సామాజిక న్యాయం కోసం చేసే ఏ చట్టాలు ఎందుకు అమలు కావని చాలామంది అడుగుతుంటారు. వాటికీ ఎవరో స్వార్ధపరులు అడ్డం పడనవసరం లేదు. వాటిని అమలు చేయవలసినవారే వాటిని న్యాయమైనవి అనుకోరు. ఓట్ల కోసమో, తప్పుడు ఔదార్యం వల్లనో, గురి తప్పిన కారుణ్యం వల్లనో ఉనికిలోకి వచ్చిన తెలివి తక్కువ నియమాలుగా వాటిని భావిస్తారు.
చట్టాలను, పాలనా విధానాలను అమలు చేసేవారు కుంటివాళ్ళు కారు, గుడ్డివాళ్ళు కారు, మాలవాళ్ళు కారు, మాదిగవాళ్ళు కారు, ఆడవాళ్లు కారు, ఆదివాసులు కారు, ఆకలేరిగిన వారు కారు. కానీ వారే ఈ సమాజానికి సంబంధించిన 'ప్రధాన స్రవంతి'. దీనికి వెలుపల ఉండే వాళ్ళ ఒత్తిడి వల్ల 'సామాజిక న్యాయం' అనే భావం, దానికి సంబంధించిన చట్టాలు ఉనికిలోకి వచ్చినా ఆ భావన పట్ల ఏ మాత్రం సానుభూతి లేనివారు వాటిని అమలు చేయాలి కాబట్టి ఇవి అమలు కావడం సులభం కాదు.
అందువల్ల చట్టాలలోని హక్కులనేకం ఆచరణలో భాగం కావు. కాకుండా చేసినవారికి ఏ శిక్షా లేనంత కాలం, ఏ కష్టమూ రానంతకాలం ఈ పరిస్థితి మారదు. దీనికి విరుగుడు కనిపెట్టనిదే సామాజిక న్యాయం చట్టాలలోకి ఎక్కినా సామాజిక ఆచరణలో భాగం కాదు.
కె.బాలగోపాల్
సామాజిక న్యాయం కోసం చేసే ఏ చట్టాలు ఎందుకు అమలు కావని చాలామంది అడుగుతుంటారు. వాటికీ ఎవరో స్వార్ధపరులు అడ్డం పడనవసరం లేదు. వాటిని అమలు చేయవలసినవారే వాటిని న్యాయమైనవి అనుకోరు. ఓట్ల కోసమో, తప్పుడు ఔదార్యం వల్లనో, గురి తప్పిన కారుణ్యం వల్లనో ఉనికిలోకి వచ్చిన తెలివి తక్కువ నియమాలుగా వాటిని భావిస్తారు. చట్టాలను, పాలనా విధానాలను అమలు చేసేవారు కుంటివాళ్ళు కారు, గుడ్డివాళ్ళు కారు, మాలవాళ్ళు కారు, మాదిగవాళ్ళు కారు, ఆడవాళ్లు కారు, ఆదివాసులు కారు, ఆకలేరిగిన వారు కారు. కానీ వారే ఈ సమాజానికి సంబంధించిన 'ప్రధాన స్రవంతి'. దీనికి వెలుపల ఉండే వాళ్ళ ఒత్తిడి వల్ల 'సామాజిక న్యాయం' అనే భావం, దానికి సంబంధించిన చట్టాలు ఉనికిలోకి వచ్చినా ఆ భావన పట్ల ఏ మాత్రం సానుభూతి లేనివారు వాటిని అమలు చేయాలి కాబట్టి ఇవి అమలు కావడం సులభం కాదు. అందువల్ల చట్టాలలోని హక్కులనేకం ఆచరణలో భాగం కావు. కాకుండా చేసినవారికి ఏ శిక్షా లేనంత కాలం, ఏ కష్టమూ రానంతకాలం ఈ పరిస్థితి మారదు. దీనికి విరుగుడు కనిపెట్టనిదే సామాజిక న్యాయం చట్టాలలోకి ఎక్కినా సామాజిక ఆచరణలో భాగం కాదు. కె.బాలగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.