనం చేస్తూ 'ధమ్మపదం' ను అనువాదం చేశారు. 'ఇన్ స్పిరేషన్ టు మేన్ కైండ్' మరి కొన్ని పుస్తకాలు రాశారు.
పత్రికా రంగం గురించి, జర్నలిజం అంటే ఏమిటో వివరించే క్రమంలో ఇది నా రెండో పుస్తకం. 'వార్తలు ఎలా రాయాలి?' అనే శీర్షికతో సుమారు దశాబ్దం కిందట నేను రాసిన రిపోర్టర్స్ రిఫరెన్స్ పుస్తకాన్ని అప్పటి నుంచీ ఇప్పటి వరకూ కూడా అశేషంగా అభిమానిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఆ పుస్తకం కాపీలు ప్రస్తుతం మార్కెట్లో దొరకకపోవడం వల్ల చాలా మంది ఫోన్లు చేసి మరీ కాపీలు ఉంటే ఇమ్మని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బెందాళం కృష్ణారావు రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా, రచయితగా అందరికి సుపరిచితులు. వివిధ వార్తా పత్రికలూ, మీడియా సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. పాత్రికేయ ప్రముఖుల, విద్యాసంస్థల ప్రశంసలందుకున్న రిఫరెన్స్ గ్రంథం "వార్తలు ఎలా రాయాలి?"ను 2006 లో రాశారు. మీడియా రంగంలోని దిగజారుడుతనం పై 'నడిచే నీడలు, కలాల వనంలో కలుపు మొక్కలు' అనే నవలలు రాశారు. ఇవి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మీడియా అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు 'మీరే జర్నలిస్ట్' గ్రంథాన్ని వెలువరిస్తున్నారు. బౌద్ధ ధమ్మంపై అధ్యయనం చేస్తూ 'ధమ్మపదం' ను అనువాదం చేశారు. 'ఇన్ స్పిరేషన్ టు మేన్ కైండ్' మరి కొన్ని పుస్తకాలు రాశారు.© 2017,www.logili.com All Rights Reserved.