డికెన్స్, ఉండ్ హౌస్, కానన్ డయల్' ధామస్ హార్డీ ప్రభావంతో రాశిపురం కృష్ణస్వామి నారాయణస్వామి(ఆర్.కె. నారాయణ్) గొప్ప రచయితయ్యారు. గొప్ప రచయిత కావడానికి వారు అమ్మమ్మ దగ్గర పెరగటం కూడా ఒక కారణం కావచ్చు. నగరీకరణలో నలిగిపోయి, ఆధునికతలో అలసిపోయి, సంప్రదాయజీవనం పట్ల మమకారంతో మానవ సంబంధాలే ప్రధానాంశాలుగా 34నవలలు రాశారాయన. అందులో తెలుగులో కొన్ని నవలలు అనువాదమయ్యాయి. అయితే అనువాదాలయిన ఆ కొన్ని నవలల్లో అతికొన్నే బాగున్నాయి. ఆ కొన్నింటిలో రమణారెడ్డిగారు అనువదించిన 'పెద్దపులి ఆత్మకధ'(ఎ టైగర్ ఫర్ మాల్గుడి), 'మాటకారి' (టాకటివ్ మ్యాన్) చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే 'మాటకారి' నవల కాదు - పెద్దకధ. ఈ కధ కూడా నారాయణ్ 'మాల్గుడి డేస్' కధల్లో కధే! అనుబంధలూ, ఆత్మీయతలూ, ఆందోళనలతో పాటు నాటకీయత పుష్కలంగా ఉన్న కధ ఇది. మన ఊరిలో జరిగిన కధలాగానే ఉంటుంది. పాత్రలు కూడా మన చుట్టూ ఉన్నట్టుగానే ఉంటాయి. చదువుతూంటే సరదా పడతాం. సన్న సన్నగా భయపడతాం. వ్యంగ్యం అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే అది వ్యంగం అనిపించేంతలోనే కళ్ళు చెమరుస్తాయి. నారాయణ్ గారి కధాకధనమే ఆ తీరు. చదివితే మీకే తెలుస్తుంది.
అనువాదం అంటే పదాలకు పదబంధాలకూ అర్ధాలు చెప్పటం కాదు, అనువాదం అంటే ఒకనాటి కాలాన్ని ఒడిసిపట్టడం, ఒకనాటి సంస్కృతికీ అద్దం పట్టడం. దాన్ని నూటికి నూరు శాతం ఇక్కడి అనువాదంలో సాధించారు రమణారెడ్డి.
- శ్రీ జగన్నాధ శర్మ
నవ్య వీక్లీ, హైదరాబాద్
డికెన్స్, ఉండ్ హౌస్, కానన్ డయల్' ధామస్ హార్డీ ప్రభావంతో రాశిపురం కృష్ణస్వామి నారాయణస్వామి(ఆర్.కె. నారాయణ్) గొప్ప రచయితయ్యారు. గొప్ప రచయిత కావడానికి వారు అమ్మమ్మ దగ్గర పెరగటం కూడా ఒక కారణం కావచ్చు. నగరీకరణలో నలిగిపోయి, ఆధునికతలో అలసిపోయి, సంప్రదాయజీవనం పట్ల మమకారంతో మానవ సంబంధాలే ప్రధానాంశాలుగా 34నవలలు రాశారాయన. అందులో తెలుగులో కొన్ని నవలలు అనువాదమయ్యాయి. అయితే అనువాదాలయిన ఆ కొన్ని నవలల్లో అతికొన్నే బాగున్నాయి. ఆ కొన్నింటిలో రమణారెడ్డిగారు అనువదించిన 'పెద్దపులి ఆత్మకధ'(ఎ టైగర్ ఫర్ మాల్గుడి), 'మాటకారి' (టాకటివ్ మ్యాన్) చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే 'మాటకారి' నవల కాదు - పెద్దకధ. ఈ కధ కూడా నారాయణ్ 'మాల్గుడి డేస్' కధల్లో కధే! అనుబంధలూ, ఆత్మీయతలూ, ఆందోళనలతో పాటు నాటకీయత పుష్కలంగా ఉన్న కధ ఇది. మన ఊరిలో జరిగిన కధలాగానే ఉంటుంది. పాత్రలు కూడా మన చుట్టూ ఉన్నట్టుగానే ఉంటాయి. చదువుతూంటే సరదా పడతాం. సన్న సన్నగా భయపడతాం. వ్యంగ్యం అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే అది వ్యంగం అనిపించేంతలోనే కళ్ళు చెమరుస్తాయి. నారాయణ్ గారి కధాకధనమే ఆ తీరు. చదివితే మీకే తెలుస్తుంది. అనువాదం అంటే పదాలకు పదబంధాలకూ అర్ధాలు చెప్పటం కాదు, అనువాదం అంటే ఒకనాటి కాలాన్ని ఒడిసిపట్టడం, ఒకనాటి సంస్కృతికీ అద్దం పట్టడం. దాన్ని నూటికి నూరు శాతం ఇక్కడి అనువాదంలో సాధించారు రమణారెడ్డి. - శ్రీ జగన్నాధ శర్మ నవ్య వీక్లీ, హైదరాబాద్© 2017,www.logili.com All Rights Reserved.