నాకోసం నేను లేను
ఉంటే ఎవరికోసమున్నాను?
నేనున్నదీ లేనిది తెలిసేది
అసలు నేనుంటేనా?
ఈ జిజ్ఞాసకు పరిష్కారం
ఎలా తెలిసేది?
వీచే వాయువు నడిగి చూశాను.
గాలి బదులు పలికింది ఇలా.......
"అసలు నేనున్నానో
ఉంటే ఎలా ఉన్నానో నాకే తెలియదు.
ప్రపంచమంతా తిరగేసి చూశాను
ఎంతకూ నా రూపం నాకు
అగుపించలేదు.
నేనెలా ఉన్నానో నాకే తెలియనప్పుడు నీ గురించి ఎలా చెప్పను?
అలా అంటూనే
సుదీర్ఘంగా నిట్టూర్చింది వాయువు.
ఆ నిట్టుర్పులో
సమస్త ప్రాణకోటి శ్వాసలు
తమను తాము మేళవించుకున్నాయి.
అంతటితో
నేను అనబడే ఈ నేను
సుదీర్ఘంగా ఉచ్చ్వసించి అన్నాను-
"నేనున్నాను
నాకోసం మాత్రమే కాదు
నా శ్వాసకోసమున్నాను
అంతే కాదు
శ్వాస ఉన్నది నా కోసమే.
మేం పరస్పర సమన్వయంతో
సాగినంత కాలం
వాయు సహకారముంటుంది
రూప రహితంగా ఉన్న ఆ వాయువు నా రూపాన్ని నడిపిస్తుంటుంది."
-సి.నారాయణ రెడ్డి.
నాకోసం నేను లేను ఉంటే ఎవరికోసమున్నాను? నేనున్నదీ లేనిది తెలిసేది అసలు నేనుంటేనా? ఈ జిజ్ఞాసకు పరిష్కారం ఎలా తెలిసేది? వీచే వాయువు నడిగి చూశాను. గాలి బదులు పలికింది ఇలా....... "అసలు నేనున్నానో ఉంటే ఎలా ఉన్నానో నాకే తెలియదు. ప్రపంచమంతా తిరగేసి చూశాను ఎంతకూ నా రూపం నాకు అగుపించలేదు. నేనెలా ఉన్నానో నాకే తెలియనప్పుడు నీ గురించి ఎలా చెప్పను? అలా అంటూనే సుదీర్ఘంగా నిట్టూర్చింది వాయువు. ఆ నిట్టుర్పులో సమస్త ప్రాణకోటి శ్వాసలు తమను తాము మేళవించుకున్నాయి. అంతటితో నేను అనబడే ఈ నేను సుదీర్ఘంగా ఉచ్చ్వసించి అన్నాను- "నేనున్నాను నాకోసం మాత్రమే కాదు నా శ్వాసకోసమున్నాను అంతే కాదు శ్వాస ఉన్నది నా కోసమే. మేం పరస్పర సమన్వయంతో సాగినంత కాలం వాయు సహకారముంటుంది రూప రహితంగా ఉన్న ఆ వాయువు నా రూపాన్ని నడిపిస్తుంటుంది." -సి.నారాయణ రెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.