ఫిబ్రవరి 2, 1886 న జన్మించిన కొండ వెంకటప్పయ్యగారు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రదేశ జాతియోధ్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశభక్త బిరుదును పొందారు. వారి జన్మ కాలం నుండి 1932 వరకు వారి ఆత్మకథ ఇది. ఆనాటి జాతీయోద్యమ చరిత్ర నేపథ్యంగా కలిగిన ఈ ఆత్మకథను ఒక విధంగా జాతియోధ్యమ గాధగానే భావించాలి. దేశభక్త జీవితానికి, దేశ చరిత్రకు అభేదమే. వెంకటప్పయ్య పంతులుగారు 1948 ఆగష్టు 15 న స్వర్గవాసి అయ్యారు.
ఈ మహాసభలో స్వరాజ్య వాదులే ప్రబలముగానుండిరి. శ్యామ ప్రసాదముఖర్జి మున్నగు వారు స్వరాజ్య వాదమును తీవ్రముగా ఖండించిరి. కానీ స్వరాజ్యవాదులపక్షమే నేగ్గెను. మహాసభకు ఆంధ్రదేశ స్త్రీలు పలువురు ప్రేక్షకులుగా వచ్చిరి. మహాసభ నిరుపమానముగా సాగేనని ఎల్లరును సంతసించిరి. సాంబమూర్తిగారు పుత్రా శోకమును లక్ష్యము చేయక మహాసభా కార్యములందు నిమగ్నుడై కృషి సల్పినందుకు శ్రీమతి సరోజినీ దేవి ఆయనను ప్రస్తుతించెను. దక్షిణాత్యులు బుద్ది సూక్ష్మతయందు ప్రసిద్దులనియు, ఆంధ్రుల హృదయ పరిపాకమున శ్రేష్టులనియు, ఆమె ప్రసంగించెను. అప్పటికి ఆంధ్రులు స్వతంత్రులు, సమర్దులునగు ప్రత్యేకోపజాతి యను విషయము భారత దేశమున నేల్లరకు తెల్లమాయెను.
-డి.చంద్రశేఖరరెడ్డి.
ఫిబ్రవరి 2, 1886 న జన్మించిన కొండ వెంకటప్పయ్యగారు భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రదేశ జాతియోధ్యమంలో చిరస్థాయిగా నిలిచిపోయారు. దేశభక్త బిరుదును పొందారు. వారి జన్మ కాలం నుండి 1932 వరకు వారి ఆత్మకథ ఇది. ఆనాటి జాతీయోద్యమ చరిత్ర నేపథ్యంగా కలిగిన ఈ ఆత్మకథను ఒక విధంగా జాతియోధ్యమ గాధగానే భావించాలి. దేశభక్త జీవితానికి, దేశ చరిత్రకు అభేదమే. వెంకటప్పయ్య పంతులుగారు 1948 ఆగష్టు 15 న స్వర్గవాసి అయ్యారు. ఈ మహాసభలో స్వరాజ్య వాదులే ప్రబలముగానుండిరి. శ్యామ ప్రసాదముఖర్జి మున్నగు వారు స్వరాజ్య వాదమును తీవ్రముగా ఖండించిరి. కానీ స్వరాజ్యవాదులపక్షమే నేగ్గెను. మహాసభకు ఆంధ్రదేశ స్త్రీలు పలువురు ప్రేక్షకులుగా వచ్చిరి. మహాసభ నిరుపమానముగా సాగేనని ఎల్లరును సంతసించిరి. సాంబమూర్తిగారు పుత్రా శోకమును లక్ష్యము చేయక మహాసభా కార్యములందు నిమగ్నుడై కృషి సల్పినందుకు శ్రీమతి సరోజినీ దేవి ఆయనను ప్రస్తుతించెను. దక్షిణాత్యులు బుద్ది సూక్ష్మతయందు ప్రసిద్దులనియు, ఆంధ్రుల హృదయ పరిపాకమున శ్రేష్టులనియు, ఆమె ప్రసంగించెను. అప్పటికి ఆంధ్రులు స్వతంత్రులు, సమర్దులునగు ప్రత్యేకోపజాతి యను విషయము భారత దేశమున నేల్లరకు తెల్లమాయెను. -డి.చంద్రశేఖరరెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.