సైన్స్ చరిత్ర మరే చరిత్రకూ తీసిపోదు. ఒక్కొక్క శాస్త్రీయ విజయం వెనుక మరుగున పడిన ఎన్నో విశేషాలు వుంటాయి. రసాయన శాస్త్రంలో "విరళ మృత్తికల" చరిత్ర అలాంటిదే. నేడు లాంధనైడులుగా సుపరిచితమైన విరళమృత్తిక మూలకాలకు అసలా పేరెలా వచ్చిందో, అవి ఒకదాన్నోకటి ఎందుకు అంత దగ్గరి పోలికలు కలిగి ఉంటాయో, చివరకు వాటినెలా వేరుచేయగలిగారో ఈ పుస్తకం వివరిస్తుంది.
విరళ మృత్తిక మూలకాల రహస్యాలు తెలుసుకోడానికి ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాల పాటు ఎంతగానో కృషి చేశారు. సముద్రంలో మునిగిపోయిన సత్యాన్ని వెలికితీయడానికి వారు పడిన కష్టాలు వర్ణనాతీతం. కాలగతిలో ఈ లాంధనైడు మూలకాల జీవిత కధలు కూడా సస్పెన్స్ ద్రిల్లర్ లను తలపిస్తాయి.
ఏ పుస్తకాలలోనూ దొరకని "విరళమృత్తిక" మూలకాల విలువైన చరిత్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది సైన్స్ విద్యార్ధులకు, టీచర్లు, అధ్యాపకులకే కాకుండా సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్ర పరిశోధకుడు డి.ఎన్. త్రిఫోనోవ్ విరళ మృత్తికల ఈ అద్భుత చరిత్రను వెలుగులోకీ తెచ్చారు. 1932లో పుట్టిన ద్మిత్రి నికొలాయెవిచ్ త్రిఫొనోవ్ మాస్కో విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం చదివారు. మూలకాల ఆవర్తన వ్యవస్థ చరిత్రపై, ఇతర అంశాలపై సోవియట్ విజ్ఞానశాస్త్ర పరిషత్తులో విస్తృతంగా పరిశోధన చేశారు.
- డి.ఎన్. త్రిఫొనోవ్
సైన్స్ చరిత్ర మరే చరిత్రకూ తీసిపోదు. ఒక్కొక్క శాస్త్రీయ విజయం వెనుక మరుగున పడిన ఎన్నో విశేషాలు వుంటాయి. రసాయన శాస్త్రంలో "విరళ మృత్తికల" చరిత్ర అలాంటిదే. నేడు లాంధనైడులుగా సుపరిచితమైన విరళమృత్తిక మూలకాలకు అసలా పేరెలా వచ్చిందో, అవి ఒకదాన్నోకటి ఎందుకు అంత దగ్గరి పోలికలు కలిగి ఉంటాయో, చివరకు వాటినెలా వేరుచేయగలిగారో ఈ పుస్తకం వివరిస్తుంది. విరళ మృత్తిక మూలకాల రహస్యాలు తెలుసుకోడానికి ఎన్నో దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్దాల పాటు ఎంతగానో కృషి చేశారు. సముద్రంలో మునిగిపోయిన సత్యాన్ని వెలికితీయడానికి వారు పడిన కష్టాలు వర్ణనాతీతం. కాలగతిలో ఈ లాంధనైడు మూలకాల జీవిత కధలు కూడా సస్పెన్స్ ద్రిల్లర్ లను తలపిస్తాయి. ఏ పుస్తకాలలోనూ దొరకని "విరళమృత్తిక" మూలకాల విలువైన చరిత్రను ఈ పాపులర్ సైన్స్ పుస్తకం వివరిస్తుంది. ఇది సైన్స్ విద్యార్ధులకు, టీచర్లు, అధ్యాపకులకే కాకుండా సైన్సు పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉంటుంది. సుప్రసిద్ధ పాపులర్ సైన్స్ రచయిత, రసాయనశాస్త్ర చరిత్ర పరిశోధకుడు డి.ఎన్. త్రిఫోనోవ్ విరళ మృత్తికల ఈ అద్భుత చరిత్రను వెలుగులోకీ తెచ్చారు. 1932లో పుట్టిన ద్మిత్రి నికొలాయెవిచ్ త్రిఫొనోవ్ మాస్కో విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్రం చదివారు. మూలకాల ఆవర్తన వ్యవస్థ చరిత్రపై, ఇతర అంశాలపై సోవియట్ విజ్ఞానశాస్త్ర పరిషత్తులో విస్తృతంగా పరిశోధన చేశారు. - డి.ఎన్. త్రిఫొనోవ్© 2017,www.logili.com All Rights Reserved.