సింహం.. ఓ బుజ్జిమేక..!
ఒకరోజు బుజ్జిమేక పచ్చటి ఆకులు మేస్తూ.. మేస్తూ.. భువనగిరి గుట్ట పైకి ఎక్కింది. మేఘాలు దాన్ని తాకుతూ వెళ్లడంతో చాలా సంతోషించింది. ఎంచక్కా మేఘాలతో ఆడుతూ, గంతులేస్తూ అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత చుట్టూరా చూసింది. దానితో కలిసి వచ్చిన మేకలేవీ కనిపించలేదు. దాంతో 'మే.. మే..' అంటూ భయం భయంగా అరవసాగిందా బుజ్జిమేక.
అక్కడి నుంచి కిందకు దిగేందుకు వెనకకు తిరిగింది. కానీ ఎటువైపు వెళ్లాలో దానికి తెలియలేదు. చుట్టుపక్కల అన్నీ చెట్లు, గుట్టలే ఉండటంతో వచ్చిన దారి కూడా మర్చిపోయింది. అలా నడుస్తూ.. నడుస్తూ అడవి మధ్యలోకి చేరుకుంది. అప్పటికే చీకటి పడింది. అక్కడ చెట్లు మీద ఉండే పక్షులన్నీ నిద్రలోకి జారుకున్నాయి. ఆ బుజ్జిమేక అరుపులకు వెంటనే వాటికి మెలకువ వచ్చింది.
ఏంటా అని ఓ చిలుక మెల్లగా గూటిలో నుంచి లేచి చూసింది. అప్పుడు దానికి భయంతో వణికిపోతున్న బుజ్జిమేక కనిపించింది. రివ్వున ఎగురుతూ.. కిందికి వచ్చి దాని ఎదురుగా వాలింది. దీంతో బుజ్జిమేక మరింత భయపడింది. 'భయపడకు మిత్రమా! నిన్నేమీ అనను. ఇంతకీ ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు?' అని ఆరా తీస్తూ అడిగింది చిలుక....................
సింహం.. ఓ బుజ్జిమేక..! ఒకరోజు బుజ్జిమేక పచ్చటి ఆకులు మేస్తూ.. మేస్తూ.. భువనగిరి గుట్ట పైకి ఎక్కింది. మేఘాలు దాన్ని తాకుతూ వెళ్లడంతో చాలా సంతోషించింది. ఎంచక్కా మేఘాలతో ఆడుతూ, గంతులేస్తూ అక్కడే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత చుట్టూరా చూసింది. దానితో కలిసి వచ్చిన మేకలేవీ కనిపించలేదు. దాంతో 'మే.. మే..' అంటూ భయం భయంగా అరవసాగిందా బుజ్జిమేక. అక్కడి నుంచి కిందకు దిగేందుకు వెనకకు తిరిగింది. కానీ ఎటువైపు వెళ్లాలో దానికి తెలియలేదు. చుట్టుపక్కల అన్నీ చెట్లు, గుట్టలే ఉండటంతో వచ్చిన దారి కూడా మర్చిపోయింది. అలా నడుస్తూ.. నడుస్తూ అడవి మధ్యలోకి చేరుకుంది. అప్పటికే చీకటి పడింది. అక్కడ చెట్లు మీద ఉండే పక్షులన్నీ నిద్రలోకి జారుకున్నాయి. ఆ బుజ్జిమేక అరుపులకు వెంటనే వాటికి మెలకువ వచ్చింది. ఏంటా అని ఓ చిలుక మెల్లగా గూటిలో నుంచి లేచి చూసింది. అప్పుడు దానికి భయంతో వణికిపోతున్న బుజ్జిమేక కనిపించింది. రివ్వున ఎగురుతూ.. కిందికి వచ్చి దాని ఎదురుగా వాలింది. దీంతో బుజ్జిమేక మరింత భయపడింది. 'భయపడకు మిత్రమా! నిన్నేమీ అనను. ఇంతకీ ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు?' అని ఆరా తీస్తూ అడిగింది చిలుక....................© 2017,www.logili.com All Rights Reserved.