సమాజ హితం కోరి మనిషిలో చైతన్యాన్ని పెంచేది సాహిత్యం. ఈ మధ్య కాలంలో విజ్రంభిస్తున్న దృశ్య మాధ్యమాల తాకిడి తట్టుకుని కధా సాహిత్యం కొంతవరకు నిలబడగలిగింది. ఈ 'పుట్టిల్లు' సంకలనంలోని కధల రచయిత కామరాజు వెంకట రమణ రావు వీటిని సామాజిక ప్రయోజనం కోసం రాసినట్టు తెలుస్తుంది. ఈ కధల్లో మంచి స్థాయిలో ఉన్న వస్తువు, వైవిద్యం, శిల్పం, కధనం, భాషలాంటివి పాటకులను ఆసక్తిగా చదివిస్తాయి. ఈ రచయితకు జీవితం పట్ల ఉన్న నిశిత దృష్టి, తను చెప్పదల్చుకున్న విషయాల గురించిన అవగాహన, రచనలో సాధికారత కనిపిస్తాయి. జనం హితం కోరి మెరుగైన సమాజం కోసం పడే తపన వ్యక్తమవుతుంది. ఈ కధలన్నీ ఈ మధ్య కాలంలో ప్రముఖ వార, మాసపత్రికలలో ప్రచురింపబడ్డవే.
అన్ని కధల్లోనూ కధకు తగిన సన్నివేశం, సన్నివేశానికి తగిన పాత్రలు పాత్రలకు తగిన సంభాషణలు కనిపిస్తాయి. కధల ప్రారంభం, ముగింపు ఆద్యంతాల మధ్య సమన్వయం సాధించడంలో రచయిత ప్రతిభ కనబడుతుంది. పుట్టిల్లు, నిరీక్షణ, అడ్డుగోడలు లాంటి కధల్లో కధను కాస్త ముందుగానే ఆపేసి ముగింపును పాటకుడి ఉహలో అంతం చేయడం రసానుభూతిని కలుగజేస్తుంది. కధల్లోని పాత్రలు చాలావరకు జీవితంలోంచి వచ్చినవే. అవి సహజంగా పాత్రోచితంగా, స్థల, కాలబద్దంగా ప్రవర్తిస్తాయి.
సమాజ హితం కోరి మనిషిలో చైతన్యాన్ని పెంచేది సాహిత్యం. ఈ మధ్య కాలంలో విజ్రంభిస్తున్న దృశ్య మాధ్యమాల తాకిడి తట్టుకుని కధా సాహిత్యం కొంతవరకు నిలబడగలిగింది. ఈ 'పుట్టిల్లు' సంకలనంలోని కధల రచయిత కామరాజు వెంకట రమణ రావు వీటిని సామాజిక ప్రయోజనం కోసం రాసినట్టు తెలుస్తుంది. ఈ కధల్లో మంచి స్థాయిలో ఉన్న వస్తువు, వైవిద్యం, శిల్పం, కధనం, భాషలాంటివి పాటకులను ఆసక్తిగా చదివిస్తాయి. ఈ రచయితకు జీవితం పట్ల ఉన్న నిశిత దృష్టి, తను చెప్పదల్చుకున్న విషయాల గురించిన అవగాహన, రచనలో సాధికారత కనిపిస్తాయి. జనం హితం కోరి మెరుగైన సమాజం కోసం పడే తపన వ్యక్తమవుతుంది. ఈ కధలన్నీ ఈ మధ్య కాలంలో ప్రముఖ వార, మాసపత్రికలలో ప్రచురింపబడ్డవే. అన్ని కధల్లోనూ కధకు తగిన సన్నివేశం, సన్నివేశానికి తగిన పాత్రలు పాత్రలకు తగిన సంభాషణలు కనిపిస్తాయి. కధల ప్రారంభం, ముగింపు ఆద్యంతాల మధ్య సమన్వయం సాధించడంలో రచయిత ప్రతిభ కనబడుతుంది. పుట్టిల్లు, నిరీక్షణ, అడ్డుగోడలు లాంటి కధల్లో కధను కాస్త ముందుగానే ఆపేసి ముగింపును పాటకుడి ఉహలో అంతం చేయడం రసానుభూతిని కలుగజేస్తుంది. కధల్లోని పాత్రలు చాలావరకు జీవితంలోంచి వచ్చినవే. అవి సహజంగా పాత్రోచితంగా, స్థల, కాలబద్దంగా ప్రవర్తిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.