ఇదొక సెన్సేషనల్ నవల. నాలుగేళ్ల క్రితం వారం వారం స్వాతి వీక్లీలో సంచలనం సృష్టించింది. అశేష పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఒక అద్భుతమైన సీరియల్ నవల సత్య. బహుమతి గెల్చుకుంది. కథా, నవలా రచయితగా సుప్రసిద్ధులైన అర్నాద్ అందించిన నాల్గవ నవల ఇది. సత్య ఒక పల్లెటూరి పిల్ల. ఒక అపరిచితుడిని పెళ్లి చేసుకొని ఏవేవో పసిడి కలలతో, ఎన్నెన్నో మధురోహాలతో కాపురానికొస్తుంది. పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళాన్ని అనుమానించే మూర్ఖుడు. ఒక విలక్షణమైన శాడిస్టు ప్రతి రాత్రి ఆమెకు నరకం చూపిస్తాడు. అతి దారుణంగా, కిరాతకంగా హింసిస్తాడు.
భర్త హింస నుంచి బయటపడి తన బతుకేదో బతుకుదామనుకుంటే ఆమెను బతకనీయకుండా హింసిస్తుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం. పరిస్థితులు సత్యను ఓ రెబల్ ఉమెన్ గా మారుస్తాయి. డొంకతిరుగుడు లేకుండా సూటిగా, బలంగా, అర్ధవంతమైన మానసిక విశ్లేషణతో హృదయానికి హత్తుకుపోయేలా చెప్పగల కథనం ఈ నవల్లో కనిపిస్తుంది. అలరించి ఆలోచింపజేస్తుంది.
- డా. కె. బాలకృష్ణ
ఇదొక సెన్సేషనల్ నవల. నాలుగేళ్ల క్రితం వారం వారం స్వాతి వీక్లీలో సంచలనం సృష్టించింది. అశేష పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఒక అద్భుతమైన సీరియల్ నవల సత్య. బహుమతి గెల్చుకుంది. కథా, నవలా రచయితగా సుప్రసిద్ధులైన అర్నాద్ అందించిన నాల్గవ నవల ఇది. సత్య ఒక పల్లెటూరి పిల్ల. ఒక అపరిచితుడిని పెళ్లి చేసుకొని ఏవేవో పసిడి కలలతో, ఎన్నెన్నో మధురోహాలతో కాపురానికొస్తుంది. పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళాన్ని అనుమానించే మూర్ఖుడు. ఒక విలక్షణమైన శాడిస్టు ప్రతి రాత్రి ఆమెకు నరకం చూపిస్తాడు. అతి దారుణంగా, కిరాతకంగా హింసిస్తాడు. భర్త హింస నుంచి బయటపడి తన బతుకేదో బతుకుదామనుకుంటే ఆమెను బతకనీయకుండా హింసిస్తుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం. పరిస్థితులు సత్యను ఓ రెబల్ ఉమెన్ గా మారుస్తాయి. డొంకతిరుగుడు లేకుండా సూటిగా, బలంగా, అర్ధవంతమైన మానసిక విశ్లేషణతో హృదయానికి హత్తుకుపోయేలా చెప్పగల కథనం ఈ నవల్లో కనిపిస్తుంది. అలరించి ఆలోచింపజేస్తుంది. - డా. కె. బాలకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.