నానాటికి ప్రజారోగ్యం పట్ల, ప్రతివ్యక్తీ శ్రద్ధ కనపరచవలసిన ఆవశ్యకత ఏర్పడబోతున్నది. 'ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించుకోవడమే!' అనే స్పృహ ప్రతివారిలో కలుగవలసిన తరుణం ఆసన్నమైంది.
ఎంతో విశిష్టత సంతరించుకున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని సరళమైన చికిత్సల రూపంలో అందజేస్తున్నాము.
ఒకానొక కాలంలో విశేష ఆదరణ ఉన్నది ఈ వైద్య విధానం. ఆంగ్లేయుల పాలన ప్రభావంవల్ల ప్రతివారూ అల్లోపతి పట్ల ఆకర్షితులై వేలూ - లక్షలూ పోసి ఎక్స్ రేలూ - పరిక్షలు అంటూ ధనం వృధాచేసుకుంటున్నారు. సహజంగా దొరికే మూలికలతో, చెట్ల వ్రేళ్ళతో, ఆకులతో ఎన్నో దీర్ఘ వ్యాధులకు - మొండి రోగాలకు చికిత్సా విధానాలున్న మన ఆయుర్వేదం తక్కువ ఖర్చుతో వాటిని నయం చేస్తుందని తెలిసీ నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ నాటి తరం, మరీ ముఖ్యంగా మనదైన ప్రాచీన ఆయుర్వేద వైభవాన్ని రేఖా మాత్రంగానైనా తెలుస్కుకోవాలనే సదుద్దేశంతో ఈ ఆరోగ్యం - ఆయుర్వేదం గ్రంధాన్ని సంకలనంగా తీసుకువచ్చారు. ఇందులో సమస్త వ్యాధులకూ అతి సరళమైనవీ, కాస్త ప్రయత్నం మీద చేయగలిగినవీ ఎన్నో చికిత్సలను సులభమైన రీతిలో అందరికీ అర్ధమయ్యేలాగ పొందుపరిచారు.
నానాటికి ప్రజారోగ్యం పట్ల, ప్రతివ్యక్తీ శ్రద్ధ కనపరచవలసిన ఆవశ్యకత ఏర్పడబోతున్నది. 'ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అంటే ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం నిర్మించుకోవడమే!' అనే స్పృహ ప్రతివారిలో కలుగవలసిన తరుణం ఆసన్నమైంది. ఎంతో విశిష్టత సంతరించుకున్న ఆయుర్వేద వైద్య విధానాన్ని సరళమైన చికిత్సల రూపంలో అందజేస్తున్నాము. ఒకానొక కాలంలో విశేష ఆదరణ ఉన్నది ఈ వైద్య విధానం. ఆంగ్లేయుల పాలన ప్రభావంవల్ల ప్రతివారూ అల్లోపతి పట్ల ఆకర్షితులై వేలూ - లక్షలూ పోసి ఎక్స్ రేలూ - పరిక్షలు అంటూ ధనం వృధాచేసుకుంటున్నారు. సహజంగా దొరికే మూలికలతో, చెట్ల వ్రేళ్ళతో, ఆకులతో ఎన్నో దీర్ఘ వ్యాధులకు - మొండి రోగాలకు చికిత్సా విధానాలున్న మన ఆయుర్వేదం తక్కువ ఖర్చుతో వాటిని నయం చేస్తుందని తెలిసీ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నాటి తరం, మరీ ముఖ్యంగా మనదైన ప్రాచీన ఆయుర్వేద వైభవాన్ని రేఖా మాత్రంగానైనా తెలుస్కుకోవాలనే సదుద్దేశంతో ఈ ఆరోగ్యం - ఆయుర్వేదం గ్రంధాన్ని సంకలనంగా తీసుకువచ్చారు. ఇందులో సమస్త వ్యాధులకూ అతి సరళమైనవీ, కాస్త ప్రయత్నం మీద చేయగలిగినవీ ఎన్నో చికిత్సలను సులభమైన రీతిలో అందరికీ అర్ధమయ్యేలాగ పొందుపరిచారు.
© 2017,www.logili.com All Rights Reserved.