అందరూ పుట్టుకతో సాహసవంతులు కారు, అన్ని అరణ్యాలూ చందన వృక్షాలతో ఉండవు, అన్ని ముత్యపు చిప్పలలో ముత్యాలు పడవు. అట్లాగే అందరూ భగవత్ ప్రేమికులు కారంటారు కబీర్. అట్టి కబీరు వంటి వారు ఎక్కడో, ఎప్పుడో పుడతారు. తాము తరించి ఇతరులను తరింపచేసే మహాత్ములు ప్రాతఃస్మరనీయులు.
అతడు నిరక్షరాస్యుడైన వివేకవంతుడే. లోన విరాగియైన బాహ్యంగా అతడు గృహస్థ జీవితం గడిపాడు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వల్ల ఒక సద్గురువుకై పరితపించాడు. ఇతడు హిందువో, మహామ్మదీయుడో ఎవరికీ తెలియదు కదా ! ఏ గురువు దీక్షనిస్తాడు? ఆనాటి ప్రసిద్ధ వైష్ణవ సంప్రదాయ గురువైన రామానందయతిని గురువుగా స్వీకరించాడు. ఇట్లా హిందూ, సూఫీ సిద్ధాంతాలు ఇతనిలో పెనవేసుకొని వున్నాయి.
కలం పట్టలేదని కబీర్ చెప్పినా అలవోకగా, ఆశువుగా పాటలు, పద్యాలూ ఇతని నోటి నుండి వెలువడేవి. అవి గుండె నుండి పెల్లుబికిన కవితా ధారలు.ఇతని దోహాలు ఒక విశిష్టమైన ఛందోరీతికి చెందినవి. చాలామంది కవులు దోహాలను వెలయించారు. సాఖీ ఎట్లా ఉండాలో తానే నిర్వచించాడు.
ఈ పుస్తకం లో కబీర్ పాటలు(ఒరిజినల్) వాటి అర్ధాలతో సహా ఇవ్వబడినది.
అందరూ పుట్టుకతో సాహసవంతులు కారు, అన్ని అరణ్యాలూ చందన వృక్షాలతో ఉండవు, అన్ని ముత్యపు చిప్పలలో ముత్యాలు పడవు. అట్లాగే అందరూ భగవత్ ప్రేమికులు కారంటారు కబీర్. అట్టి కబీరు వంటి వారు ఎక్కడో, ఎప్పుడో పుడతారు. తాము తరించి ఇతరులను తరింపచేసే మహాత్ములు ప్రాతఃస్మరనీయులు. అతడు నిరక్షరాస్యుడైన వివేకవంతుడే. లోన విరాగియైన బాహ్యంగా అతడు గృహస్థ జీవితం గడిపాడు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వల్ల ఒక సద్గురువుకై పరితపించాడు. ఇతడు హిందువో, మహామ్మదీయుడో ఎవరికీ తెలియదు కదా ! ఏ గురువు దీక్షనిస్తాడు? ఆనాటి ప్రసిద్ధ వైష్ణవ సంప్రదాయ గురువైన రామానందయతిని గురువుగా స్వీకరించాడు. ఇట్లా హిందూ, సూఫీ సిద్ధాంతాలు ఇతనిలో పెనవేసుకొని వున్నాయి. కలం పట్టలేదని కబీర్ చెప్పినా అలవోకగా, ఆశువుగా పాటలు, పద్యాలూ ఇతని నోటి నుండి వెలువడేవి. అవి గుండె నుండి పెల్లుబికిన కవితా ధారలు.ఇతని దోహాలు ఒక విశిష్టమైన ఛందోరీతికి చెందినవి. చాలామంది కవులు దోహాలను వెలయించారు. సాఖీ ఎట్లా ఉండాలో తానే నిర్వచించాడు. ఈ పుస్తకం లో కబీర్ పాటలు(ఒరిజినల్) వాటి అర్ధాలతో సహా ఇవ్వబడినది.© 2017,www.logili.com All Rights Reserved.