భారత రాజ్యాంగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్‌విల్ ఆస్టిన్- మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలనూ, ప్రేరణలనూ, దూరదృష్టినీ కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో, అవసరమైన పాలనా వ్యవస్థల రూపకల్పనలో వారు ఏమేరకు విజయం సాధించారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూలసూత్రాల్లో ప్రస్తుత, భవిష్యత్ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పారు. రాజ్యాంగం సరిగా పనిచేయలేదనడం కేవలం అపోహ మాత్రమే అని వాదించారు.
మేధావులూ న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యార్థులూ, వర్తమాన భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాళ్లూ తప్పక చదవాల్సిన రచన ఇది.
''వస్తువుకు తగినట్టు ఈ రచనా సంవిధానం ఒకవిధమైన హుందాతనంతోకూడి వుంది. శైలి ప్రశంసనీయంగా వుంది.''
- ది ఇకానమిస్ట్
భారత రాజ్యాంగ రూపకల్పన మీద ఇంతవరకూ ప్రచురించబడ్డ వాటిలో చక్కని పఠనీయత, అత్యంత సమగ్రత వున్న పుస్తకం. అత్యుత్తమ రాజనీతి చరిత్ర.''
- జర్నల్ ఆఫ్ ఏసియన్ స్టడీస్
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సహనశీల రాజ్యాంగం రూపుదిద్దుకున్న ఆకర్షణీయమైన, ఒకింత సంక్లిష్టమైన ప్రక్రియపై చేసిన పాండిత్యపరమైన అధ్యయనం, అద్భుతమైన భాష్యం.''
- పబ్లిక్ లా
గ్రాన్‌విల్ ఆస్టిన్ (1927- ) ఒక స్వతంత్ర చరిత్రకారుడు. వాషింగ్‌టన్ డిసిలో నివసిస్తున్నారు. గతంలో ఆయన ''వర్కింగ్ ఎ డెమొక్రాటిక్ కాన్‌స్టిట్యూషన్ : ఎ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఎక్స్‌పీరియన్స్'' అనే పుస్తకాన్ని వెలువరించారు.
అనువాదకులు ప్రభాకర్ మందార 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు.
భారత రాజ్యాంగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాన్‌విల్ ఆస్టిన్- మౌలిక ఆధారాలతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలనూ, ప్రేరణలనూ, దూరదృష్టినీ కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో, అవసరమైన పాలనా వ్యవస్థల రూపకల్పనలో వారు ఏమేరకు విజయం సాధించారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూలసూత్రాల్లో ప్రస్తుత, భవిష్యత్ సమస్యలకు పరిష్కార మార్గాలు వున్నాయని రచయిత చెప్పారు. రాజ్యాంగం సరిగా పనిచేయలేదనడం కేవలం అపోహ మాత్రమే అని వాదించారు. మేధావులూ న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యార్థులూ, వర్తమాన భారతదేశం ఎలా రూపుదిద్దుకుందో తెలుసుకోవాలనే ఆసక్తి వున్నవాళ్లూ తప్పక చదవాల్సిన రచన ఇది. ''వస్తువుకు తగినట్టు ఈ రచనా సంవిధానం ఒకవిధమైన హుందాతనంతోకూడి వుంది. శైలి ప్రశంసనీయంగా వుంది.'' - ది ఇకానమిస్ట్ భారత రాజ్యాంగ రూపకల్పన మీద ఇంతవరకూ ప్రచురించబడ్డ వాటిలో చక్కని పఠనీయత, అత్యంత సమగ్రత వున్న పుస్తకం. అత్యుత్తమ రాజనీతి చరిత్ర.'' - జర్నల్ ఆఫ్ ఏసియన్ స్టడీస్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సహనశీల రాజ్యాంగం రూపుదిద్దుకున్న ఆకర్షణీయమైన, ఒకింత సంక్లిష్టమైన ప్రక్రియపై చేసిన పాండిత్యపరమైన అధ్యయనం, అద్భుతమైన భాష్యం.'' - పబ్లిక్ లా గ్రాన్‌విల్ ఆస్టిన్ (1927- ) ఒక స్వతంత్ర చరిత్రకారుడు. వాషింగ్‌టన్ డిసిలో నివసిస్తున్నారు. గతంలో ఆయన ''వర్కింగ్ ఎ డెమొక్రాటిక్ కాన్‌స్టిట్యూషన్ : ఎ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ ఎక్స్‌పీరియన్స్'' అనే పుస్తకాన్ని వెలువరించారు. అనువాదకులు ప్రభాకర్ మందార 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అందుకున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.