జీవితం అన్నిటికంటే అత్యంత విలువైనది. ప్రాచీనకాలం నుంచి, జీవితాన్ని ప్రేమిస్తున్న, శాంతిని ప్రేమిస్తున్న, ఒకినావా ప్రాంతంవారు చెప్పుకునే సామెత ఇది. జగద్విఖ్యాతుడైన నెపోలియన్ ను కూడా ఒకినావా ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. "ఆయుధాలు లేని దేశం నిజంగానే ఎక్కడైనా ఉండగలదా?" అంటూ ఆయన నిర్ఘాంతపోయినాడట.
ఆయుధాలు కలిగియున్న దేశాలు గత కొన్ని శతాబ్దాల కాలంలో, ఒకినావాతో హీనంగా ప్రవర్తించినాయి. రకరకాల రంగుల పూలు, మనకు అందాలు తొడిగే పగడాల భూమి ఒకినావాలో, కొంత బాధాకరమైన చరిత్ర సృష్టించబడింది. ఈ సౌందర్యాల సీమను కొన్ని విషాదకరమైన గాధలకు, బలవంతంగా వేదిక చేశారు.
చరిత్రలో నీవు ఒకినావా గురించి చదివితే, దాన్ని ర్యూక్యూ కూడా అనే వారని తెలుస్తుంది. ర్యూక్యూ లేదా ఒకినావా వాసులు, చారిత్రకంగా జవసత్వల గాత్రులుగా విశ్వాస పాత్రులుగా జీవించారు. వారు అర్హత కలిగి ఉన్న, సుఖ సౌఖ్యాలన్నింటితో వారు జీవించాలని నేను కోరుకుంటూ, అత్యధికంగా కష్టాల పాలైన ప్రజలకు అత్యధికమైన ఆనందాన్ని బహుకరించాలనే ఆకాంక్షతో నేను 'ర్యో' ను గురించి ఈ కధను వ్రాశాను.
- దైసాకు ఇకడా
జీవితం అన్నిటికంటే అత్యంత విలువైనది. ప్రాచీనకాలం నుంచి, జీవితాన్ని ప్రేమిస్తున్న, శాంతిని ప్రేమిస్తున్న, ఒకినావా ప్రాంతంవారు చెప్పుకునే సామెత ఇది. జగద్విఖ్యాతుడైన నెపోలియన్ ను కూడా ఒకినావా ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. "ఆయుధాలు లేని దేశం నిజంగానే ఎక్కడైనా ఉండగలదా?" అంటూ ఆయన నిర్ఘాంతపోయినాడట. ఆయుధాలు కలిగియున్న దేశాలు గత కొన్ని శతాబ్దాల కాలంలో, ఒకినావాతో హీనంగా ప్రవర్తించినాయి. రకరకాల రంగుల పూలు, మనకు అందాలు తొడిగే పగడాల భూమి ఒకినావాలో, కొంత బాధాకరమైన చరిత్ర సృష్టించబడింది. ఈ సౌందర్యాల సీమను కొన్ని విషాదకరమైన గాధలకు, బలవంతంగా వేదిక చేశారు. చరిత్రలో నీవు ఒకినావా గురించి చదివితే, దాన్ని ర్యూక్యూ కూడా అనే వారని తెలుస్తుంది. ర్యూక్యూ లేదా ఒకినావా వాసులు, చారిత్రకంగా జవసత్వల గాత్రులుగా విశ్వాస పాత్రులుగా జీవించారు. వారు అర్హత కలిగి ఉన్న, సుఖ సౌఖ్యాలన్నింటితో వారు జీవించాలని నేను కోరుకుంటూ, అత్యధికంగా కష్టాల పాలైన ప్రజలకు అత్యధికమైన ఆనందాన్ని బహుకరించాలనే ఆకాంక్షతో నేను 'ర్యో' ను గురించి ఈ కధను వ్రాశాను. - దైసాకు ఇకడా© 2017,www.logili.com All Rights Reserved.