'పరిశోధనా ప్రోతస్విని'
'ధర్మార్థ కామ మోక్షం వైచక్షణ్యం కళాసు చ
కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవణం'
అని చతుర్వర్ణ వ్యుత్పత్తియే కావ్య ప్రయోజనాలని
వ్యక్తం చేసినట్లుగా అవగాహన చేసికొనవచ్చును. ఇది భామహుని అభిప్రాయం. ఈ సందర్భంగా కావ్య ప్రకాశ కర్త
'కావ్యం యశసే, అర్థకృతే వ్యవహార విదే శివేత రక్షతయే
సద్యః పరినిర్వృతయే కాంతాసమ్మిత తయోప దేశయుజే'
దక్షా దీక్షను కలిగిన కవిపుంగవునకు పైన పేర్కొన్న లక్షణాలన్నీ వర్తిస్తాయి. ప్రతిభావ్యుత్పత్తి అభ్యాసాలను కలిగిన వ్యక్తే కవిశ్రేష్ఠుడు. రచనా వైదుష్యం తొలి నుండి తుది దాకా కన్పిస్తుంది. ఈ సద్గుణ రచన ఆధునికమైనప్పటికీ ప్రాచీన లక్షణాలు అంటే ప్రత్యేకంగా ఆధునిక కవితా ప్రాదుర్భావం ప్రస్ఫుటంగా ప్రవర్తిల్లుతుంది. ఆధునిక రచనలకు, వచన పద్యరూపంలో తీర్చిదిద్దిన ఆద్యుడు కుందుర్తి ఆంజనేయులు. సంప్రదాయ సాహిత్య లక్షణాలు వైదొలగి నూతనత్వానికి నాంది ఆరంభమైంది. నవల, కథ, కథానికా మొదలైన ఆధునిక రచనలు అర్వాచీనకాలంలో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రచనలను ప్రాతిపదికలుగా గైకొని చలనచిత్ర సాహిత్యానికి ప్రోద్బలాన్ని అందించాయి. చలనచిత్ర రంగ ప్రాథమిక దశలో చలనచిత్ర సంబంధ సాహిత్యానికి సాహిత్యపు విలువలు ఉంటాయా? అనే ప్రశ్న కూడా ఉద్భవించింది. అయితే నాలుగు దిశల నుండీ చలనచిత్ర సాహిత్యానికి.............
'పరిశోధనా ప్రోతస్విని' 'ధర్మార్థ కామ మోక్షం వైచక్షణ్యం కళాసు చ కరోతి కీర్తిం ప్రీతించ సాధు కావ్య నిషేవణం' అని చతుర్వర్ణ వ్యుత్పత్తియే కావ్య ప్రయోజనాలని వ్యక్తం చేసినట్లుగా అవగాహన చేసికొనవచ్చును. ఇది భామహుని అభిప్రాయం. ఈ సందర్భంగా కావ్య ప్రకాశ కర్త 'కావ్యం యశసే, అర్థకృతే వ్యవహార విదే శివేత రక్షతయే సద్యః పరినిర్వృతయే కాంతాసమ్మిత తయోప దేశయుజే' దక్షా దీక్షను కలిగిన కవిపుంగవునకు పైన పేర్కొన్న లక్షణాలన్నీ వర్తిస్తాయి. ప్రతిభావ్యుత్పత్తి అభ్యాసాలను కలిగిన వ్యక్తే కవిశ్రేష్ఠుడు. రచనా వైదుష్యం తొలి నుండి తుది దాకా కన్పిస్తుంది. ఈ సద్గుణ రచన ఆధునికమైనప్పటికీ ప్రాచీన లక్షణాలు అంటే ప్రత్యేకంగా ఆధునిక కవితా ప్రాదుర్భావం ప్రస్ఫుటంగా ప్రవర్తిల్లుతుంది. ఆధునిక రచనలకు, వచన పద్యరూపంలో తీర్చిదిద్దిన ఆద్యుడు కుందుర్తి ఆంజనేయులు. సంప్రదాయ సాహిత్య లక్షణాలు వైదొలగి నూతనత్వానికి నాంది ఆరంభమైంది. నవల, కథ, కథానికా మొదలైన ఆధునిక రచనలు అర్వాచీనకాలంలో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ రచనలను ప్రాతిపదికలుగా గైకొని చలనచిత్ర సాహిత్యానికి ప్రోద్బలాన్ని అందించాయి. చలనచిత్ర రంగ ప్రాథమిక దశలో చలనచిత్ర సంబంధ సాహిత్యానికి సాహిత్యపు విలువలు ఉంటాయా? అనే ప్రశ్న కూడా ఉద్భవించింది. అయితే నాలుగు దిశల నుండీ చలనచిత్ర సాహిత్యానికి.............© 2017,www.logili.com All Rights Reserved.