చెహోవ్ (1860-1904) తన జీవిత కాలంలో ఎనిమిది వందల కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్ లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం.
కఠిన పరిశ్రమకు అలవాటు పడిన పశ్చిమ దేశాల రచయితలు/విమర్శకులు కూడా చెహోవ్ చేసిన కృషిని చూసి ఆశ్చర్యపోతారు. అతడి ఉత్తరాలు, నోట్ బుక్స్ కూడా తరువాతి తరాల రచయితలకు పఠనీయ గ్రంథాలైనాయి. అతడి రచనల్ని ఇతర బాషల్లోకి అనువదించిన వాళ్లకు లెక్కలేదు. అవే కథలు, అవే నాటకాలు - కానీ ఇంచు మించూ ప్రతి పదేళ్లకూ ఓ కొత్త అనువాదం వస్తుంది - కొత్తతరం పాఠకుల కోసం. వందేళ్ళ తర్వాత కూడా నిత్య నూతనంగా ఉన్నాయి చెహోవ్ రచనలు.
కథకులకు, కథాప్రియులకూ ఒక చిన్న కానుక ఈ సంకలనం.
చెహోవ్ (1860-1904) తన జీవిత కాలంలో ఎనిమిది వందల కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్ లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం. కఠిన పరిశ్రమకు అలవాటు పడిన పశ్చిమ దేశాల రచయితలు/విమర్శకులు కూడా చెహోవ్ చేసిన కృషిని చూసి ఆశ్చర్యపోతారు. అతడి ఉత్తరాలు, నోట్ బుక్స్ కూడా తరువాతి తరాల రచయితలకు పఠనీయ గ్రంథాలైనాయి. అతడి రచనల్ని ఇతర బాషల్లోకి అనువదించిన వాళ్లకు లెక్కలేదు. అవే కథలు, అవే నాటకాలు - కానీ ఇంచు మించూ ప్రతి పదేళ్లకూ ఓ కొత్త అనువాదం వస్తుంది - కొత్తతరం పాఠకుల కోసం. వందేళ్ళ తర్వాత కూడా నిత్య నూతనంగా ఉన్నాయి చెహోవ్ రచనలు. కథకులకు, కథాప్రియులకూ ఒక చిన్న కానుక ఈ సంకలనం.© 2017,www.logili.com All Rights Reserved.