మారుతున్న ప్రపంచంలో మారిపోతున్న మానవ సంబంధాల గురించి మనకు తెలియజేస్తూనే, కాలం ఎంత మారినా, మారకూడని కొన్ని మానవతా విలువలు ఉంటాయని, ఇంకా ఉన్నాయని; వాటికీ ప్రతినిధులుగా మనకు కొందర్ని పరిచయం చేస్తారు రచయిత.
అలాగే - ఎన్నో విలువలున్న గతమే, ఏ విలువలూ లేని వర్తమానం కంటే బావుందని భావించే చాలామందితో కొంతవరకు ఏకీభవిస్తూనే, ముందుతరంలోని ఉత్తములుకన్నా, నేటితరంలోని ఉత్తములు బహు మంచివారు. పైగా గడుసువారు అని కూడా మనకు కొన్ని కధలు ద్వారా తెలియజేస్తున్నారు.
ఒక విధంగా ఈ కధలన్నీ -
న్యూ మిలీనియంలో, పెద్దలకు పిల్లలకు మధ్య; బంధువులకు స్నేహితులకు మధ్య, భిన్నవర్గాలకు, సంస్కృతులకు చెందిన పరిచయస్తుల మధ్య వెల్లివిరిసిన, రగిలి రేగిన రాగద్వేషాల గాడత పై, విస్త్రుతిపై చాలా సంయమనంతో సాగిన ఒక రనింగ్ కామెంటరీ!
ఈ కధలు మనల్ని 'చైతన్య పరుస్తాయి. చక్కలిగింతలు పెడతాయి. మన ఎగుడుదిగుడు జీవితాల్ని నడిపించే జీవన సూత్రాలను చూపిస్తాయి. తట్టిలేపుతాయి.
ఇక చదవండి.
- డా. వేమూరి కృష్ణమూర్తి
మారుతున్న ప్రపంచంలో మారిపోతున్న మానవ సంబంధాల గురించి మనకు తెలియజేస్తూనే, కాలం ఎంత మారినా, మారకూడని కొన్ని మానవతా విలువలు ఉంటాయని, ఇంకా ఉన్నాయని; వాటికీ ప్రతినిధులుగా మనకు కొందర్ని పరిచయం చేస్తారు రచయిత. అలాగే - ఎన్నో విలువలున్న గతమే, ఏ విలువలూ లేని వర్తమానం కంటే బావుందని భావించే చాలామందితో కొంతవరకు ఏకీభవిస్తూనే, ముందుతరంలోని ఉత్తములుకన్నా, నేటితరంలోని ఉత్తములు బహు మంచివారు. పైగా గడుసువారు అని కూడా మనకు కొన్ని కధలు ద్వారా తెలియజేస్తున్నారు. ఒక విధంగా ఈ కధలన్నీ - న్యూ మిలీనియంలో, పెద్దలకు పిల్లలకు మధ్య; బంధువులకు స్నేహితులకు మధ్య, భిన్నవర్గాలకు, సంస్కృతులకు చెందిన పరిచయస్తుల మధ్య వెల్లివిరిసిన, రగిలి రేగిన రాగద్వేషాల గాడత పై, విస్త్రుతిపై చాలా సంయమనంతో సాగిన ఒక రనింగ్ కామెంటరీ! ఈ కధలు మనల్ని 'చైతన్య పరుస్తాయి. చక్కలిగింతలు పెడతాయి. మన ఎగుడుదిగుడు జీవితాల్ని నడిపించే జీవన సూత్రాలను చూపిస్తాయి. తట్టిలేపుతాయి. ఇక చదవండి. - డా. వేమూరి కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.