సూపర్ స్టార్ రజనీకాంత్ అయస్కాంతం లాంటి ఆకర్షణ గురించి చెప్పనవసరం లేదు. కానీ వృత్తి పట్ల అంకిత భావం కలిగిన నటుడిగా, తన నిర్మాతల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా, నిరాడంబరమైన మానవతావాదిగా, నిరంతరహాస్యప్రియుడిగా, నిజ జీవితంలో రజని ఎంత మందికి తెలుసు?
రజని తో "అన్నామలై, వీరా, భాషా" లాంటి మెగా హిట్స్ తీసిన దర్శకుడిగా, రజని ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, రజని వ్యక్తిత్వంలో ఈ విభిన్న కోణాల గురించి, ఇంకా ఎన్నో అరుదైన అంశాల గురించి ఈ పుస్తకంలో విశదీకరించారు.
"భాషా తో నేను" అన్న చక్కటి పేరు పెట్టిన ఈ పుస్తకం ద్వారా, పైన చెప్పిన ఈ మూడు చిత్రాల కధలు ఎలాపుట్టాయి. సన్నివేశాల చిత్రీకరణ ఎలా జరిగింది, సంభాషణలు ఎలా రూపుదిద్దుకున్నాయి అన్న ఆసక్తికరమైన విషయాల గురించి, మర్చిపోలేని ఆనాటి అనుభవాల గురించి పాఠకులకు కళ్ళకు కట్టేలా, మనసుకు హత్తుకునేలా, ఓ అందమైన చందమామ కధలా చెప్పారు దర్శకులు సురేష్ కృష్ణ.
ఈ పుస్తకం రజని స్వభావం గురించి, సెట్స్ మీద, సెట్స్ వెనక రజని వ్యవహారశైలి గురించి తెలియజేస్తుంది. ఇంతకు మునుపెన్నడూ, ఎవ్వరూ చెప్పి ఉండనంత విపులంగా, లోతుగా రజని అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ అయస్కాంతం లాంటి ఆకర్షణ గురించి చెప్పనవసరం లేదు. కానీ వృత్తి పట్ల అంకిత భావం కలిగిన నటుడిగా, తన నిర్మాతల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా, నిరాడంబరమైన మానవతావాదిగా, నిరంతరహాస్యప్రియుడిగా, నిజ జీవితంలో రజని ఎంత మందికి తెలుసు? రజని తో "అన్నామలై, వీరా, భాషా" లాంటి మెగా హిట్స్ తీసిన దర్శకుడిగా, రజని ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, రజని వ్యక్తిత్వంలో ఈ విభిన్న కోణాల గురించి, ఇంకా ఎన్నో అరుదైన అంశాల గురించి ఈ పుస్తకంలో విశదీకరించారు. "భాషా తో నేను" అన్న చక్కటి పేరు పెట్టిన ఈ పుస్తకం ద్వారా, పైన చెప్పిన ఈ మూడు చిత్రాల కధలు ఎలాపుట్టాయి. సన్నివేశాల చిత్రీకరణ ఎలా జరిగింది, సంభాషణలు ఎలా రూపుదిద్దుకున్నాయి అన్న ఆసక్తికరమైన విషయాల గురించి, మర్చిపోలేని ఆనాటి అనుభవాల గురించి పాఠకులకు కళ్ళకు కట్టేలా, మనసుకు హత్తుకునేలా, ఓ అందమైన చందమామ కధలా చెప్పారు దర్శకులు సురేష్ కృష్ణ. ఈ పుస్తకం రజని స్వభావం గురించి, సెట్స్ మీద, సెట్స్ వెనక రజని వ్యవహారశైలి గురించి తెలియజేస్తుంది. ఇంతకు మునుపెన్నడూ, ఎవ్వరూ చెప్పి ఉండనంత విపులంగా, లోతుగా రజని అసాధారణమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.