చే ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం-పదవుల కోసం, హోదాకోసం, పేరు కోసం - పాకులాడలేదు. లాటిన్ అమెరికా దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాల్లోని ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం ఒక్కటే మార్గమని చే బలంగా విశ్వసించాడు. గెరిల్లా ఉద్యమానికి సైనిక - రాజకీయ నాయకత్వం ఒకటిగా ఉండాలని, అలాంటి ఐక్య నాయకత్వం నగరాల్లో ఉండే బ్యూరోక్రటిక్ ఆఫీసుల నుండి గాక గెరిల్లా దళం నుండే రావాలని చే గట్టిగా నమ్మాడు. -ఫైడెల్ కాస్ట్రో
చే గువేరా పేరు తెలియని వారు నేడు సాధారణంగా ఉండరు. చే అనగానే ఓ గొప్ప విప్లవ వీరుడు మదిలో స్పురిస్తాడు. అర్జెంటినాలో జన్మించిన చే దేశాలకు అతీతంగా క్యూబా విప్లవ పోరాటంలో ఫైడెల్ కాస్ట్రోత్ పాటు ఓ ప్రధాన భాగస్వామిగా పాల్గొనడమే కాదు, విప్లవం విజయవంతం అయిన తర్వాత ఆ దేశ నిర్మాణంలోనూ ముఖ్యమైన పాత్ర వహించారు. అలా క్యూబాలోనే స్థిరపడిపోయి, అధికారంతో పాటు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచమే తన మాతృభూమి అనుకున్న చే అక్కడ ఉండలేకపోయాడు. క్యూబాలోనే ఉంటూనే కాంగో పోరాటంలో పాల్గొన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మొత్తం లాటిన్ అమెరికాలో విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయాలన్న పధకంలో భాగంగా బోలీవియాలో గెరిల్లా పోరాటం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిమంది విప్లవకారులతో కలిసి 1966 నవంబరులో చే బొలీవియా చేరుకున్నాడు. అక్కడి సైనిక నియంతృత్వపాలకునికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని ఆరంభించాడు. తొలుత కొన్ని విజయాలనూ సాధించాడు. కాని కొద్ది కాలంలోనే సైన్యం గెరిల్లా యోధులను చుట్టుముట్టకలిగింది. చాల మందిని చంపివేసింది. సీఐఏ సహాయంతో బొలీవియా మిలిటరీ 1967 అక్టోబరులో చేను పట్టుకోగలిగింది. ఓ స్కూలు భవనంలో బంధించి కాల్చి చంపివేసింది. పోరాట కాలంలో చే రాసుకున్న డైరీ ఆయన బ్యాక్ ప్యాక్ లో లభించింది. చాలా సరళంగా, సూటిగా రోజువారీ ఘటనలను నమోదుచేసిన ఈ డైరీ చే వ్యక్తిత్వాన్ని ఓ గెరిల్లా యోధునిగా, ఓ విప్లవకారునిగా, ఓ మానవతా మూర్తిగా - ఇలా అనేక కోణాల నుండి ఆవిష్కరిస్తుంది. సీఐఏ అధినంలోకి వెళ్ళిన ఈ డైరీని క్యూబా సంపాదించి, 1968 లో ఆ దేశ అధ్యక్షులు, చే సహయోధుడు అయిన కాస్ట్రో ముందుమాటతో సహా ప్రచురించింది.
అనువాదం:కె.సత్యరంజన్,గుడిపూడి విజయరావు
చే ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం-పదవుల కోసం, హోదాకోసం, పేరు కోసం - పాకులాడలేదు. లాటిన్ అమెరికా దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆయా దేశాల్లోని ప్రజల విముక్తి కోసం విప్లవ సాయుధ గెరిల్లా పోరాటం ఒక్కటే మార్గమని చే బలంగా విశ్వసించాడు. గెరిల్లా ఉద్యమానికి సైనిక - రాజకీయ నాయకత్వం ఒకటిగా ఉండాలని, అలాంటి ఐక్య నాయకత్వం నగరాల్లో ఉండే బ్యూరోక్రటిక్ ఆఫీసుల నుండి గాక గెరిల్లా దళం నుండే రావాలని చే గట్టిగా నమ్మాడు. -ఫైడెల్ కాస్ట్రో చే గువేరా పేరు తెలియని వారు నేడు సాధారణంగా ఉండరు. చే అనగానే ఓ గొప్ప విప్లవ వీరుడు మదిలో స్పురిస్తాడు. అర్జెంటినాలో జన్మించిన చే దేశాలకు అతీతంగా క్యూబా విప్లవ పోరాటంలో ఫైడెల్ కాస్ట్రోత్ పాటు ఓ ప్రధాన భాగస్వామిగా పాల్గొనడమే కాదు, విప్లవం విజయవంతం అయిన తర్వాత ఆ దేశ నిర్మాణంలోనూ ముఖ్యమైన పాత్ర వహించారు. అలా క్యూబాలోనే స్థిరపడిపోయి, అధికారంతో పాటు సుఖవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ప్రపంచమే తన మాతృభూమి అనుకున్న చే అక్కడ ఉండలేకపోయాడు. క్యూబాలోనే ఉంటూనే కాంగో పోరాటంలో పాల్గొన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మొత్తం లాటిన్ అమెరికాలో విప్లవ పోరాటాన్ని విజయవంతం చేయాలన్న పధకంలో భాగంగా బోలీవియాలో గెరిల్లా పోరాటం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. కొద్దిమంది విప్లవకారులతో కలిసి 1966 నవంబరులో చే బొలీవియా చేరుకున్నాడు. అక్కడి సైనిక నియంతృత్వపాలకునికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాన్ని ఆరంభించాడు. తొలుత కొన్ని విజయాలనూ సాధించాడు. కాని కొద్ది కాలంలోనే సైన్యం గెరిల్లా యోధులను చుట్టుముట్టకలిగింది. చాల మందిని చంపివేసింది. సీఐఏ సహాయంతో బొలీవియా మిలిటరీ 1967 అక్టోబరులో చేను పట్టుకోగలిగింది. ఓ స్కూలు భవనంలో బంధించి కాల్చి చంపివేసింది. పోరాట కాలంలో చే రాసుకున్న డైరీ ఆయన బ్యాక్ ప్యాక్ లో లభించింది. చాలా సరళంగా, సూటిగా రోజువారీ ఘటనలను నమోదుచేసిన ఈ డైరీ చే వ్యక్తిత్వాన్ని ఓ గెరిల్లా యోధునిగా, ఓ విప్లవకారునిగా, ఓ మానవతా మూర్తిగా - ఇలా అనేక కోణాల నుండి ఆవిష్కరిస్తుంది. సీఐఏ అధినంలోకి వెళ్ళిన ఈ డైరీని క్యూబా సంపాదించి, 1968 లో ఆ దేశ అధ్యక్షులు, చే సహయోధుడు అయిన కాస్ట్రో ముందుమాటతో సహా ప్రచురించింది. అనువాదం:కె.సత్యరంజన్,గుడిపూడి విజయరావు© 2017,www.logili.com All Rights Reserved.