శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.
అవతారతత్త్వం, వేదాలలో అవతారాలు, అవతారాల సంఖ్య, వేదం మంత్రాలలో ప్రత్యేక దేవతగా విష్ణువు ఆరాధింపబడలేదనే వాదాన్ని ఖండించడం, యజ్ఞమే విష్ణువని, విష్ణువే యజ్ఞమని వివరించడం, పెక్కు పురాణకథలను పేర్కొనడం, శిల్ప ఆగమగ్రంథాలలో విష్ణువిగ్రహ నిర్మాణం, విగ్రహశిల్పంలో దాగిన పరమార్థాన్ని తేటతెల్లం చేయడం, పుణ్యక్షేత్రాలను పేర్కొనడం, పరమదైవంగా, పరతత్త్వంగా విష్ణువునెట్లా ఈ జాతి ఆరాధించిందో వివరించడం, ఆది, అంతమూ లేని వైష్ణవ గంగ ఎట్లా ఈ కర్మభూమిలో ప్రవహించిందో తెలియచేయడమే ఈ గ్రంథ లక్ష్యం.
శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. అవతారతత్త్వం, వేదాలలో అవతారాలు, అవతారాల సంఖ్య, వేదం మంత్రాలలో ప్రత్యేక దేవతగా విష్ణువు ఆరాధింపబడలేదనే వాదాన్ని ఖండించడం, యజ్ఞమే విష్ణువని, విష్ణువే యజ్ఞమని వివరించడం, పెక్కు పురాణకథలను పేర్కొనడం, శిల్ప ఆగమగ్రంథాలలో విష్ణువిగ్రహ నిర్మాణం, విగ్రహశిల్పంలో దాగిన పరమార్థాన్ని తేటతెల్లం చేయడం, పుణ్యక్షేత్రాలను పేర్కొనడం, పరమదైవంగా, పరతత్త్వంగా విష్ణువునెట్లా ఈ జాతి ఆరాధించిందో వివరించడం, ఆది, అంతమూ లేని వైష్ణవ గంగ ఎట్లా ఈ కర్మభూమిలో ప్రవహించిందో తెలియచేయడమే ఈ గ్రంథ లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.