స్త్రీ తన బాల్యం నుండి జీవిత చరమాంకం దాకా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. సంతానోత్పత్తి కోసం ఆమె శరీరంలో తయారయ్యే కొన్ని ప్రత్యేక హార్మోనులు ఆమెకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో సమతుల్యం లోపిస్తే ఆమె శరీరాన్ని అంతగా ఇబ్బందులకూ గురి చేస్తాయి. ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ నుండి గర్భాశయ క్యాన్సర్ దాకా ఆమె ప్రాణాన్ని హరింపజేసే వ్యాధులు మరెన్నో. ఇటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవడం ప్రతి స్త్రీకీ ఎంతో అవసరం. అలాంటి పరిజ్ఞానాన్ని తెలియజేయటం డాక్టర్ల కర్తవ్యం.
డాక్టర్ సీ.యల్. వెంకటరావుగారు "లేడిస్ హెల్త్" అనే పుస్తకం ద్వారా సమాజం పట్ల తన బాధ్యతను, కర్తవ్యాన్ని నేరవేరుస్తున్ననందుకు అభినందిస్తున్నాను.
స్త్రీలకు తమ శరీరం పట్ల అవగాహన కల్పించడానికి, తమ శరీరంలో జరుగుతన్న మార్పులలో ఏఏ సహజమైనవి, ఏవి అనారోగ్యమైనవి, తదితర విషయాలు తెలుసుకోవడానికి "లేడిస్ హెల్త్" అనే ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుంది.
సామాజిక స్పృహతో వైద్యునిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సి.యల్. వెంకటరావుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన ఆశయం తప్పకుండా సఫలికృతమవ్వాలని కోరుకుంటున్నాను.
- నారా చంద్రబాబునాయుడు
స్త్రీ తన బాల్యం నుండి జీవిత చరమాంకం దాకా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. సంతానోత్పత్తి కోసం ఆమె శరీరంలో తయారయ్యే కొన్ని ప్రత్యేక హార్మోనులు ఆమెకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో సమతుల్యం లోపిస్తే ఆమె శరీరాన్ని అంతగా ఇబ్బందులకూ గురి చేస్తాయి. ఇవి కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ నుండి గర్భాశయ క్యాన్సర్ దాకా ఆమె ప్రాణాన్ని హరింపజేసే వ్యాధులు మరెన్నో. ఇటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవడం ప్రతి స్త్రీకీ ఎంతో అవసరం. అలాంటి పరిజ్ఞానాన్ని తెలియజేయటం డాక్టర్ల కర్తవ్యం. డాక్టర్ సీ.యల్. వెంకటరావుగారు "లేడిస్ హెల్త్" అనే పుస్తకం ద్వారా సమాజం పట్ల తన బాధ్యతను, కర్తవ్యాన్ని నేరవేరుస్తున్ననందుకు అభినందిస్తున్నాను. స్త్రీలకు తమ శరీరం పట్ల అవగాహన కల్పించడానికి, తమ శరీరంలో జరుగుతన్న మార్పులలో ఏఏ సహజమైనవి, ఏవి అనారోగ్యమైనవి, తదితర విషయాలు తెలుసుకోవడానికి "లేడిస్ హెల్త్" అనే ఈ పుస్తకం ఎంతగానో దోహదం చేస్తుంది. సామాజిక స్పృహతో వైద్యునిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సి.యల్. వెంకటరావుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆయన ఆశయం తప్పకుండా సఫలికృతమవ్వాలని కోరుకుంటున్నాను. - నారా చంద్రబాబునాయుడు© 2017,www.logili.com All Rights Reserved.