తొలి కథ ఇదే!
సెప్టెంబర్ 1997లో కుసుమ బుక్స్, విజయవాడ వారి నుంచి శ్రీ కల్యాణసుందరీ జగన్నాథ్ గారి కథా సంకలనం 'అలరాస పుట్టిళ్లు' బయటకు వచ్చింది. దాన్ని అందుకున్న పాఠకులలో నేనూ ఉన్నాను. ఈ కథలు రాసి కల్యాణసుందరి గారు ఎందరో పాఠకుల్ని తమ అభిమానులుగా మార్చేశారు. ముఖ్యంగా 'అలరాస పుట్టిళ్లు' కథ అంత విశిష్టత గల కథ.
అయితే, ఈ 'ఒక కథ' గురించి కల్యాణసుందరీ జగన్నాథ్ గారే ఇదే సంకలనంలో 'నా మాట' అంటూ తన కథా ప్రస్థానం గురించి రాశారు. ఇందులో తన తొలి కథకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చులో కథ పేరు 'ఒక చిన్న కథ' గానూ, రచయిత్రి పేరు 'అనామిక' గానూ, భారతి మాసపత్రిక 1941 లో అచ్చు పడినట్లుగానూ వారే తెలియజేశారు. తొలి కథను చదవాలనే ఆక్షతో పాత 'భారతి' సంచికలు వెతకడానికి సారస్వత నికేతనం (వేటపాలెంలోని సుప్రసిద్ధ గ్రంథాలయం)కు వెళ్లాను. లైబ్రరీ వారి సహకారంతో 1941 జనవరి మొదలు డిసెంబర్ దాకా అన్ని సంచికలు కూలంకషంగా వెతికాను. కల్యాణసుందరిగారి తొలి కథను అందిపుచ్చుకోవాలనే కోరిక... వాటిని వెతికాక నీరుగారిపోయింది. ఆవిడ చెప్పిన వివరాలతో ఏ సంచికలోనూ అటువంటి కథ ప్రచురితం కాలేదు. అయినా, 'భారతి'లో నా తల పెట్టి అలాగే మరో నాలుగేళ్లు ముందుకు అన్వేషణ కొనసాగించాను. అయినా ఫలితం లేకపోయింది. ఇలా కాదని... ఈసారి వెనుకకు వెళ్లి వెతికే ప్రయత్నం చేసి చూద్దాం... అనిపించింది.
అలా చిన్నగా మళ్లీ పేజీ టూ పేజీ.... కథలన్నీ ఆవిడ చెప్పిన 'సిపాయి' జీవితం కోసం ఆబగా ప్రయత్నించాను. అలా ప్రయత్నం కొనసాగుతున్న క్రమంలో 1939 డిసెంబర్ సంచికలో ఈ 'ఒక కథ' దర్శనమిచ్చింది. ఆవిడ రాసినట్లు కొన్ని చిన్న తేడాలతో ఈ కథ కనిపించింది. రచయిత్రి పేరు 'అనామిక' అనీ, కథ పేరు 'ఒక చిన్న కథ' అనీ ఆమె రాశారు. ఆ ప్రకారం చూస్తే ఏ కథా.... 1941లో కానీ, దానికి అటు ఐదేళ్లు, ఇటు ఐదేళ్లు
తొలి కథ ఇదే! సెప్టెంబర్ 1997లో కుసుమ బుక్స్, విజయవాడ వారి నుంచి శ్రీ కల్యాణసుందరీ జగన్నాథ్ గారి కథా సంకలనం 'అలరాస పుట్టిళ్లు' బయటకు వచ్చింది. దాన్ని అందుకున్న పాఠకులలో నేనూ ఉన్నాను. ఈ కథలు రాసి కల్యాణసుందరి గారు ఎందరో పాఠకుల్ని తమ అభిమానులుగా మార్చేశారు. ముఖ్యంగా 'అలరాస పుట్టిళ్లు' కథ అంత విశిష్టత గల కథ. అయితే, ఈ 'ఒక కథ' గురించి కల్యాణసుందరీ జగన్నాథ్ గారే ఇదే సంకలనంలో 'నా మాట' అంటూ తన కథా ప్రస్థానం గురించి రాశారు. ఇందులో తన తొలి కథకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చులో కథ పేరు 'ఒక చిన్న కథ' గానూ, రచయిత్రి పేరు 'అనామిక' గానూ, భారతి మాసపత్రిక 1941 లో అచ్చు పడినట్లుగానూ వారే తెలియజేశారు. తొలి కథను చదవాలనే ఆక్షతో పాత 'భారతి' సంచికలు వెతకడానికి సారస్వత నికేతనం (వేటపాలెంలోని సుప్రసిద్ధ గ్రంథాలయం)కు వెళ్లాను. లైబ్రరీ వారి సహకారంతో 1941 జనవరి మొదలు డిసెంబర్ దాకా అన్ని సంచికలు కూలంకషంగా వెతికాను. కల్యాణసుందరిగారి తొలి కథను అందిపుచ్చుకోవాలనే కోరిక... వాటిని వెతికాక నీరుగారిపోయింది. ఆవిడ చెప్పిన వివరాలతో ఏ సంచికలోనూ అటువంటి కథ ప్రచురితం కాలేదు. అయినా, 'భారతి'లో నా తల పెట్టి అలాగే మరో నాలుగేళ్లు ముందుకు అన్వేషణ కొనసాగించాను. అయినా ఫలితం లేకపోయింది. ఇలా కాదని... ఈసారి వెనుకకు వెళ్లి వెతికే ప్రయత్నం చేసి చూద్దాం... అనిపించింది. అలా చిన్నగా మళ్లీ పేజీ టూ పేజీ.... కథలన్నీ ఆవిడ చెప్పిన 'సిపాయి' జీవితం కోసం ఆబగా ప్రయత్నించాను. అలా ప్రయత్నం కొనసాగుతున్న క్రమంలో 1939 డిసెంబర్ సంచికలో ఈ 'ఒక కథ' దర్శనమిచ్చింది. ఆవిడ రాసినట్లు కొన్ని చిన్న తేడాలతో ఈ కథ కనిపించింది. రచయిత్రి పేరు 'అనామిక' అనీ, కథ పేరు 'ఒక చిన్న కథ' అనీ ఆమె రాశారు. ఆ ప్రకారం చూస్తే ఏ కథా.... 1941లో కానీ, దానికి అటు ఐదేళ్లు, ఇటు ఐదేళ్లు© 2017,www.logili.com All Rights Reserved.