చిట్టడవిలో చిన్న ప్రాణులు పర్యావరణం పై బాలల నవల. పిల్లల్ని అలరించే విధంగా డి. సుజాతా దేవి గారు ఈ పుస్తకాన్ని అందించారు.
డి. సుజాతా దేవి(రచయిత్రి పరిచయం) :
2013బాల సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రి శ్రీమతి డి. సుజాతా దేవి - తెలుగు సాహిత్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.పట్టా పొందారు.
ఆంధ్ర మహిళాసభ "సాక్షరతా భవన్"లో సహాయ సంపాదకులుగాను ; సీ.పి. బ్రౌన్ అకాడమిలో ఉపసంపాదకులుగాను పనిచేశారు.
ఎక్కువగా బాలసాహిత్యం పై కృషి చేసిన వీరు - పిల్లల కోసం - పాటలు; పద్యకధలు; నవలికలు; తెలుగు మాట్లాడ్డం; వాక్యనిర్మాణంపైన - పదికీపైగా పుస్తకాలు; అరడజనుకు పైగా పాటలు; కధలపుస్తకాలు వెలువరించారు.
"వయోజనవిద్య" వ్యాప్తికోసం డజనుకుపైన పుస్తకాలు రాసి ప్రచురించారు. "కొక్కోరోకో" - బాలల చలన చిత్రానికిగాను వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 1986లో "స్వర్ణనంది" బహుమతిని పొందారు.
'బాలలసాహిత్యం' పై కృషికీగాను అనేక బహుమతులు, సన్మానాలు, "కవిసత్కారాలు" పొందారు.
"ఆకాశవాణి", "దూరదర్శన్"లలో వీరి కధలు, పాటలు అనేకం ప్రసారమయ్యాయి. వీరి రచనలు హిందీ, కన్నడ, ఒరియా, మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి.
26-04-1949న జన్మించి, శ్రీ డి.నారాయణరావు గారిని వివాహమాడిన శ్రీమతి సుజాత "నల్లగొండ" నివాసి.
చిట్టడవిలో చిన్న ప్రాణులు పర్యావరణం పై బాలల నవల. పిల్లల్ని అలరించే విధంగా డి. సుజాతా దేవి గారు ఈ పుస్తకాన్ని అందించారు. డి. సుజాతా దేవి(రచయిత్రి పరిచయం) : 2013బాల సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత్రి శ్రీమతి డి. సుజాతా దేవి - తెలుగు సాహిత్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.పట్టా పొందారు. ఆంధ్ర మహిళాసభ "సాక్షరతా భవన్"లో సహాయ సంపాదకులుగాను ; సీ.పి. బ్రౌన్ అకాడమిలో ఉపసంపాదకులుగాను పనిచేశారు. ఎక్కువగా బాలసాహిత్యం పై కృషి చేసిన వీరు - పిల్లల కోసం - పాటలు; పద్యకధలు; నవలికలు; తెలుగు మాట్లాడ్డం; వాక్యనిర్మాణంపైన - పదికీపైగా పుస్తకాలు; అరడజనుకు పైగా పాటలు; కధలపుస్తకాలు వెలువరించారు. "వయోజనవిద్య" వ్యాప్తికోసం డజనుకుపైన పుస్తకాలు రాసి ప్రచురించారు. "కొక్కోరోకో" - బాలల చలన చిత్రానికిగాను వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 1986లో "స్వర్ణనంది" బహుమతిని పొందారు. 'బాలలసాహిత్యం' పై కృషికీగాను అనేక బహుమతులు, సన్మానాలు, "కవిసత్కారాలు" పొందారు. "ఆకాశవాణి", "దూరదర్శన్"లలో వీరి కధలు, పాటలు అనేకం ప్రసారమయ్యాయి. వీరి రచనలు హిందీ, కన్నడ, ఒరియా, మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. 26-04-1949న జన్మించి, శ్రీ డి.నారాయణరావు గారిని వివాహమాడిన శ్రీమతి సుజాత "నల్లగొండ" నివాసి.© 2017,www.logili.com All Rights Reserved.