కె. సభా భారతదేశంలో గ్రామీణ వ్యవసాయక జీవన మూలాల్ని చిత్రించిన తొలితరం కధా రచయితల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంత ప్రాంతీయ ప్రాతినిధ్య కధా రచయితగా ఒక చారిత్రాత్మక భూమికను నిర్వహించారు. వ్యవసాయ రంగంలోని సంక్షోభాల్ని, జనజీవన విధ్వంసాన్ని, ప్రకృతి భీభత్సాన్ని, కరువు కటకాల్ని, రోజురోజుకూ అడుగంటి పోతున్న భూగర్భ జలాలవల్ల కొండెక్కిపోతున్న రైతు కుటుంబాల కన్నీటి గాధల్ని కధల రూపంలో నిక్షిప్తం చేసిన కధకుడు కె. సభా.
ఈ కధలు పల్లెపట్టు అచ్చమైన భౌగోళిక భౌతిక వాతావరణం, ఆహార అలవాట్లు, పంటలు, సంస్కృతీ, రైతు జీవితాలతో ముడిపడ్డ యితర వృత్తి జీవితాలు, మానవ సంబంధాల్లోని వైరుధ్య విషాదాలు, దేశీయ మనస్తత్వంలోని విభిన్న కోణాలను వాస్తవికంగా ఆవిష్కరించాయి. కె. సభా కధలకు ఆయువుపట్టు దేశియత. గ్రామీణ జీవన సరళిలోని అన్ని రంగాల్లో స్వాతంత్ర్యానంతరం వస్తున్న మర్పుల్ని నిశితంగా పరిశీలించి వ్రాసిన కధలివి.
- కె. సభా
© 2017,www.logili.com All Rights Reserved.