తెలుగు రాయడం, చదవడం తక్కువైపోతున్న తరంలో, తెలుగు అక్షరాన్ని నమ్ముకుని, తన కెరీర్ని అక్షరం ద్వారానే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న కడలిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటి తరంలో, చదువైపోగానే సాహిత్యాన్ని వృత్తిగా స్వీకరిస్తున్న కొద్దిమంది ధైర్యవంతులైన యువతీ యువకుల్లో కడలి ఒకరు. 'లెటర్స్ టు లవ్' అనే లేఖా సాహిత్యం ద్వారా ఒక సంచలనం సృష్టించి, ఇప్పుడు తన కథలతో ముందుకొస్తున్న 'కడలి కథలు' చదవడం ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఆమె భాష చాలా సులభంగా ఉంటుంది. తనదికాని అంశాల గురించి నేల విడిచి సాము చేయకుండా, ఆమె ఎన్నుకునే కథాంశాలు తన కాంటెంపరరీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. -
ఈ కథలు కడలిని తెలుగు సాహిత్యంలో మరో మెట్టు ఎక్కిస్తాయి. రచయితలు తమ కథలను ఎక్కడో దగ్గర ప్రచురించి, కొంత వేలిడేషన్ సంపాదించాక కథల పుస్తకంగా వేస్తున్న కాలంలో, తను రాసిన చాలా కథలను డైరెక్ట్ గా పుస్తకంగా తీసుకొచ్చి కూడా తన ధిక్కార ధోరణి ప్రకటించింది కడలి. రాబోయే కాలంలో వేలిడేషన్ కంటే ఎక్స్ ప్రెషనే ముఖ్యం అని ముందే గ్రహించిన కడలి ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. సాహిత్యంలో తనకంటూ ఒక స్థానం కల్పించుకుంటున్న కడలికి అభినందనలు.
- వెంకట్ శిద్ధారెడ్డి
తెలుగు రాయడం, చదవడం తక్కువైపోతున్న తరంలో, తెలుగు అక్షరాన్ని నమ్ముకుని, తన కెరీర్ని అక్షరం ద్వారానే నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్న కడలిని చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పటి తరంలో, చదువైపోగానే సాహిత్యాన్ని వృత్తిగా స్వీకరిస్తున్న కొద్దిమంది ధైర్యవంతులైన యువతీ యువకుల్లో కడలి ఒకరు. 'లెటర్స్ టు లవ్' అనే లేఖా సాహిత్యం ద్వారా ఒక సంచలనం సృష్టించి, ఇప్పుడు తన కథలతో ముందుకొస్తున్న 'కడలి కథలు' చదవడం ఒక ప్లెజెంట్ ఫీలింగ్. ఆమె భాష చాలా సులభంగా ఉంటుంది. తనదికాని అంశాల గురించి నేల విడిచి సాము చేయకుండా, ఆమె ఎన్నుకునే కథాంశాలు తన కాంటెంపరరీ జీవితాలను ప్రతిబింబిస్తాయి. - ఈ కథలు కడలిని తెలుగు సాహిత్యంలో మరో మెట్టు ఎక్కిస్తాయి. రచయితలు తమ కథలను ఎక్కడో దగ్గర ప్రచురించి, కొంత వేలిడేషన్ సంపాదించాక కథల పుస్తకంగా వేస్తున్న కాలంలో, తను రాసిన చాలా కథలను డైరెక్ట్ గా పుస్తకంగా తీసుకొచ్చి కూడా తన ధిక్కార ధోరణి ప్రకటించింది కడలి. రాబోయే కాలంలో వేలిడేషన్ కంటే ఎక్స్ ప్రెషనే ముఖ్యం అని ముందే గ్రహించిన కడలి ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది. సాహిత్యంలో తనకంటూ ఒక స్థానం కల్పించుకుంటున్న కడలికి అభినందనలు. - వెంకట్ శిద్ధారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.