క్రీడాకారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే తన ఆటతీరు, నడవడిక, విలక్షణ వ్యక్తిత్వం, అనితర సాధ్యమైన రికార్డులతో కొన్ని తరాలకు అంతులేని ఆనందం కలిగించిన ఆటగాడు సచిన్ రమేశ్ టెండుల్కర్. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా 24 సంవత్సరాల పాటు 600కు పైగా మ్యాచ్ లు ఆడి... డజన్ల కొద్ది ప్రపంచ రికార్డులతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న మొనగాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారి అభిమానం సంపాదించుకొని... యువతలో స్పూర్తి నింపిన క్రికెట్ ఎవరెస్ట్, 'భారతరత్నం సచిన్ కు సంబంధించిన సమగ్ర విశేషాలతో వెలువడుతున్న ఈ అరుదైన పుస్తకంలో నేనూ భాగస్వామిగా ఉండటాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 1984లో నేను పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభిస్తే, 1988లో సచిన్ క్రికెట్ జీవితం ప్రారంభమయ్యింది. ఆ రోజు నుంచి సచిన్ రిటైర్మెంట్ రోజు వరకూ ఈ మహా క్రికెటర్ ఆటలోని సొగసును, వ్యక్తిగా అతని సుగుణాలను ఆస్వాదిస్తూ... ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ గా వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు రాసే అవకాశం, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడాన్ని మించిన గౌరవం మరొకటి లేదని గర్వంగా,సవినయంగా చెబుతున్నాను.
ఎంత ఎత్తుకు ఎదిగినా.. మూలాలు మరచిపోరాదని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న తత్వాన్ని, చేసే పని ఏదైనా సరే... భక్తిశ్రద్ధలు, అంకితభావంతో శ్రమిస్తే.. సాధించలేనిది ఏది ఉండదనడానికి సచిన్ టెండుల్కర్ క్రికెట్ జీవితమే నిదర్శనం .
రెండున్నర దశాబ్దాల పాటు భారత క్రికెట్ రంగంలో తిరుగులేనివాడిగా కొనసాగిన తరతరాలకు చెందిన కోట్లమంది అభిమానం సంపాదించుకొన్న సచిన్ పరిపూర్ణ చాంపియన్. ఈ దేశంలో భారత రాష్ట్రపతి, ప్రధాని ఎవరో తెలియని వారు ఉంటారేమో కానీ సచిన్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆడ, మగ, చిన్న, పెద్ద, ప్రాంతం, దేశం అన్న తేడా లేకుండా కోట్లమంది అభిమానం, ప్రేమ వాత్సల్యం సంపాదించుకొన్న సచిన్ రమేశ్ టెండుల్కర్ భారత మాతకు ముద్దుబిడ్డ మాత్రమే కాదు అమూల్య సంపద కూడా!
- చొప్పరపు కృష్ణారావు
క్రీడాకారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే తన ఆటతీరు, నడవడిక, విలక్షణ వ్యక్తిత్వం, అనితర సాధ్యమైన రికార్డులతో కొన్ని తరాలకు అంతులేని ఆనందం కలిగించిన ఆటగాడు సచిన్ రమేశ్ టెండుల్కర్. ఒకటి కాదు. రెండు కాదు... ఏకంగా 24 సంవత్సరాల పాటు 600కు పైగా మ్యాచ్ లు ఆడి... డజన్ల కొద్ది ప్రపంచ రికార్డులతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న మొనగాడు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారి అభిమానం సంపాదించుకొని... యువతలో స్పూర్తి నింపిన క్రికెట్ ఎవరెస్ట్, 'భారతరత్నం సచిన్ కు సంబంధించిన సమగ్ర విశేషాలతో వెలువడుతున్న ఈ అరుదైన పుస్తకంలో నేనూ భాగస్వామిగా ఉండటాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. 1984లో నేను పాత్రికేయుడిగా జీవితాన్ని ప్రారంభిస్తే, 1988లో సచిన్ క్రికెట్ జీవితం ప్రారంభమయ్యింది. ఆ రోజు నుంచి సచిన్ రిటైర్మెంట్ రోజు వరకూ ఈ మహా క్రికెటర్ ఆటలోని సొగసును, వ్యక్తిగా అతని సుగుణాలను ఆస్వాదిస్తూ... ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ గా వార్తలు, వ్యాసాలు, విశ్లేషణలు రాసే అవకాశం, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడాన్ని మించిన గౌరవం మరొకటి లేదని గర్వంగా,సవినయంగా చెబుతున్నాను. ఎంత ఎత్తుకు ఎదిగినా.. మూలాలు మరచిపోరాదని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న తత్వాన్ని, చేసే పని ఏదైనా సరే... భక్తిశ్రద్ధలు, అంకితభావంతో శ్రమిస్తే.. సాధించలేనిది ఏది ఉండదనడానికి సచిన్ టెండుల్కర్ క్రికెట్ జీవితమే నిదర్శనం . రెండున్నర దశాబ్దాల పాటు భారత క్రికెట్ రంగంలో తిరుగులేనివాడిగా కొనసాగిన తరతరాలకు చెందిన కోట్లమంది అభిమానం సంపాదించుకొన్న సచిన్ పరిపూర్ణ చాంపియన్. ఈ దేశంలో భారత రాష్ట్రపతి, ప్రధాని ఎవరో తెలియని వారు ఉంటారేమో కానీ సచిన్ గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆడ, మగ, చిన్న, పెద్ద, ప్రాంతం, దేశం అన్న తేడా లేకుండా కోట్లమంది అభిమానం, ప్రేమ వాత్సల్యం సంపాదించుకొన్న సచిన్ రమేశ్ టెండుల్కర్ భారత మాతకు ముద్దుబిడ్డ మాత్రమే కాదు అమూల్య సంపద కూడా! - చొప్పరపు కృష్ణారావు© 2017,www.logili.com All Rights Reserved.