మార్క్సిస్టు మూలసూత్రాలను బాగా వంటపట్టించుకున్న రావు కృష్ణారావుగారు, మార్క్సిస్టు సాహిత్యాన్ని ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని, అతి సరళంగా విశదీకరిస్తూ అనేక వ్యాసాలూ, పుస్తకాలు రాశారు. అనువాదాలు చేశారు. బహుళ ప్రాంతాల్లో లభ్యమయ్యే తాత్వికాంశాలను కూర్చి నిఘంటువును తయారుచేశారు. ఆంద్రదేశంలో మొదటి సారిగా ఈ విధమైన ప్రయత్నం చేసింది రావు కృష్ణారావు గారే! ఈ మధ్యకాలంలోనే సవరణలతో పునర్ముద్రించిన 'పెట్టుబడి' గ్రంథాన్ని వెలువరించడంలో ప్రముఖ పాత్ర వహించారు.
అలాంటి రావు కృష్ణారావు సమకాలీన సమాజాన్ని మార్క్సిస్టు సులోచనాలతో చూసి, అందులోని కుళ్ళునూ, కుతంత్రాలనూ, రాజకీయాలనూ వ్యంగ్య వ్యాఖ్యానాలతో పలు పత్రికల ద్వారా కడిగిపారేశారు. ఆ వ్యాఖ్యానాల సంకలనమే 'జంగాలోపాఖ్యానం'. సమాజం అభ్యుదయ పథంలో నడవాలనుకునే వారే గాక, రాజకీయాల్లో నిత్యం తలమునకలయ్యేవారు కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. చదవగలరనడంలో సందేహం లేదు. అందువల్ల జంగాలోపాఖ్యానాన్ని తెలుగు పాఠకులకు సవినయంగా అందిస్తోంది.
- గడ్డం కోటేశ్వరరావు
మార్క్సిస్టు మూలసూత్రాలను బాగా వంటపట్టించుకున్న రావు కృష్ణారావుగారు, మార్క్సిస్టు సాహిత్యాన్ని ప్రత్యేకించి తత్వశాస్త్రాన్ని, అతి సరళంగా విశదీకరిస్తూ అనేక వ్యాసాలూ, పుస్తకాలు రాశారు. అనువాదాలు చేశారు. బహుళ ప్రాంతాల్లో లభ్యమయ్యే తాత్వికాంశాలను కూర్చి నిఘంటువును తయారుచేశారు. ఆంద్రదేశంలో మొదటి సారిగా ఈ విధమైన ప్రయత్నం చేసింది రావు కృష్ణారావు గారే! ఈ మధ్యకాలంలోనే సవరణలతో పునర్ముద్రించిన 'పెట్టుబడి' గ్రంథాన్ని వెలువరించడంలో ప్రముఖ పాత్ర వహించారు. అలాంటి రావు కృష్ణారావు సమకాలీన సమాజాన్ని మార్క్సిస్టు సులోచనాలతో చూసి, అందులోని కుళ్ళునూ, కుతంత్రాలనూ, రాజకీయాలనూ వ్యంగ్య వ్యాఖ్యానాలతో పలు పత్రికల ద్వారా కడిగిపారేశారు. ఆ వ్యాఖ్యానాల సంకలనమే 'జంగాలోపాఖ్యానం'. సమాజం అభ్యుదయ పథంలో నడవాలనుకునే వారే గాక, రాజకీయాల్లో నిత్యం తలమునకలయ్యేవారు కూడా ఈ పుస్తకాన్ని తప్పక చదవాలి. చదవగలరనడంలో సందేహం లేదు. అందువల్ల జంగాలోపాఖ్యానాన్ని తెలుగు పాఠకులకు సవినయంగా అందిస్తోంది. - గడ్డం కోటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.