'బార్ సో నగరంలో 'కేటీ' దీపం వెలిగింది' అని అక్కడివారు చెప్పుకోసాగారు. వారికి వెలుగు కనిపించినట్లు మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఒంటరితనం నుంచి తప్పించుకొని, ప్రేమైక జీవితం గడపడానికి తమకెవరో ప్రత్యేక వ్యక్తి లభించాలని ఆశిస్తారు; ఇదొక మిథ్య అనుకోవచ్చు. కేటీ చెప్పే ఈ "కృషి" మనిషిని ఒంటరితనం నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. 'మన ఆలోచనా సరళిని పరిశోధించి ఏది నిజమో గ్రహిస్తే, మనకెప్పటికీ ఒక జీవిత భాగస్వామి వున్నా లేకపోయినా, ఒంటరితనమనేది ఉండదు. స్వస్వరూప దర్శనమయ్యేంత వరకూ కేటీ మనల్ని వదిలిపెట్టదు. ఈ లోగా 'నేను' అని మనమనుకునే మిథ్యావస్తువును తుత్తునియలు చేసి అవతల పారేయడంలో ఆమె ప్రజ్ఞ అంతా ఇంతా కాదు.
-నీలంరాజు లక్ష్మీప్రసాద్
'బార్ సో నగరంలో 'కేటీ' దీపం వెలిగింది' అని అక్కడివారు చెప్పుకోసాగారు. వారికి వెలుగు కనిపించినట్లు మాట్లాడుకోవటం ప్రారంభించారు. ఒంటరితనం నుంచి తప్పించుకొని, ప్రేమైక జీవితం గడపడానికి తమకెవరో ప్రత్యేక వ్యక్తి లభించాలని ఆశిస్తారు; ఇదొక మిథ్య అనుకోవచ్చు. కేటీ చెప్పే ఈ "కృషి" మనిషిని ఒంటరితనం నుంచి విముక్తుణ్ణి చేస్తుంది. 'మన ఆలోచనా సరళిని పరిశోధించి ఏది నిజమో గ్రహిస్తే, మనకెప్పటికీ ఒక జీవిత భాగస్వామి వున్నా లేకపోయినా, ఒంటరితనమనేది ఉండదు. స్వస్వరూప దర్శనమయ్యేంత వరకూ కేటీ మనల్ని వదిలిపెట్టదు. ఈ లోగా 'నేను' అని మనమనుకునే మిథ్యావస్తువును తుత్తునియలు చేసి అవతల పారేయడంలో ఆమె ప్రజ్ఞ అంతా ఇంతా కాదు. -నీలంరాజు లక్ష్మీప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.