చరిత్రకారులు వాస్తవ జీవితానికి సంబంధించిన వంతెనలు కట్టరు. సమాచారంలోని లోతుల అగాధాలమీద వంతెనలు కడ్తారు. మందులిచ్చి రుగ్మతలను తొలగించరు. భవిష్యత్తులో రాబోతున్న వినాశనం గురించి హెచ్చరిస్తారు. దాన్ని ఎదుర్కొనే మార్గాలు చెప్తారు. భవిష్యత్తును సుఖమయం చేసుకోవడానికి సమాజం ఏం చెయ్యాలో చేస్తారు. లేక చెప్పాలి! చరిత్రవారికా జ్ఞానం కలిగిస్తుంది. చరిత్రని వక్రీకరించేవారు, కల్తీమందులిచ్చే వైద్యుల్లాంటివారు.
అయితే చరిత్రకారులు తాము నివసిస్తున్న ప్రాంతపు, కాలపు సమాజపు ప్రభావాలతోనే చరిత్రనర్దం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. వారు తమ రచనల్లో సమకాలపు ఆశలని నిరశాలని ప్రతిబింబిస్తారు. అంటే అనుభవాలు చరిత్రకారుల బుర్రలపైపడి పరావర్తనం చెంది బయటపడ్తాయి. అంటే చేస్తున్న పరిశీలనలో వారి ప్రమేయం ఉంటుంది. అంటే పరమాణిక భౌతికశాస్త్రంలోని పరిశీలన విషయంలో చెప్పినది ఇక్కడా వర్తిస్తుంది. అది వ్యక్తీ విశిష్టత.
చరిత్రని పరిశీలించేటప్పుడు జరిగిన వృత్తాంతాలకి కారణాలను అన్వేషించటమే. ఎన్నో కారణాలున్నప్పుడు బలమైన కారణాలను గుర్తించాలి. చరిత్ర వర్తమానాన్ని అర్ధం చేసుకోవడానికి కీలకమైనది. ఇదంతా చరిత్రకారుల పనే. అయితే అనుభవాలని విశ్లేషించేముందు అవి అబద్ధపు అనుభవాలు, అపార్ధపు అనుభవాలు కాకుండా చూసుకోవాలి.
ఈ వ్యాసాల్లో మన గత చరిత్రని అందులోనూ ప్రాచీన చరిత్రని నిర్మించటంలో అబద్ధపు అనుభవాలు(Wrong data), అపార్ధపు అనుభవాలు(Erroneous data)ల పాత్రల గురించిన చర్చ అసలు యదర్ధపు అనుభవాలు ఏమై ఉంటాయన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది.
- కవన శర్మ
చరిత్రకారులు వాస్తవ జీవితానికి సంబంధించిన వంతెనలు కట్టరు. సమాచారంలోని లోతుల అగాధాలమీద వంతెనలు కడ్తారు. మందులిచ్చి రుగ్మతలను తొలగించరు. భవిష్యత్తులో రాబోతున్న వినాశనం గురించి హెచ్చరిస్తారు. దాన్ని ఎదుర్కొనే మార్గాలు చెప్తారు. భవిష్యత్తును సుఖమయం చేసుకోవడానికి సమాజం ఏం చెయ్యాలో చేస్తారు. లేక చెప్పాలి! చరిత్రవారికా జ్ఞానం కలిగిస్తుంది. చరిత్రని వక్రీకరించేవారు, కల్తీమందులిచ్చే వైద్యుల్లాంటివారు. అయితే చరిత్రకారులు తాము నివసిస్తున్న ప్రాంతపు, కాలపు సమాజపు ప్రభావాలతోనే చరిత్రనర్దం చేసుకొనే ప్రయత్నం చేస్తారు. వారు తమ రచనల్లో సమకాలపు ఆశలని నిరశాలని ప్రతిబింబిస్తారు. అంటే అనుభవాలు చరిత్రకారుల బుర్రలపైపడి పరావర్తనం చెంది బయటపడ్తాయి. అంటే చేస్తున్న పరిశీలనలో వారి ప్రమేయం ఉంటుంది. అంటే పరమాణిక భౌతికశాస్త్రంలోని పరిశీలన విషయంలో చెప్పినది ఇక్కడా వర్తిస్తుంది. అది వ్యక్తీ విశిష్టత. చరిత్రని పరిశీలించేటప్పుడు జరిగిన వృత్తాంతాలకి కారణాలను అన్వేషించటమే. ఎన్నో కారణాలున్నప్పుడు బలమైన కారణాలను గుర్తించాలి. చరిత్ర వర్తమానాన్ని అర్ధం చేసుకోవడానికి కీలకమైనది. ఇదంతా చరిత్రకారుల పనే. అయితే అనుభవాలని విశ్లేషించేముందు అవి అబద్ధపు అనుభవాలు, అపార్ధపు అనుభవాలు కాకుండా చూసుకోవాలి. ఈ వ్యాసాల్లో మన గత చరిత్రని అందులోనూ ప్రాచీన చరిత్రని నిర్మించటంలో అబద్ధపు అనుభవాలు(Wrong data), అపార్ధపు అనుభవాలు(Erroneous data)ల పాత్రల గురించిన చర్చ అసలు యదర్ధపు అనుభవాలు ఏమై ఉంటాయన్న చర్చ ఎక్కువగా జరుగుతుంది. - కవన శర్మ© 2017,www.logili.com All Rights Reserved.