భాట్టం శ్రీరామమూర్తిగారు 12.5.1926న జన్మించారు. సోషలిస్టు భావాలతో రాజకీయాలలో ప్రవేశించారు. 1952-58మధ్య సోషలిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో వివిధ పదవులు నిర్వహించారు. 1957లో తొలిసారి సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్ అభ్యర్ధిగా 1967నుండి 1983 వరకు మూడుసార్లు శాసనసభకు, 1984లో లోక్ సభకు ఎన్నికయ్యారు.
1972-81మధ్యకాలంలో ఏడు సంవత్సరాలు రాష్ట్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్రస్థాయి హరిజన సదస్సువంటి అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రెండు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రముఖ క్రియాశీల పాత్ర పోషించారు.
పదిహేడు సంవత్సరాలపాటు ఏఐసీసీ సభ్యుడుగా ఉన్నారు.
'ప్రజారధం', 'ఆంధ్రజనత' పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులోను, ఇంగ్లిషులోనూ వివిధ పత్రికలలో రచనలు చేశారు. సాహిత్య సాంస్కృతిక విలువలు సంతరించుకున్న పలు గ్రంధాలు రచించారు.
తమ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హంగరీ, ఇటలీ, ఆస్ట్రియా, యుఎస్ఎస్ఆర్ వంటి వివిధ దేశాలను సందర్శించారు.
నిస్వార్ధ నాయకునిగా, బలహీనవర్గాల పక్షాన అలుపెరుగని పోరాటం సాగించిన యోధునిగా, ప్రజాసేవకునిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు.
1989తరువాత రాజకీయాలనుండి విరమించుకొని ఆధ్యాత్మిక జీవనంలో పరిణతి సాధించారు. దేశాన్ని గురించి, దేశప్రజల భవితవ్యాన్ని గురించి, నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన సహజోన్నత సంస్కార సంపన్నత, ఔదార్య మధురిమ, అర్ధవంతమైన రాజనీతి అందరికీ ఆదర్శం, ఆచరణియం.
'స్వేచ్చాభారతం' భాట్టం శ్రీరామమూర్తిగారి ఆత్మకధ మాత్రమేకాదు, సమకాలీన దేశ చరిత్ర కూడా. గత ఆరు దశాబ్దాలలో రాజకీయ, సామజిక, సాంస్కృతిక రంగాలలో చోటు చేసుకున్న పలు పరిణామాల పట్ల ఒక సచ్చీలుడైన పౌరుని ఆవేదన కూడా.
భాట్టం శ్రీరామమూర్తిగారు 12.5.1926న జన్మించారు. సోషలిస్టు భావాలతో రాజకీయాలలో ప్రవేశించారు. 1952-58మధ్య సోషలిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో వివిధ పదవులు నిర్వహించారు. 1957లో తొలిసారి సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. తరువాత కాంగ్రెస్ అభ్యర్ధిగా 1967నుండి 1983 వరకు మూడుసార్లు శాసనసభకు, 1984లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1972-81మధ్యకాలంలో ఏడు సంవత్సరాలు రాష్ట్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. మంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్రస్థాయి హరిజన సదస్సువంటి అనేక విశిష్ట కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రెండు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రముఖ క్రియాశీల పాత్ర పోషించారు. పదిహేడు సంవత్సరాలపాటు ఏఐసీసీ సభ్యుడుగా ఉన్నారు. 'ప్రజారధం', 'ఆంధ్రజనత' పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులోను, ఇంగ్లిషులోనూ వివిధ పత్రికలలో రచనలు చేశారు. సాహిత్య సాంస్కృతిక విలువలు సంతరించుకున్న పలు గ్రంధాలు రచించారు. తమ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో హంగరీ, ఇటలీ, ఆస్ట్రియా, యుఎస్ఎస్ఆర్ వంటి వివిధ దేశాలను సందర్శించారు. నిస్వార్ధ నాయకునిగా, బలహీనవర్గాల పక్షాన అలుపెరుగని పోరాటం సాగించిన యోధునిగా, ప్రజాసేవకునిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారు. 1989తరువాత రాజకీయాలనుండి విరమించుకొని ఆధ్యాత్మిక జీవనంలో పరిణతి సాధించారు. దేశాన్ని గురించి, దేశప్రజల భవితవ్యాన్ని గురించి, నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నారు. ఆయన సహజోన్నత సంస్కార సంపన్నత, ఔదార్య మధురిమ, అర్ధవంతమైన రాజనీతి అందరికీ ఆదర్శం, ఆచరణియం. 'స్వేచ్చాభారతం' భాట్టం శ్రీరామమూర్తిగారి ఆత్మకధ మాత్రమేకాదు, సమకాలీన దేశ చరిత్ర కూడా. గత ఆరు దశాబ్దాలలో రాజకీయ, సామజిక, సాంస్కృతిక రంగాలలో చోటు చేసుకున్న పలు పరిణామాల పట్ల ఒక సచ్చీలుడైన పౌరుని ఆవేదన కూడా.© 2017,www.logili.com All Rights Reserved.