త్యాగనిరతికి, అకుంఠీత సేవా తత్పరతకు, సామ్రాజ్యవాద వ్యతిరేక స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ద్వారకానాద్ కొట్నిస్. దేశ స్వాతంత్రానికి పూర్వం 1930లలో మహారాష్ట్రలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి వైద్యవిద్యలో పట్టభద్రుడైన వ్యక్తి కోట్నిస్. చైనాపై జపాన్ సామ్రాజ్యవాదులు జరుపుతున్న దాడిలో క్షతగాత్రులైన సైనికులకు, పౌరులకు వైద్య సేవలందించేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆనాటి జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకు స్పందించి చైనా బయలుదేరిన వైద్య బృందంలో కోట్నిస్ చేరాడు. స్వంత ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా అవధులులేని శ్రమ చేయడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి ఎపిలెప్సి వ్యాధికి గురయ్యాడు. చివరికి ఆ వ్యాధితోనే ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 32 సంవత్సరాలు. ఈ స్వల్ప జీవన వ్యవధిలోనే ఆయన అజరామరుడయ్యారు. అలాంటి మహనీయుని గురించి ఈ ప్రచురణ
- కడియాల అమర సుందర్
త్యాగనిరతికి, అకుంఠీత సేవా తత్పరతకు, సామ్రాజ్యవాద వ్యతిరేక స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ ద్వారకానాద్ కొట్నిస్. దేశ స్వాతంత్రానికి పూర్వం 1930లలో మహారాష్ట్రలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి వైద్యవిద్యలో పట్టభద్రుడైన వ్యక్తి కోట్నిస్. చైనాపై జపాన్ సామ్రాజ్యవాదులు జరుపుతున్న దాడిలో క్షతగాత్రులైన సైనికులకు, పౌరులకు వైద్య సేవలందించేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని ఆనాటి జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపుకు స్పందించి చైనా బయలుదేరిన వైద్య బృందంలో కోట్నిస్ చేరాడు. స్వంత ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా అవధులులేని శ్రమ చేయడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి ఎపిలెప్సి వ్యాధికి గురయ్యాడు. చివరికి ఆ వ్యాధితోనే ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 32 సంవత్సరాలు. ఈ స్వల్ప జీవన వ్యవధిలోనే ఆయన అజరామరుడయ్యారు. అలాంటి మహనీయుని గురించి ఈ ప్రచురణ - కడియాల అమర సుందర్© 2017,www.logili.com All Rights Reserved.