జ్యోతిష్యగ్రంధములలో యోగ విషయమున "పూర్వ పరాశరి" కీ మించినది లేదు. ఇది "జాతిక చంద్రిక" యని కూడా వ్యవహరింపబడుచున్నది. దీనియందలి 37 శ్లోకములు మాత్రమే పరాశర మహర్షి ప్రణీతములు.
గ్రహములకు ఆధిపత్యము చేతను బలాబలములను నిర్ణయించుటకు ఈ గ్రంథమొక్కటియే యధారము.
ఈ పుస్తకమును అనుభవమునకు సరిపడునట్లుగాను, సాంప్రదాయమున కనుగుణముగాను అనేకములగు ఉదాహరణములు ద్వాదశ లగ్నముల క్రింద తెలియజేశాము.
- యోగావళీ ఖండము
- బాలారిష్ట ఖండము
- ఆయుర్ధాయ ఖండము
- మిశ్రమ ఫల ఖండము
యోగావళీ ఖండము నందు ద్వితీయ భాగము 113 పేజీలలో నవగ్రహము లిచ్చు ఫలితములు పదిహేడు భాగములుగా విభజించి వ్రాశారు.
1. గ్రహ దృష్టులు
2. గ్రహ ఫలములు
3. నైసర్గిక పాపులు - రవి, కుజ, శని
4. నైసర్గిక శుభులు - గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రులు
5. కెంద్రాధిపత్యము - నైసర్గిక శుభులు
6. ద్వితీయ వయ్యాధిపతుల, ధన తృతీయాదిపతుల, లగ్న ధనాదిపతుల బలనిర్ణయం
7. కేంద్ర, కోణ, లాభ, పాప వ్యయాదిపతుల బలనిర్ణయము
8. అష్టమాధిపతి యొక్క బలనిర్ణయం
9. కెంద్రాధిపత్య దోషమునందలి విశేషం
10. గురు, శుక్రుల కేంద్రాదిపత్య దోష నిర్ణయం
11. మారక గ్రహములు
12. బుధ చంద్రుల అష్టమాధిపత్యం
13. కుజుని కేంద్ర, కోణ బలనిర్ణయం
14. రాహు, కేతు గ్రహ బల నిర్ణయం
15. కేంద్ర కోణాధిపతులు - ఇతర సంబంధములు - యోగాది నిర్ణయము
16. పాపాధిపత్య గ్రహ యోగములు
17. దశాంతర్దశా ఫల నిర్ణయము
ఈ ప్రస్తుత వ్యాసము నందు ప్రతి గ్రహమునకును ద్వాదశ లగ్నములకు ఫల నిర్ణయము చేశారు. మిశ్రమ ఫలఖండములో యోగ గ్రహములును, మారక గ్రహములును - ప్రతి లగ్నమునకు విపులముగా విశదికరించి నందున, ఈ భాగమును కూడా ఇందు పొందు పరచితిని.
ఈ కాలము నందలి విద్యార్ధులకు, జ్యోతిష్కులకు ప్రతి లగ్నమునకు నవగ్రహములకు గాని, వాటి పరస్పర సంబంధమునకు గాని, వెనువెంటనే ఫలిత నిర్ణయము గావించుటకు కడు కష్టతరమగును. ఏలయనగా ఒక లగ్నమునకు ఫలితములు కావలేననగా పై పదిహేడు భాగములు మరియు మిశ్రమ ఫలఖండము కలిపి అంశాలను పరిశీలించుటను వివరించాము.
ప్రతి లగ్నమునకు పట్టికలతో సహా చాలా వివరంగా వివరించటం జరిగింది. ఈ విధమైన అవగాహనతో యోగావయోగఫల నిర్ణయములు వెనువెంటనే తెలుసుకొనుటకు సులభమార్గమగునని ఆశించుచున్నాను.
జ్యోతిష్యగ్రంధములలో యోగ విషయమున "పూర్వ పరాశరి" కీ మించినది లేదు. ఇది "జాతిక చంద్రిక" యని కూడా వ్యవహరింపబడుచున్నది. దీనియందలి 37 శ్లోకములు మాత్రమే పరాశర మహర్షి ప్రణీతములు. గ్రహములకు ఆధిపత్యము చేతను బలాబలములను నిర్ణయించుటకు ఈ గ్రంథమొక్కటియే యధారము. ఈ పుస్తకమును అనుభవమునకు సరిపడునట్లుగాను, సాంప్రదాయమున కనుగుణముగాను అనేకములగు ఉదాహరణములు ద్వాదశ లగ్నముల క్రింద తెలియజేశాము. - యోగావళీ ఖండము - బాలారిష్ట ఖండము - ఆయుర్ధాయ ఖండము - మిశ్రమ ఫల ఖండము యోగావళీ ఖండము నందు ద్వితీయ భాగము 113 పేజీలలో నవగ్రహము లిచ్చు ఫలితములు పదిహేడు భాగములుగా విభజించి వ్రాశారు. 1. గ్రహ దృష్టులు 2. గ్రహ ఫలములు 3. నైసర్గిక పాపులు - రవి, కుజ, శని 4. నైసర్గిక శుభులు - గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రులు 5. కెంద్రాధిపత్యము - నైసర్గిక శుభులు 6. ద్వితీయ వయ్యాధిపతుల, ధన తృతీయాదిపతుల, లగ్న ధనాదిపతుల బలనిర్ణయం 7. కేంద్ర, కోణ, లాభ, పాప వ్యయాదిపతుల బలనిర్ణయము 8. అష్టమాధిపతి యొక్క బలనిర్ణయం 9. కెంద్రాధిపత్య దోషమునందలి విశేషం 10. గురు, శుక్రుల కేంద్రాదిపత్య దోష నిర్ణయం 11. మారక గ్రహములు 12. బుధ చంద్రుల అష్టమాధిపత్యం 13. కుజుని కేంద్ర, కోణ బలనిర్ణయం 14. రాహు, కేతు గ్రహ బల నిర్ణయం 15. కేంద్ర కోణాధిపతులు - ఇతర సంబంధములు - యోగాది నిర్ణయము 16. పాపాధిపత్య గ్రహ యోగములు 17. దశాంతర్దశా ఫల నిర్ణయము ఈ ప్రస్తుత వ్యాసము నందు ప్రతి గ్రహమునకును ద్వాదశ లగ్నములకు ఫల నిర్ణయము చేశారు. మిశ్రమ ఫలఖండములో యోగ గ్రహములును, మారక గ్రహములును - ప్రతి లగ్నమునకు విపులముగా విశదికరించి నందున, ఈ భాగమును కూడా ఇందు పొందు పరచితిని. ఈ కాలము నందలి విద్యార్ధులకు, జ్యోతిష్కులకు ప్రతి లగ్నమునకు నవగ్రహములకు గాని, వాటి పరస్పర సంబంధమునకు గాని, వెనువెంటనే ఫలిత నిర్ణయము గావించుటకు కడు కష్టతరమగును. ఏలయనగా ఒక లగ్నమునకు ఫలితములు కావలేననగా పై పదిహేడు భాగములు మరియు మిశ్రమ ఫలఖండము కలిపి అంశాలను పరిశీలించుటను వివరించాము. ప్రతి లగ్నమునకు పట్టికలతో సహా చాలా వివరంగా వివరించటం జరిగింది. ఈ విధమైన అవగాహనతో యోగావయోగఫల నిర్ణయములు వెనువెంటనే తెలుసుకొనుటకు సులభమార్గమగునని ఆశించుచున్నాను.
© 2017,www.logili.com All Rights Reserved.