శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.
ఏ శుభకర్మను ఆరంభించినా ముందుగా గణపతిని పూజిస్తున్నాం. ఇట్లా ఎందుకు పూజించాలి? ఇతని ప్రస్తావన వేదాలలో ఉందా? పురాణాలలోనే ఉందా? హేతువాదులు ఆక్షేపించే గణపతి కథలు ఏదైనా పరమార్థాన్ని అందిస్తున్నాయా? ఈ దేశ ప్రజలే ఆరాధించారా? ఇతర దేశాలవారు ఆరాధించారా? ఒక్కరూపంలో లేకుండా 51 రూపాలలో గణపతి ఎందుకుండాలి? గణపతి శిల్పంలో ఏదైనా రహస్యం ఇమిడి ఉందా? మొదలైన అనేక సందేహాలను నివృత్తి చేయడమే ఈ రచన లక్ష్యం.
శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. ఏ శుభకర్మను ఆరంభించినా ముందుగా గణపతిని పూజిస్తున్నాం. ఇట్లా ఎందుకు పూజించాలి? ఇతని ప్రస్తావన వేదాలలో ఉందా? పురాణాలలోనే ఉందా? హేతువాదులు ఆక్షేపించే గణపతి కథలు ఏదైనా పరమార్థాన్ని అందిస్తున్నాయా? ఈ దేశ ప్రజలే ఆరాధించారా? ఇతర దేశాలవారు ఆరాధించారా? ఒక్కరూపంలో లేకుండా 51 రూపాలలో గణపతి ఎందుకుండాలి? గణపతి శిల్పంలో ఏదైనా రహస్యం ఇమిడి ఉందా? మొదలైన అనేక సందేహాలను నివృత్తి చేయడమే ఈ రచన లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.