సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన ఉర్దూ కధానికలు
ఆణిముత్యాలవంటి 28 కధలు.
కధానిక రాయడమంటే నా మట్టుకు నాకు ఒక ఆలోచనను అనుభవించడం. కేవలం అనుభవించడం కంటే అది ఒక పిసరు ఎక్కువే. కవితలో కంటే ఎక్కువ కధనం దీనికి అవసరం. నా కధానికలు చాలావరకు చిన్నవే, అరణ్యగాధ,నిప్పును మచ్చిక చేసిన హబు,సీమా కధలు తప్ప. వీటిల్లో మాత్రం నా అనుభవాన్ని పాటకులతో పంచుకోవడానికి, కధలో ఉన్న నిగూడ ఆలోచనను స్పష్టం చేయడానికి ఆ మాత్రం వివరించాలనిపించింది.
నా కధల్లో కొన్ని చారిత్రాత్మకమైనవి.అంతమాత్రాన చారిత్రాత్మక నవలల్లాంటివి కావు. మొదటిసారిగా నేను బిమల్ దా, మైకేలంజేలో జీవితంలోని కధ నీతికధలా ఉంటుంది.అందులోని వ్యాఖ్యానం ఎంతో లోతైనది. మన చరిత్రలో బైజు బావ్ రా,తాన్ సేన్ కలయికలా ఎక్కడా ఆధారాల్లేని కధ ఇది . రుజువులు దొరకనప్పటికి,ఒక పురాణ గాధలా మనజీవితాల్లో కలసిపోయిన కధ. ఇలాంటివి మన చరిత్రలో ఎన్నో.
నాకు కాలం, స్థలం ఈ రెండిట్లో ప్రయాణించడం ఇష్టం.'కాలం'గడిచే కొద్ది బహుశా నేను మరిన్ని కధలు రాస్తానేమో, అంటే మరింత 'ప్రయాణం'చేస్తానేమో.ఇది వరకు ఒకసారి అంతరించి పోయిన తార 'ఈటాకారినే'ఈ భూమి పై చూపిన ప్రభావం గురించి తెలుసుకోవడానికి ప్రయాణం చేశాను.ఇప్పుడు అలాంటివి మరీ అవసరమనిపిస్తుంది.ఎందుకంటే మన మహాకవులు జౌఖ్,గాలిబ్ ల సమాధులు,చాలా దయనీయమైన పరిస్థితిలో ఢిల్లీ లో బయటపడ్డాయి.గాలిబ్ సమాధినయితే ఏళ్ళ తరబడి పట్టించుకున్న వాళ్ళు లేరు. జౌఖ్ సమాధిని ఒక బహిరంగ మూత్రశాల కింద కనుగొన్నారు.
౧౯౪౭ లో భారతదేశ విభజనను సమీపం నుంచి చూసిన వాణ్ణి నేను. నన్ను ఎంతో గాయపరిచింది.భయపెట్టింది.ఈ భాధలను,భయాన్ని నాలోనించి తొలిగించుకోవడం కోసం ఆ నేపధ్యంలో కధలు రాసాను. దీన్ని నా పాటకులతో పంచుకోవడం ద్వారా ఆ భాదలనుంచి వీలైనంత దూరంగా పారిపోవాలనుకుంటున్నాను.
అయితే,నా ఒకేఒక కోరిక ఏమిటంటే,ఈ కధల్ని చదివిన వాళ్ళలో మరోసారి ఆ భాద పునరావృతం కాకూడదని, ఎందుకంటే విభజనను స్వయంగా చూసిన వాళ్ళకు మరోసారి ఆ భాధను గుర్తు చేసినట్టవుతుంది.
సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన ఉర్దూ కధానికలు ఆణిముత్యాలవంటి 28 కధలు. కధానిక రాయడమంటే నా మట్టుకు నాకు ఒక ఆలోచనను అనుభవించడం. కేవలం అనుభవించడం కంటే అది ఒక పిసరు ఎక్కువే. కవితలో కంటే ఎక్కువ కధనం దీనికి అవసరం. నా కధానికలు చాలావరకు చిన్నవే, అరణ్యగాధ,నిప్పును మచ్చిక చేసిన హబు,సీమా కధలు తప్ప. వీటిల్లో మాత్రం నా అనుభవాన్ని పాటకులతో పంచుకోవడానికి, కధలో ఉన్న నిగూడ ఆలోచనను స్పష్టం చేయడానికి ఆ మాత్రం వివరించాలనిపించింది. నా కధల్లో కొన్ని చారిత్రాత్మకమైనవి.అంతమాత్రాన చారిత్రాత్మక నవలల్లాంటివి కావు. మొదటిసారిగా నేను బిమల్ దా, మైకేలంజేలో జీవితంలోని కధ నీతికధలా ఉంటుంది.అందులోని వ్యాఖ్యానం ఎంతో లోతైనది. మన చరిత్రలో బైజు బావ్ రా,తాన్ సేన్ కలయికలా ఎక్కడా ఆధారాల్లేని కధ ఇది . రుజువులు దొరకనప్పటికి,ఒక పురాణ గాధలా మనజీవితాల్లో కలసిపోయిన కధ. ఇలాంటివి మన చరిత్రలో ఎన్నో. నాకు కాలం, స్థలం ఈ రెండిట్లో ప్రయాణించడం ఇష్టం.'కాలం'గడిచే కొద్ది బహుశా నేను మరిన్ని కధలు రాస్తానేమో, అంటే మరింత 'ప్రయాణం'చేస్తానేమో.ఇది వరకు ఒకసారి అంతరించి పోయిన తార 'ఈటాకారినే'ఈ భూమి పై చూపిన ప్రభావం గురించి తెలుసుకోవడానికి ప్రయాణం చేశాను.ఇప్పుడు అలాంటివి మరీ అవసరమనిపిస్తుంది.ఎందుకంటే మన మహాకవులు జౌఖ్,గాలిబ్ ల సమాధులు,చాలా దయనీయమైన పరిస్థితిలో ఢిల్లీ లో బయటపడ్డాయి.గాలిబ్ సమాధినయితే ఏళ్ళ తరబడి పట్టించుకున్న వాళ్ళు లేరు. జౌఖ్ సమాధిని ఒక బహిరంగ మూత్రశాల కింద కనుగొన్నారు. ౧౯౪౭ లో భారతదేశ విభజనను సమీపం నుంచి చూసిన వాణ్ణి నేను. నన్ను ఎంతో గాయపరిచింది.భయపెట్టింది.ఈ భాధలను,భయాన్ని నాలోనించి తొలిగించుకోవడం కోసం ఆ నేపధ్యంలో కధలు రాసాను. దీన్ని నా పాటకులతో పంచుకోవడం ద్వారా ఆ భాదలనుంచి వీలైనంత దూరంగా పారిపోవాలనుకుంటున్నాను. అయితే,నా ఒకేఒక కోరిక ఏమిటంటే,ఈ కధల్ని చదివిన వాళ్ళలో మరోసారి ఆ భాద పునరావృతం కాకూడదని, ఎందుకంటే విభజనను స్వయంగా చూసిన వాళ్ళకు మరోసారి ఆ భాధను గుర్తు చేసినట్టవుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.