దాస్ కాపిటల్ ను చదవడం ప్రారంభించాను. అందులోని పదాలు, వ్యాక్యాలు అర్ధమవుతున్నకొద్దీ, అక్షరాలు నేలజారడం ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి తరువాత అవి మనుషులుగా మొలకెత్తడం గమనించాను. క్రమంగా ఎదిగి... ఎదిగిన మనుషులు సమూహాలు, సమూహాలుగా గది తలుపులు తెరుచుకొని జనంలో కలవడం మొదలు పెట్టారు. భయంవేసి పుస్తకం చదవడం ఆపాను.
కాని ఆమెలో ఉన్నటువంటి ఆకర్షణే ఆ పుస్తకంలోనూ ఉంది. ఆమెలోని మార్మికతే పుస్తకంలోను ఉంది. పుస్తకాన్ని వాపసు చేద్దామని ఆమె కోసం వెతికాను కనిపించలేదు. ఆమె కనిపించకుండా ఉన్న కొద్ది నాలో ఆరాటం ఎక్కువయింది. పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే ప్రతిసారి, ఒక గొప్ప జనసమూహాన్ని వెంటేసుకొని తిరుగుతున్నట్లుగా ఊపిరాడేది కాదు. ఎట్టకేలకు ఒక రోజు కనిపించింది. పరిగెత్తుతూ ఆమె వద్దకు వెళ్ళాను. పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టాను. ఒకసారి ఆప్యాయంగా దాన్ని నిమిరి తెరిచి చూసింది. పట్టరాని సంతోషం ఆమె కళ్ళల్లో కనిపించింది.
- బెజ్జారపు రవీందర్
దాస్ కాపిటల్ ను చదవడం ప్రారంభించాను. అందులోని పదాలు, వ్యాక్యాలు అర్ధమవుతున్నకొద్దీ, అక్షరాలు నేలజారడం ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి తరువాత అవి మనుషులుగా మొలకెత్తడం గమనించాను. క్రమంగా ఎదిగి... ఎదిగిన మనుషులు సమూహాలు, సమూహాలుగా గది తలుపులు తెరుచుకొని జనంలో కలవడం మొదలు పెట్టారు. భయంవేసి పుస్తకం చదవడం ఆపాను. కాని ఆమెలో ఉన్నటువంటి ఆకర్షణే ఆ పుస్తకంలోనూ ఉంది. ఆమెలోని మార్మికతే పుస్తకంలోను ఉంది. పుస్తకాన్ని వాపసు చేద్దామని ఆమె కోసం వెతికాను కనిపించలేదు. ఆమె కనిపించకుండా ఉన్న కొద్ది నాలో ఆరాటం ఎక్కువయింది. పుస్తకాన్ని చేతిలో పట్టుకొని తిరిగే ప్రతిసారి, ఒక గొప్ప జనసమూహాన్ని వెంటేసుకొని తిరుగుతున్నట్లుగా ఊపిరాడేది కాదు. ఎట్టకేలకు ఒక రోజు కనిపించింది. పరిగెత్తుతూ ఆమె వద్దకు వెళ్ళాను. పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టాను. ఒకసారి ఆప్యాయంగా దాన్ని నిమిరి తెరిచి చూసింది. పట్టరాని సంతోషం ఆమె కళ్ళల్లో కనిపించింది. - బెజ్జారపు రవీందర్
© 2017,www.logili.com All Rights Reserved.