ప్రస్తుతం మనమెదుర్కొంటున్న మరో ముప్పు ఆర్ధిక సంక్షోభం, ధరలు పెరగడం, ఉపాధికోల్పోవడం, ఉద్యోగాలు ఊడిపోవడం. కుటుంబాలు వీధిన పడటం ఎందుకు జరుగుతోంది. దీనికంతా కరోనానే కారణమని పాలకులు చెబుతుంటారు. కానీ అది సంపూర్ణ సత్యం కాదు. కరోనా కంటే ముందే మన పాలకుల విధానాల ఫలితంగా మన దేశం ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది. కొరోనా వ్యాధిని కట్టడి చేసే పేరుతో ప్రకటించిన అనాలోచిత "లాక్ డౌన్ " ఆ ప్రమాదాన్ని మరింత ఉదృతం చేసింది. రాష్ట్రాల హక్కులు మరింత దిగజారుతున్నాయి. వ్యవసాయం, విద్య, విద్యుత్తూ సర్వ రంగాలు రాష్ట్రాల చేతుల నుండి కేంద్రం లాక్కుంటూ, "ప్రైవేటీకరిస్తున్న తీరును" మనం నేడు చూస్తున్నాం. ఇక్కడో విషయం గమనించాలి. వ్యవసాయరంగానికి పెను ప్రమాదంగా ముందుకొచ్చిన ఈ చట్టాల వెనుక అంబానీ, ఆదానీలాంటి కార్పొరేట్లే కాదు, ఇంకా పెద్ద తిమింగలాలే ఉన్నాయి. అవే అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తులు.