మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రచన, సామాజిక అధ్యయనం, సాహిత్యసాగర మధనం, న్యాయభావన, హేతుబద్ధమైన ఆలోచన శ్రీనివాస్ ను ఉన్నత స్థానంలో నిలిపాయి. ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన దృష్టికోణం ఉన్న రచయితకు సకల పరిణామాలూ సవ్యంగా అర్ధం అవుతాయి. మండల ప్రజాపరిషత్తు ఎన్నికల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా, ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ నుంచి ఇరాక్ మీద అమెరికా దాడుల వరకూ జనజీవనంపై ప్రభావం వేసే సకల అంశాలపైనా స్పష్టమైన అవగాహనతో చేసిన సాధికార వ్యాఖ్యానం ప్రతి వ్యాసంలో కనిపిస్తుంది. ఒక పరిణామాన్ని సాకల్యంగా పరిశీలించి. అన్ని కోణాల నుంచీ ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ సత్యశోధన చేయడం ఈ రచనల ప్రత్యేకత. సమాజంలో ముసలం పుట్టినప్పుడు సున్నితమైన రాజకీయ అంశాలపైన దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ వ్యాఖ్యానించడం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేస్తున్న సంగతి తెలిసి కూడా తమకున్న అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా చెప్పగలగడం కొద్దిమందికే సాధ్యం .
- కె శ్రీనివాస్
మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రచన, సామాజిక అధ్యయనం, సాహిత్యసాగర మధనం, న్యాయభావన, హేతుబద్ధమైన ఆలోచన శ్రీనివాస్ ను ఉన్నత స్థానంలో నిలిపాయి. ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన దృష్టికోణం ఉన్న రచయితకు సకల పరిణామాలూ సవ్యంగా అర్ధం అవుతాయి. మండల ప్రజాపరిషత్తు ఎన్నికల నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా, ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ నుంచి ఇరాక్ మీద అమెరికా దాడుల వరకూ జనజీవనంపై ప్రభావం వేసే సకల అంశాలపైనా స్పష్టమైన అవగాహనతో చేసిన సాధికార వ్యాఖ్యానం ప్రతి వ్యాసంలో కనిపిస్తుంది. ఒక పరిణామాన్ని సాకల్యంగా పరిశీలించి. అన్ని కోణాల నుంచీ ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలు చెప్పుకుంటూ సత్యశోధన చేయడం ఈ రచనల ప్రత్యేకత. సమాజంలో ముసలం పుట్టినప్పుడు సున్నితమైన రాజకీయ అంశాలపైన దినపత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ వ్యాఖ్యానించడం కత్తిమీద సాము. ప్రమాదపుటంచుల్లో విన్యాసం చేస్తున్న సంగతి తెలిసి కూడా తమకున్న అభిప్రాయాలను నిర్ద్వంద్వంగా చెప్పగలగడం కొద్దిమందికే సాధ్యం . - కె శ్రీనివాస్© 2017,www.logili.com All Rights Reserved.