పిల్లల కోడి నౌట తెరపించుక లేదిక, నేమిసేతు నే
నిల్లును దిద్దుకొంచు నొక యించుక తెన్నొకటబ్బేనేవి నే
నుల్లస మంది యత్తరిని నోపిక దెచ్చుక నోపిక దెచ్చుక కొన్ని పద్యముల్
జల్లగ వ్రాయు జూతు సుమి! చారుగుణాకర! శ్రీమనోహరా!
- జొన్నలగడ్డ శారదాంబ
ఇది ఒక భార్య వేదన, పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోనటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్థితి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవల్సిందే. "ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయజూతు సుమీ" అని చెప్పటంలో వ్యక్తమైంది ఆ ఒక్క స్త్రీ స్థితి మాత్రమే కాదు. కవిత్వ రంగంలో, ఆ మాటకొస్తే మొత్తం సాహిత్య రంగంలో ఉన్న స్త్రీలందరి స్థితికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇన్ని ఒత్తిడులు మధ్య, వ్యతిరేక పరిస్థితుల మధ్య స్త్రీలు రచన చేయాల్సి వస్తున్నది కనుకనే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వ్రాయలేరు. ప్రధాన స్రవంతి పురుష సాహిత్య ప్రపంచంలో తమకొక స్థానాన్ని పొందలేరు. 1930ల నాటి ఈ స్థితికి దాటి సాహిత్య ప్రపంచంలో స్త్రీల గమనం ఏ దిశగా సాగిందో, ఏ గమ్యాన్ని చేరిందో కళ్ళముందున్న వర్తమానంతో పోల్చి మనమిప్పుడు బేరీజు వేసుకోవలసి ఉన్నది.
పిల్లల కోడి నౌట తెరపించుక లేదిక, నేమిసేతు నే నిల్లును దిద్దుకొంచు నొక యించుక తెన్నొకటబ్బేనేవి నే నుల్లస మంది యత్తరిని నోపిక దెచ్చుక నోపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయు జూతు సుమి! చారుగుణాకర! శ్రీమనోహరా! - జొన్నలగడ్డ శారదాంబ ఇది ఒక భార్య వేదన, పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోనటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్థితి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవల్సిందే. "ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్ జల్లగ వ్రాయజూతు సుమీ" అని చెప్పటంలో వ్యక్తమైంది ఆ ఒక్క స్త్రీ స్థితి మాత్రమే కాదు. కవిత్వ రంగంలో, ఆ మాటకొస్తే మొత్తం సాహిత్య రంగంలో ఉన్న స్త్రీలందరి స్థితికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇన్ని ఒత్తిడులు మధ్య, వ్యతిరేక పరిస్థితుల మధ్య స్త్రీలు రచన చేయాల్సి వస్తున్నది కనుకనే వాళ్ళు అనుకున్నంత స్థాయిలో వ్రాయలేరు. ప్రధాన స్రవంతి పురుష సాహిత్య ప్రపంచంలో తమకొక స్థానాన్ని పొందలేరు. 1930ల నాటి ఈ స్థితికి దాటి సాహిత్య ప్రపంచంలో స్త్రీల గమనం ఏ దిశగా సాగిందో, ఏ గమ్యాన్ని చేరిందో కళ్ళముందున్న వర్తమానంతో పోల్చి మనమిప్పుడు బేరీజు వేసుకోవలసి ఉన్నది.© 2017,www.logili.com All Rights Reserved.