జెండాలకూ తమదైన ఒక రంగుల ప్రపంచం వుందన్న విషయం తెలిసినప్పుడు మీలో కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు. దానిని గురించి మీరు పరిశోధించవలసిన అవసరం ఉంది. నిజానికి పతాకాలది సుదీర్ఘ చరిత్ర. వాటికీ సొంత బాష కూడా వుంది. దాని ద్వారా అవి సమాచారాన్ని పంపుతాయి. సందేశాల్ని అందజేస్తాయి. అర్ధాలను అవగతం చేస్తాయి. జెండాలు వివిధ రకాలుగా, విభిన్న ఆకృతుల్లో ఉంటాయి. పతకాల వాడకం విషయంలో స్పష్టంగా నిర్వచించిన నిబంధనావళీ వుంది. జెండాలను ఎగరవేస్తున్నప్పుడు ఈ నియమ నిబంధనలను పాటించవలసి వుంటుంది.
కొన్ని పతకాలను ప్రభుత్వ భవనాలు, వ్యాపార సంస్థల భవంతులు, రాజకీయ, సాంఘిక సంస్థల కార్యాలయాలపైన ఎగురవేస్తారు. కొన్ని జెండాలు ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణిస్తున్న కార్ల మీద, సముద్రంలోని నౌకల పైన ఠీవిగా కనిపిస్తాయి. ఉత్తుంగ పర్వత శిఖరాలను అధిరోహించిన పర్వతారోహకులు ఆ శిఖరాగ్రాలలో తమ విజయానికి గుర్తుగా జయకేతనాలను ప్రతిష్టించడం రివాజు. అమెరికా, రష్యా దేశాలకు చెందిన వ్యోమగాములు చంద్రమండలంపై పాదం మోపినప్పుడు డానికి సాక్ష్యంగా వారు అక్కడ ప్రతిష్టించిన పతాకాలు రెపరెపలాడుతున్నాయి. అంటూ జెండాల ప్రాముఖ్యత గురించి వాని పరిణామక్రమాల గురించి, ప్రపంచ స్థలాల పతాకాలు గురించి బొమ్మలతో సహా అద్భుతంగా వర్ణించటం జరిగింది.
- కె. వి. సింగ్
జెండాలకూ తమదైన ఒక రంగుల ప్రపంచం వుందన్న విషయం తెలిసినప్పుడు మీలో కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు. దానిని గురించి మీరు పరిశోధించవలసిన అవసరం ఉంది. నిజానికి పతాకాలది సుదీర్ఘ చరిత్ర. వాటికీ సొంత బాష కూడా వుంది. దాని ద్వారా అవి సమాచారాన్ని పంపుతాయి. సందేశాల్ని అందజేస్తాయి. అర్ధాలను అవగతం చేస్తాయి. జెండాలు వివిధ రకాలుగా, విభిన్న ఆకృతుల్లో ఉంటాయి. పతకాల వాడకం విషయంలో స్పష్టంగా నిర్వచించిన నిబంధనావళీ వుంది. జెండాలను ఎగరవేస్తున్నప్పుడు ఈ నియమ నిబంధనలను పాటించవలసి వుంటుంది. కొన్ని పతకాలను ప్రభుత్వ భవనాలు, వ్యాపార సంస్థల భవంతులు, రాజకీయ, సాంఘిక సంస్థల కార్యాలయాలపైన ఎగురవేస్తారు. కొన్ని జెండాలు ముఖ్యమైన వ్యక్తులు ప్రయాణిస్తున్న కార్ల మీద, సముద్రంలోని నౌకల పైన ఠీవిగా కనిపిస్తాయి. ఉత్తుంగ పర్వత శిఖరాలను అధిరోహించిన పర్వతారోహకులు ఆ శిఖరాగ్రాలలో తమ విజయానికి గుర్తుగా జయకేతనాలను ప్రతిష్టించడం రివాజు. అమెరికా, రష్యా దేశాలకు చెందిన వ్యోమగాములు చంద్రమండలంపై పాదం మోపినప్పుడు డానికి సాక్ష్యంగా వారు అక్కడ ప్రతిష్టించిన పతాకాలు రెపరెపలాడుతున్నాయి. అంటూ జెండాల ప్రాముఖ్యత గురించి వాని పరిణామక్రమాల గురించి, ప్రపంచ స్థలాల పతాకాలు గురించి బొమ్మలతో సహా అద్భుతంగా వర్ణించటం జరిగింది. - కె. వి. సింగ్© 2017,www.logili.com All Rights Reserved.