20వ శతాబ్దిలో ప్రారంభంలో (1910 లో) తెలుగులో కవిత్వం మూడు పాయలుగా ప్రవహించింది. 1."సంప్రదాయ కవిత్వం" లేక "నవ్య సంప్రదాయ కవిత్వం", 2. "భావకవిత్వం" లేక "కాల్పనిక కవిత్వం", 3. "అభ్యుదయ కవిత్వం". నవ్య సంప్రదాయ కవిత్వానికి ప్రారంభికులు తిరుపతి వేంకటకవులు. దీనిని ఒక పెద్ద ఉద్యమంగా ముందుకు నడిపించిన వ్యక్తి "కవి సమ్రాట్" విశ్వనాథ సత్యనారాయణగారు. కాల్పనిక కవిత్వానికి ప్రారంభికులు రాయప్రోలు సుబ్బారావుగారు. దీనికి ఒక ఉద్యమంగా ముదుకు నడిపించిన వ్యక్తీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. అభ్యుదయ కవిత్వ ప్రారంభికులు గురజాడ అప్పారావుగారు. దీనిని ఒక ఉద్యమంగా ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు). అందువల్లనే విశ్వనాథ - కృష్ణశాస్త్రి - శ్రీశ్రీ తిలక్ గారి దృష్టిలో ఆధునికాంధ్ర కవిత్వానికి "త్రిమూర్తులు". ఈ పేరుతొ తిలక్ ఒక కవిత కూడా వ్రాశారు. ఈ ఆధునిక కవిత్రయంలోని గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే, వారి వారి లోపాలను కూడా ఎత్తి చూపారు తిలక్. ఈ కవిత్రయంలోని మంచిని గ్రహించి, చెడును పరిహరించి తానొక ప్రత్యేకమైన కవిగా రూపొందారు తిలక్. భావకవిత్వాన్ని అభ్యుదయకవిత్వాన్ని మేళవించి "సమ్యక్ సమ్మేళనం గావించి" నూతన కవితాలోకాన్ని ఆవిష్కరించారు. కవితాప్రియుల్ని ఆకర్షించారు.
కవిత్వ రహస్య తత్త్వవేత్త తిలక్. కవిత్వం ఒక "ఆల్కెమీ" అనీ, దాని రహస్యం కవికి మాత్రమే తెలుస్తుందనీ, మహాకవి కాళిదాసుకీ, ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దనకీ, భావకవి కృష్ణశాస్త్రికీ, అభ్యుదయ (విప్లవ) మహాకవి శ్రీశ్రీకి కవితా రహస్యం తెలుసుననీ తిలక్ ఒక కవితలో అన్నారు. ఈ పేర్ల చివర తిలక్ పేరును, శేషేంద్ర పేరును కూడా మనం చేర్చవసిన అవసరం చాలా ఉంది.నా కవిత్వం
నా కవిత్వం కాదొక తత్త్వం
మరికాదు మీరనే మనస్తత్త్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాధః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రావాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.
- దేవరకొండ బాలగంగాధర్ తిలక్
తిలక్ లభ్య రచనల సంపూర్ణ సంకలనం
20వ శతాబ్దిలో ప్రారంభంలో (1910 లో) తెలుగులో కవిత్వం మూడు పాయలుగా ప్రవహించింది. 1."సంప్రదాయ కవిత్వం" లేక "నవ్య సంప్రదాయ కవిత్వం", 2. "భావకవిత్వం" లేక "కాల్పనిక కవిత్వం", 3. "అభ్యుదయ కవిత్వం". నవ్య సంప్రదాయ కవిత్వానికి ప్రారంభికులు తిరుపతి వేంకటకవులు. దీనిని ఒక పెద్ద ఉద్యమంగా ముందుకు నడిపించిన వ్యక్తి "కవి సమ్రాట్" విశ్వనాథ సత్యనారాయణగారు. కాల్పనిక కవిత్వానికి ప్రారంభికులు రాయప్రోలు సుబ్బారావుగారు. దీనికి ఒక ఉద్యమంగా ముదుకు నడిపించిన వ్యక్తీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు. అభ్యుదయ కవిత్వ ప్రారంభికులు గురజాడ అప్పారావుగారు. దీనిని ఒక ఉద్యమంగా ముందుకు నడిపించిన వ్యక్తి శ్రీ శ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు). అందువల్లనే విశ్వనాథ - కృష్ణశాస్త్రి - శ్రీశ్రీ తిలక్ గారి దృష్టిలో ఆధునికాంధ్ర కవిత్వానికి "త్రిమూర్తులు". ఈ పేరుతొ తిలక్ ఒక కవిత కూడా వ్రాశారు. ఈ ఆధునిక కవిత్రయంలోని గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే, వారి వారి లోపాలను కూడా ఎత్తి చూపారు తిలక్. ఈ కవిత్రయంలోని మంచిని గ్రహించి, చెడును పరిహరించి తానొక ప్రత్యేకమైన కవిగా రూపొందారు తిలక్. భావకవిత్వాన్ని అభ్యుదయకవిత్వాన్ని మేళవించి "సమ్యక్ సమ్మేళనం గావించి" నూతన కవితాలోకాన్ని ఆవిష్కరించారు. కవితాప్రియుల్ని ఆకర్షించారు. కవిత్వ రహస్య తత్త్వవేత్త తిలక్. కవిత్వం ఒక "ఆల్కెమీ" అనీ, దాని రహస్యం కవికి మాత్రమే తెలుస్తుందనీ, మహాకవి కాళిదాసుకీ, ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దనకీ, భావకవి కృష్ణశాస్త్రికీ, అభ్యుదయ (విప్లవ) మహాకవి శ్రీశ్రీకి కవితా రహస్యం తెలుసుననీ తిలక్ ఒక కవితలో అన్నారు. ఈ పేర్ల చివర తిలక్ పేరును, శేషేంద్ర పేరును కూడా మనం చేర్చవసిన అవసరం చాలా ఉంది.నా కవిత్వం నా కవిత్వం కాదొక తత్త్వం మరికాదు మీరనే మనస్తత్త్వం కాదు ధనికవాదం, సామ్యవాదం కాదయ్యా అయోమయం, జరామయం. గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ జాజిపువ్వుల అత్తరు దీపాలూ మంత్ర లోకపు మణి స్తంభాలూ నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు. అగాధ బాధా పాధః పతంగాలూ ధర్మవీరుల కృత రక్తనాళాలూ త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి నా కళా కరవాల ధగద్ధగ రావాలు నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. - దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తిలక్ లభ్య రచనల సంపూర్ణ సంకలనం
© 2017,www.logili.com All Rights Reserved.