లెక్కకెక్కని మనుషులు
"యేడకి పోతున్నవే?”
ప్లాస్టిక్ బస్త సంచాల కట్టుబట్టలున్నట్లున్నయి. దాన్ని మెత్త లెక్క నెత్తి కింద పెట్టుకొని నేల కొరిగిన యాదగిరిని చూసి అడిగింది మల్లమ్మ. ఆమె బస్సు కోసమే ఎదిరిచూస్తున్నది.
"యేడికి లేదు. పట్నంబోదమని బయలెల్లిన."
"మల్ల యేడికి లేదంటవేందే?" తన చేతిలోని బట్ట సంచిని రొమ్ముకదుముకొని అంది మల్లమ్మ. యాదగిరి దాదాపుగా మల్లమ్మ ఈడే.
"యేమొ ఎటు పోవాల్నో తోస్తలేదు. పట్నమైతే గుంపుల గోవింద అని ఏదైన పన్జేసుకొని బతుకొచ్చని అనుకుంటున్న. ఏది పట్నం బస్సు ఇంక వచ్చినట్లు లేదు.” "ఎక్స్ప్రెస్ వచ్చి పోయింది గద. దానికి పైసలెక్కువైతవని నేనెక్కలేదు. ప్యాసెంజరు బస్సు కోసం చూస్తున్న."
"నువ్వు సుత పట్నమేన?”
"గంతే. గదే అనుకున్న. ఏం జేస్త! మొగుడు పోయి ఐదేండ్లాయె. కొడుకులు ఎవరికి వాల్లే బతుకుతున్నరు. యాలకు గింత కూడు యేసే దిక్కులేనప్పుడేం జేస్తం. పట్నం పోయి బిచ్చమెత్తుకొనయిన బతుకతనని బయలెల్లిన."
మల్లమ్మ గొంతు బరువెక్కింది.
"ఏమైన పైసలు తీస్కొని బయలెల్లినవ?"
"పైసలెక్కడివి నా మొకానికి. బస్సు మందం వున్నయి.”
"నువ్వు నా బాపతే నన్న మాట!" గులిగినట్లుగ అన్నడు యాదగిరి..........................
లెక్కకెక్కని మనుషులు "యేడకి పోతున్నవే?” ప్లాస్టిక్ బస్త సంచాల కట్టుబట్టలున్నట్లున్నయి. దాన్ని మెత్త లెక్క నెత్తి కింద పెట్టుకొని నేల కొరిగిన యాదగిరిని చూసి అడిగింది మల్లమ్మ. ఆమె బస్సు కోసమే ఎదిరిచూస్తున్నది. "యేడికి లేదు. పట్నంబోదమని బయలెల్లిన." "మల్ల యేడికి లేదంటవేందే?" తన చేతిలోని బట్ట సంచిని రొమ్ముకదుముకొని అంది మల్లమ్మ. యాదగిరి దాదాపుగా మల్లమ్మ ఈడే. "యేమొ ఎటు పోవాల్నో తోస్తలేదు. పట్నమైతే గుంపుల గోవింద అని ఏదైన పన్జేసుకొని బతుకొచ్చని అనుకుంటున్న. ఏది పట్నం బస్సు ఇంక వచ్చినట్లు లేదు.” "ఎక్స్ప్రెస్ వచ్చి పోయింది గద. దానికి పైసలెక్కువైతవని నేనెక్కలేదు. ప్యాసెంజరు బస్సు కోసం చూస్తున్న." "నువ్వు సుత పట్నమేన?” "గంతే. గదే అనుకున్న. ఏం జేస్త! మొగుడు పోయి ఐదేండ్లాయె. కొడుకులు ఎవరికి వాల్లే బతుకుతున్నరు. యాలకు గింత కూడు యేసే దిక్కులేనప్పుడేం జేస్తం. పట్నం పోయి బిచ్చమెత్తుకొనయిన బతుకతనని బయలెల్లిన." మల్లమ్మ గొంతు బరువెక్కింది. "ఏమైన పైసలు తీస్కొని బయలెల్లినవ?" "పైసలెక్కడివి నా మొకానికి. బస్సు మందం వున్నయి.” "నువ్వు నా బాపతే నన్న మాట!" గులిగినట్లుగ అన్నడు యాదగిరి..........................© 2017,www.logili.com All Rights Reserved.