ఇందులో పూర్ణచంద్ర తేజస్వి గారి 5 కధలకు జతగా మరో ఇతర రచయితల 10 కధలను కలగల్పి పుస్తక రూపంగా మీ ముందు ఉంది. ఈ అనువాద సంకలనంలో స్థానం పొందిన కధలు పలు భారతీయ మరియు విదేశి భాషలలోకి అనువదించబడినవి. ముఖ్యంగా తేజస్వి రచనలు పలుమార్లు పునర్ముద్రణ పొందుతున్నవి. వీరి రచనలు దేశ విదేశీ పురస్కరాలెన్నో కైవసం చేసుకోనియున్నారు. ప్రకృతి, పర్యావరణం, సేంద్రీయ వ్యవసాయం, ఫోటోగ్రఫీ, సంగీతం, సాహిత్యం, మిత్రులతో సాహిత్య విమర్శలు, రైతు పోరాటాలు, తిరుగాట..... మొదలైన వాటిలో వారి జీవితం ఘనంగా సాగింది.వారి రచనలు ఇవే కధావస్తువులుగా కనపడతాయి. నా అనువాద రచనలకు వారే నాయకుడు.
- శాఖమూరు రామగోపాల్
కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయాలనే దొడ్డ భావనగల డాక్టర్ మల్లెల రామయ్య సహాయంతో రచయిత అందించిన అనువాద సంకలనమే ఈ పుస్తకం. జనం అజ్ఞానం లోంచి మరింత అజ్ఞానంలోకి ఎలా దిగజారిపోతారో చెబుతుంది ఇందులో టైటిల్ కధ. భైరవపురం గ్రామ ప్రజల్లో మూడనమ్మకాలు పారద్రోలి శాస్త్రీయ వైద్య విజ్ఞానం అందించాలని సంకల్పించుకుంటాడు డాక్టర్ కు బి (కుబేరనాధరావ్) కు బి ఊర్లో పెద్ద మనిషి కూడా. ఇంతలో గ్రామ యువతి ఇయాళ పై అత్యాచారం, హత్య మిస్టరీగా మారుతుంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయి ఈ కధలో ఒక కీలక పాత్రదారి. దాన్ని డైనమైట్ తో బద్దలు కొట్టేందుకు వచ్చిన కులీ లోకయ్య తన మధుమేహ వ్యాధి నివారణకు రజస్వల కానీ యువతిని అనుభవించాలనే మూడనమ్మకంతో ఇయాళనూ తనే చెరిచి చంపానని ఆసుపత్రిలో చావబోయే ముందు డాక్టర్ కు బి కి నిజం చెబుతాడు. డాక్టర్ కుబి ప్రేతాత్మతో మాట్లాడి నిజం రాబట్టాడని గ్రామంలో ప్రచారం జరుగుతుంది. బండరాయి పూజనీయ స్థలంగా మారుతుంది. ప్రజల్ని ఉద్దరించాలని డాక్టర్ తలపోస్తే గ్రామంలో అందుకు విరుద్దంగా జరుగుతుంది. ఇందులోని కధలన్నీ ఇలా సందేశాత్మకంగా పొరుగు రాష్ట్రపు కధా సాహిత్య గొప్పదనాన్ని మనకు పరిచయం చేస్తాయి.
- పుస్తక సమీక్ష నవ్య
ఇందులో పూర్ణచంద్ర తేజస్వి గారి 5 కధలకు జతగా మరో ఇతర రచయితల 10 కధలను కలగల్పి పుస్తక రూపంగా మీ ముందు ఉంది. ఈ అనువాద సంకలనంలో స్థానం పొందిన కధలు పలు భారతీయ మరియు విదేశి భాషలలోకి అనువదించబడినవి. ముఖ్యంగా తేజస్వి రచనలు పలుమార్లు పునర్ముద్రణ పొందుతున్నవి. వీరి రచనలు దేశ విదేశీ పురస్కరాలెన్నో కైవసం చేసుకోనియున్నారు. ప్రకృతి, పర్యావరణం, సేంద్రీయ వ్యవసాయం, ఫోటోగ్రఫీ, సంగీతం, సాహిత్యం, మిత్రులతో సాహిత్య విమర్శలు, రైతు పోరాటాలు, తిరుగాట..... మొదలైన వాటిలో వారి జీవితం ఘనంగా సాగింది.వారి రచనలు ఇవే కధావస్తువులుగా కనపడతాయి. నా అనువాద రచనలకు వారే నాయకుడు. - శాఖమూరు రామగోపాల్ కన్నడ భాషా సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయాలనే దొడ్డ భావనగల డాక్టర్ మల్లెల రామయ్య సహాయంతో రచయిత అందించిన అనువాద సంకలనమే ఈ పుస్తకం. జనం అజ్ఞానం లోంచి మరింత అజ్ఞానంలోకి ఎలా దిగజారిపోతారో చెబుతుంది ఇందులో టైటిల్ కధ. భైరవపురం గ్రామ ప్రజల్లో మూడనమ్మకాలు పారద్రోలి శాస్త్రీయ వైద్య విజ్ఞానం అందించాలని సంకల్పించుకుంటాడు డాక్టర్ కు బి (కుబేరనాధరావ్) కు బి ఊర్లో పెద్ద మనిషి కూడా. ఇంతలో గ్రామ యువతి ఇయాళ పై అత్యాచారం, హత్య మిస్టరీగా మారుతుంది. రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాయి ఈ కధలో ఒక కీలక పాత్రదారి. దాన్ని డైనమైట్ తో బద్దలు కొట్టేందుకు వచ్చిన కులీ లోకయ్య తన మధుమేహ వ్యాధి నివారణకు రజస్వల కానీ యువతిని అనుభవించాలనే మూడనమ్మకంతో ఇయాళనూ తనే చెరిచి చంపానని ఆసుపత్రిలో చావబోయే ముందు డాక్టర్ కు బి కి నిజం చెబుతాడు. డాక్టర్ కుబి ప్రేతాత్మతో మాట్లాడి నిజం రాబట్టాడని గ్రామంలో ప్రచారం జరుగుతుంది. బండరాయి పూజనీయ స్థలంగా మారుతుంది. ప్రజల్ని ఉద్దరించాలని డాక్టర్ తలపోస్తే గ్రామంలో అందుకు విరుద్దంగా జరుగుతుంది. ఇందులోని కధలన్నీ ఇలా సందేశాత్మకంగా పొరుగు రాష్ట్రపు కధా సాహిత్య గొప్పదనాన్ని మనకు పరిచయం చేస్తాయి. - పుస్తక సమీక్ష నవ్య
© 2017,www.logili.com All Rights Reserved.