ఈ కధలను యింత అపురూపంగా ఎంపిక చేసుకోవటంలోనే ఎలనాగ గారి అభిరుచి తెలుస్తుంది. నిజానికి ఈ కధల్లోని వైవిధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది.
ఒక్కొక్క కధా ఒక్కొక్క మణిపూస
సంగీత సాహిత్యాలను తన వుచ్చ్వాస నిస్వాసలుగా చేసుకున్న డాక్టర్ గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజనచేసి, తెలుగు పాటకులకు కానుకగా యిస్తున్నారు.
-ముక్తవరం పార్ధసారధి
మౌలికంగా మానవ స్పందనలు ఏ ప్రాంతంలోనైనా, ఏ బాషలోనైనా ఒకటే అయినప్పటికీ అనువాద కధల్లోని భౌతిక జీవితపు భిన్నత్వం, విలక్షణ వాతావరణం మనసుని తాజాదనంతో నింపేస్తాయి.
కానీ ఇందులో వున్న కధలు మాత్రం పై అనుభవంతో పాటు ఎన్నడూ ఎరగని మానసిక ప్రాంతాల్లో కూడా విహరింపజేస్తాయి. అపరిచిత ప్రాంతాల్లో వొదిలి వేయబడటం ఎంత అద్బుత అనుభవం! ఎన్ని కాల్పనిక దారుల్ని, వంతెనల్ని నిర్మించుకోవాల్సి వస్తుందో!!
అలాంటి కధల ప్రపంచం ఇది!
ఈ కదల ప్రపంచంలో మిలమిలలాడే చుక్కల్లాంటి హటాత్ ప్రవర్తనలు మన మూసదనాన్ని స్వేచ్చలోకి అనువదిస్తుంటే పెదాల మీద చిరునవ్వు, కళ్ళ లోపల ఏదో కాంతి అలా వాలి పోతుంటాయి.
'వార్డ్ రోబు, ముసలాయనా, మృత్యువు' కధని మొదట పాలపిట్ట పత్రికలో చదివినప్పుడు కధని ఇలా ఎలా చెప్పారు అని ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాను. దాన్ని ఎన్నిసార్లు చదివానంటే అందులో ప్రతివాక్యము గుర్తుండిపోయింది. అలాంటి మరిన్ని కధలతో ఈ పుస్తకం వెలువడటం మంచి సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళకు మరిచిపోలేని ఒక విందు భోజనం.
గాఢమైన అనుభూతి కోసమే కాకుండా, కధకులందరూ ఒక సిలబస్ లాగా చదవాల్సిన పుస్తకం ఇది. చదవండి! నాక్కలిగిన అనుభవం కంటే గొప్ప అనుభవం మీకోసం ఎదురు చూస్తుందేమో ఎవరికీ తెలుసు?
-రమణజీవి
20 మంచి లాటిన్ అమెరికా కధలు ఉన్నాయి.
ఈ కధలను యింత అపురూపంగా ఎంపిక చేసుకోవటంలోనే ఎలనాగ గారి అభిరుచి తెలుస్తుంది. నిజానికి ఈ కధల్లోని వైవిధ్యం మనల్ని అబ్బురపరుస్తుంది. ఒక్కొక్క కధా ఒక్కొక్క మణిపూస సంగీత సాహిత్యాలను తన వుచ్చ్వాస నిస్వాసలుగా చేసుకున్న డాక్టర్ గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజనచేసి, తెలుగు పాటకులకు కానుకగా యిస్తున్నారు. -ముక్తవరం పార్ధసారధి మౌలికంగా మానవ స్పందనలు ఏ ప్రాంతంలోనైనా, ఏ బాషలోనైనా ఒకటే అయినప్పటికీ అనువాద కధల్లోని భౌతిక జీవితపు భిన్నత్వం, విలక్షణ వాతావరణం మనసుని తాజాదనంతో నింపేస్తాయి. కానీ ఇందులో వున్న కధలు మాత్రం పై అనుభవంతో పాటు ఎన్నడూ ఎరగని మానసిక ప్రాంతాల్లో కూడా విహరింపజేస్తాయి. అపరిచిత ప్రాంతాల్లో వొదిలి వేయబడటం ఎంత అద్బుత అనుభవం! ఎన్ని కాల్పనిక దారుల్ని, వంతెనల్ని నిర్మించుకోవాల్సి వస్తుందో!! అలాంటి కధల ప్రపంచం ఇది! ఈ కదల ప్రపంచంలో మిలమిలలాడే చుక్కల్లాంటి హటాత్ ప్రవర్తనలు మన మూసదనాన్ని స్వేచ్చలోకి అనువదిస్తుంటే పెదాల మీద చిరునవ్వు, కళ్ళ లోపల ఏదో కాంతి అలా వాలి పోతుంటాయి. 'వార్డ్ రోబు, ముసలాయనా, మృత్యువు' కధని మొదట పాలపిట్ట పత్రికలో చదివినప్పుడు కధని ఇలా ఎలా చెప్పారు అని ఆశ్చర్యానందాల్లో మునిగిపోయాను. దాన్ని ఎన్నిసార్లు చదివానంటే అందులో ప్రతివాక్యము గుర్తుండిపోయింది. అలాంటి మరిన్ని కధలతో ఈ పుస్తకం వెలువడటం మంచి సాహిత్యాన్ని ప్రేమించేవాళ్ళకు మరిచిపోలేని ఒక విందు భోజనం. గాఢమైన అనుభూతి కోసమే కాకుండా, కధకులందరూ ఒక సిలబస్ లాగా చదవాల్సిన పుస్తకం ఇది. చదవండి! నాక్కలిగిన అనుభవం కంటే గొప్ప అనుభవం మీకోసం ఎదురు చూస్తుందేమో ఎవరికీ తెలుసు? -రమణజీవి 20 మంచి లాటిన్ అమెరికా కధలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.