మగడు చనిపోగానే అత్తింట్లో పరాయిదానిలా చూడబడి, అత్త పెట్టె అరళ్ళను అనుభవిస్తూనే, తన కులవృత్తి అయిన 'క్షురక' వృత్తిని నేర్చుకుని సవరాల కోసం చిక్కేంటికలు సేకరిస్తూ జీవనం సాగిస్తుంది దేవయాని. చివరికి పిడికేడన్నం కోసం తన పొడవాటి వెంట్రుకల్ని గోరిగించుకొని సవరం చేసి తన వెంట్రుకల్ని చూసి ముచ్చటపడిన మరో ఆడదానికి సవరం చేసి అమ్మేస్తుంది. చిక్కేంటికల పైన తెలుగు సాహిత్యంలో వచ్చిన మొదటి కధ ఇది.
- డా.వి.ఆర్.రాసాని
కధలన్నీ మనకు కృత్రిమతల్లేని స్వచ్చమైన జీవితాన్ని నిర్దుష్టంగా పరిచయం చేస్తాయి. మానవీయ విలువల అవసరాన్ని గుర్తు చేస్తూ, అమానవీయ లక్షణాల్ని నిరసిస్తాయి. ఇంకా ఎంతో పనిచేయబోతున్న ఓ యువ రచయిత తొలినాటి సాధన ఈ పుస్తకం. ఈ భూమిక పైన బలమైన భవనపు నిర్మాణాన్ని జరపవచ్చుననే భరోసా ఇచ్చే కధలివి.
- మధురాంతకం నరేంద్ర
ఇందులో మొత్తం 15 కధలున్నాయి. బాలాజీ ప్రతి కధ ఓ వైవిధ్యమైన కధేతివృత్తం కలిగినదే. ఎప్పుడు అమాయకంగా కనిపించి పెళ్లి వద్దంటూ వచ్చిన తమ్ముడి మరణంతో గుప్తంగా ఉంచిన అతని గుండెజబ్బుని, బడి పిల్లలకు దైవంగా మారిన ఈతని వృత్తి నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయే అన్న - తమ్ముడి మరణం' లోనూ, బంగారు గాజులు కోసం ఆశపడి మట్టి గాజులతో తృప్తి పడిన ఓ పేదింటి గర్భిణి - 'బంగారు గాజులు' కధలోనూ, విధిలేని పరిస్థితుల్లో బాలకార్మికుడిగా మారిన ఓ పన్నెండేళ్ళ బాలుడు, 'గమ్యం లేని పరుగు' లోనూ, కనిపెంచిన తల్లికంటే దేశమాత సేవే గొప్పదని నమ్మిన ఓ సైనికుడు 'అమ్మడైరీ' లోనూ.... అతి సహజంగానే అయినా చిత్రించిన అద్బుత నైపుణ్యానికి అబ్బురపడతాం.
మగడు చనిపోగానే అత్తింట్లో పరాయిదానిలా చూడబడి, అత్త పెట్టె అరళ్ళను అనుభవిస్తూనే, తన కులవృత్తి అయిన 'క్షురక' వృత్తిని నేర్చుకుని సవరాల కోసం చిక్కేంటికలు సేకరిస్తూ జీవనం సాగిస్తుంది దేవయాని. చివరికి పిడికేడన్నం కోసం తన పొడవాటి వెంట్రుకల్ని గోరిగించుకొని సవరం చేసి తన వెంట్రుకల్ని చూసి ముచ్చటపడిన మరో ఆడదానికి సవరం చేసి అమ్మేస్తుంది. చిక్కేంటికల పైన తెలుగు సాహిత్యంలో వచ్చిన మొదటి కధ ఇది. - డా.వి.ఆర్.రాసాని కధలన్నీ మనకు కృత్రిమతల్లేని స్వచ్చమైన జీవితాన్ని నిర్దుష్టంగా పరిచయం చేస్తాయి. మానవీయ విలువల అవసరాన్ని గుర్తు చేస్తూ, అమానవీయ లక్షణాల్ని నిరసిస్తాయి. ఇంకా ఎంతో పనిచేయబోతున్న ఓ యువ రచయిత తొలినాటి సాధన ఈ పుస్తకం. ఈ భూమిక పైన బలమైన భవనపు నిర్మాణాన్ని జరపవచ్చుననే భరోసా ఇచ్చే కధలివి. - మధురాంతకం నరేంద్ర ఇందులో మొత్తం 15 కధలున్నాయి. బాలాజీ ప్రతి కధ ఓ వైవిధ్యమైన కధేతివృత్తం కలిగినదే. ఎప్పుడు అమాయకంగా కనిపించి పెళ్లి వద్దంటూ వచ్చిన తమ్ముడి మరణంతో గుప్తంగా ఉంచిన అతని గుండెజబ్బుని, బడి పిల్లలకు దైవంగా మారిన ఈతని వృత్తి నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయే అన్న - తమ్ముడి మరణం' లోనూ, బంగారు గాజులు కోసం ఆశపడి మట్టి గాజులతో తృప్తి పడిన ఓ పేదింటి గర్భిణి - 'బంగారు గాజులు' కధలోనూ, విధిలేని పరిస్థితుల్లో బాలకార్మికుడిగా మారిన ఓ పన్నెండేళ్ళ బాలుడు, 'గమ్యం లేని పరుగు' లోనూ, కనిపెంచిన తల్లికంటే దేశమాత సేవే గొప్పదని నమ్మిన ఓ సైనికుడు 'అమ్మడైరీ' లోనూ.... అతి సహజంగానే అయినా చిత్రించిన అద్బుత నైపుణ్యానికి అబ్బురపడతాం.© 2017,www.logili.com All Rights Reserved.