రోగాలు, ముసలితనం, తాపత్రయాలు, దుఃఖాలు మానవజీవితం ఒక సంకటం. మునుపటి జన్మలలో చేసిన కర్మల ఫలాలని ఈ జన్మలో అనుభవించడం వీటిలో మిగిలి పోయినవీ, ఈ జన్మలో చేసిన కర్మలూ అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తడం. పునరపి జననం, పునరపి మరణం. ప్రళయం వరకు నిరంతరంగా సాగే ఈ వలయాన్ని ఛేదించ గలిగితే మోక్షమే. మోక్షమంటే బంధాలనుంచి, జనన మరణ పరంపర నుంచి విముక్తి చెంది పరమాత్మని చేరడమే. దుఃఖమయమైన జన్మను మళ్ళీ పొందకుండా ఉండడానికే మోక్షసాధన యత్నం. పరమాత్మను చేరదమంటే మోక్షం పొందడమే. పరమాత్మ ఈ సృష్టికి కారకుడు, పోషకుడు, లయకారకుడు కూడా. పరమాత్మా అంతటా ఉన్నాడు. ప్రాణికోట్ల (జీవుల) లోనూ జీవాత్మగా ఉన్నాడు. నిజానికి జీవాత్మ పరమాత్మ వేరు కారు. గంగానదిలో గంగాజలాన్ని నింపి నీరు బయటకు రాకుండా సిలుచేసిన రాగిపాత్రను ఉంచాం. నదిలోనూ, పాత్రలోను ఉన్నది ఆ జలమే. పాత్రలోని గంగాజలం నదిలోని గంగాజలంతో ఏకమవకుండా అవరోధంగాఉన్నది రాగిగోడ. ఈ రాగిగోడ మాయ. పాత్రలోని జలం జీవాత్మ. నదిలోని జలం పరమాత్మా. ఈ మాయను సృష్టించేది పరమాత్మే. ఇది ఎంత బలవత్తరమయినవంటే కప్పను తాను తప్ప ఇంక ప్రపంచమే లేదని భ్రమపెట్టె నూతి లాంటిది.
ఈ మాయను ఛేదించగలిగితే పాత్రలోని జలం నదిజలంలో కలిసిపోయినట్లు జీవాత్మ - పరమాత్మ ఒకటవుతారు. అపుడంతా సుఖమే. అదే మోక్షం. పరమాత్మను చేరడం పరమపదం పొందడం. కాని జీవుడు మాయని ఛేదించే దైవంలో చేరడం సులభం కాదు. కోటికొక్కరు కూడా సాధించలేనిదిది. మాయను తెలుసుకొని, ఛేదించగలగడానికి శ్రీ కృష్ణభగవానుడు - భక్తీ, జ్ఞానం, కర్మ మొదలయిన అనేక మార్గాలను అర్జునుడికి బోధించాడు. ఎవరికీ అనువైనమార్గం (యోగం) వారు అనుసరించి పరమాత్మలో ఐక్యమై. పునర్జన్మ లేకుండా సుఖించవచ్చు. జనన, మరణ చక్రంలోపడి నలిగే దుఃఖాన్ని నివారించు కొనే మార్గాలు, అందుకు అవలంభించవలసిన నియమాలు, పాటించవలసిన ధర్మాలూ, నెరవేర్చవలసిన బాధ్యతలూ, మరేన్నిటి సమాహారమే 'భగవద్గీత'. దీనిని సాక్షాత్తూ భగవంతుడే... అర్జునుడికి కార్యో(యుద్దో) న్ముఖుడిని చేయడానికి చెప్పాడు. యుద్ధ రంగంలో... కురుక్షేత్ర రణరంగంలో కనుక ఇది ఎంత ఆచరణాత్మకమో తెలుస్తుంది.
- ఇచ్ఛాపురపు రామచంద్రం
రోగాలు, ముసలితనం, తాపత్రయాలు, దుఃఖాలు మానవజీవితం ఒక సంకటం. మునుపటి జన్మలలో చేసిన కర్మల ఫలాలని ఈ జన్మలో అనుభవించడం వీటిలో మిగిలి పోయినవీ, ఈ జన్మలో చేసిన కర్మలూ అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తడం. పునరపి జననం, పునరపి మరణం. ప్రళయం వరకు నిరంతరంగా సాగే ఈ వలయాన్ని ఛేదించ గలిగితే మోక్షమే. మోక్షమంటే బంధాలనుంచి, జనన మరణ పరంపర నుంచి విముక్తి చెంది పరమాత్మని చేరడమే. దుఃఖమయమైన జన్మను మళ్ళీ పొందకుండా ఉండడానికే మోక్షసాధన యత్నం. పరమాత్మను చేరదమంటే మోక్షం పొందడమే. పరమాత్మ ఈ సృష్టికి కారకుడు, పోషకుడు, లయకారకుడు కూడా. పరమాత్మా అంతటా ఉన్నాడు. ప్రాణికోట్ల (జీవుల) లోనూ జీవాత్మగా ఉన్నాడు. నిజానికి జీవాత్మ పరమాత్మ వేరు కారు. గంగానదిలో గంగాజలాన్ని నింపి నీరు బయటకు రాకుండా సిలుచేసిన రాగిపాత్రను ఉంచాం. నదిలోనూ, పాత్రలోను ఉన్నది ఆ జలమే. పాత్రలోని గంగాజలం నదిలోని గంగాజలంతో ఏకమవకుండా అవరోధంగాఉన్నది రాగిగోడ. ఈ రాగిగోడ మాయ. పాత్రలోని జలం జీవాత్మ. నదిలోని జలం పరమాత్మా. ఈ మాయను సృష్టించేది పరమాత్మే. ఇది ఎంత బలవత్తరమయినవంటే కప్పను తాను తప్ప ఇంక ప్రపంచమే లేదని భ్రమపెట్టె నూతి లాంటిది. ఈ మాయను ఛేదించగలిగితే పాత్రలోని జలం నదిజలంలో కలిసిపోయినట్లు జీవాత్మ - పరమాత్మ ఒకటవుతారు. అపుడంతా సుఖమే. అదే మోక్షం. పరమాత్మను చేరడం పరమపదం పొందడం. కాని జీవుడు మాయని ఛేదించే దైవంలో చేరడం సులభం కాదు. కోటికొక్కరు కూడా సాధించలేనిదిది. మాయను తెలుసుకొని, ఛేదించగలగడానికి శ్రీ కృష్ణభగవానుడు - భక్తీ, జ్ఞానం, కర్మ మొదలయిన అనేక మార్గాలను అర్జునుడికి బోధించాడు. ఎవరికీ అనువైనమార్గం (యోగం) వారు అనుసరించి పరమాత్మలో ఐక్యమై. పునర్జన్మ లేకుండా సుఖించవచ్చు. జనన, మరణ చక్రంలోపడి నలిగే దుఃఖాన్ని నివారించు కొనే మార్గాలు, అందుకు అవలంభించవలసిన నియమాలు, పాటించవలసిన ధర్మాలూ, నెరవేర్చవలసిన బాధ్యతలూ, మరేన్నిటి సమాహారమే 'భగవద్గీత'. దీనిని సాక్షాత్తూ భగవంతుడే... అర్జునుడికి కార్యో(యుద్దో) న్ముఖుడిని చేయడానికి చెప్పాడు. యుద్ధ రంగంలో... కురుక్షేత్ర రణరంగంలో కనుక ఇది ఎంత ఆచరణాత్మకమో తెలుస్తుంది. - ఇచ్ఛాపురపు రామచంద్రం© 2017,www.logili.com All Rights Reserved.