సభ్యతా సంస్కారాలకు ఆటపట్టయిన కామరాజు సరస్వతీదేవి సంప్రదాయ సంస్కృతులకు నెలవైన ఇల్లిందలవారి కోడలయింది. పాఠశాలల నాలుగు గోడల మధ్య ఈమె చదివింది అల్పమే కాని నిరంతరమైన అధ్యయనం, సునిశితమైన పరిశీలన, అకుంఠితమైన కార్యదీక్ష, నిస్వార్ధమైన సేవాతత్పరత, బూర్గుల, మాడపాటి లాంటి మహనీయుల ప్రేరణాప్రోత్సాహల వల్ల ఈమె సాధించింది అనల్పం. అరకొర చదువు సంద్యలు, అడుగడుగునా పీడించే ఆర్ధిక సమస్యలు, సాంసారిక తాపత్రయాల మధ్య చిక్కుకు పోయిన స్త్రీలకు ఇల్లిందల సరస్వతీదేవిగారి రచనలు దారిదీపాలు. కధ, నవల, వ్యాసం - ఈ మూడు ప్రక్రియల్లోనూ సరస్వతీదేవిగారి సిద్ధి ప్రశంసనీయం.
రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడెమీల బహుమతులు పొందిన బృహత్ కదా సంపుటం - స్వర్ణకమలాలు. తెలంగాణ బడుగు వర్గాల జీవితానికి అద్దం పట్టే నవల 'నీ బాంచను కాల్మొక్త' - ఇల్లిందల సరస్వతీదేవి ప్రతిభకు నిదర్శనాలు.
ముక్తేవి భారతి(రచయిత గురించి) :
ముక్తేవి భారతి విశిష్ట పరిశోధకురాలు, ఉత్తమ అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, కేసరివారి గృహలక్ష్మి స్వర్ణకంకణం, ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ పతకం, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం గడించిన ఈమె తెలుగు పాఠకలోకానికి సుపరిచిత.
- ముక్తేవి భారతి
సభ్యతా సంస్కారాలకు ఆటపట్టయిన కామరాజు సరస్వతీదేవి సంప్రదాయ సంస్కృతులకు నెలవైన ఇల్లిందలవారి కోడలయింది. పాఠశాలల నాలుగు గోడల మధ్య ఈమె చదివింది అల్పమే కాని నిరంతరమైన అధ్యయనం, సునిశితమైన పరిశీలన, అకుంఠితమైన కార్యదీక్ష, నిస్వార్ధమైన సేవాతత్పరత, బూర్గుల, మాడపాటి లాంటి మహనీయుల ప్రేరణాప్రోత్సాహల వల్ల ఈమె సాధించింది అనల్పం. అరకొర చదువు సంద్యలు, అడుగడుగునా పీడించే ఆర్ధిక సమస్యలు, సాంసారిక తాపత్రయాల మధ్య చిక్కుకు పోయిన స్త్రీలకు ఇల్లిందల సరస్వతీదేవిగారి రచనలు దారిదీపాలు. కధ, నవల, వ్యాసం - ఈ మూడు ప్రక్రియల్లోనూ సరస్వతీదేవిగారి సిద్ధి ప్రశంసనీయం. రాష్ట్ర కేంద్ర సాహిత్య అకాడెమీల బహుమతులు పొందిన బృహత్ కదా సంపుటం - స్వర్ణకమలాలు. తెలంగాణ బడుగు వర్గాల జీవితానికి అద్దం పట్టే నవల 'నీ బాంచను కాల్మొక్త' - ఇల్లిందల సరస్వతీదేవి ప్రతిభకు నిదర్శనాలు. ముక్తేవి భారతి(రచయిత గురించి) : ముక్తేవి భారతి విశిష్ట పరిశోధకురాలు, ఉత్తమ అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, కేసరివారి గృహలక్ష్మి స్వర్ణకంకణం, ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ పతకం, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం గడించిన ఈమె తెలుగు పాఠకలోకానికి సుపరిచిత. - ముక్తేవి భారతి
© 2017,www.logili.com All Rights Reserved.