ఈ చిన్న పుస్తకంలో ఆరుగురు సంఘసంస్కర్తల సంస్కరణోధ్యమ కధలను పిల్లలకూ, పెద్దలకూ ఆసక్తికరంగా వుండేటట్టు వివరించడం జరిగింది.
రాజా రామ మోహన రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఉన్నవ లక్ష్మినారాయణ, దరిశి చెంచయ్య, ఈ ఆరుగురి పేర్లు సంఘ సంస్కరణోధ్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వీరు చేసిన త్యాగాలు సనాతన వాదులతో సలిపిన పోరాటాలు, చిరస్మరణీయమైనవి.
కాలగమనంలో సాంఘిక జీవనంలో ఎన్నో దురాచారాలు చోటు చేసుకుంటాయి. ఈ కధ ఒక నాటి సతీసహగమనాలతో ప్రారంభమై నేటి వరకట్న సమస్య వరకూ వున్నది. ఇట్లాంటి దురాచారాలను ధీశాలూరు చూస్తూ ఊరుకోరు. మందిలో ఒకరుగా వాటిని అంగీకరించరు. వీటిని సరిచెయ్యడానికి ఎన్ని కష్టాలు ఎదురయినా నడుం బిగిస్తారు.
ఈ కృషిలో వారికి ఎవరూ తోడూ వుండరు. పైగా వాళ్లు ముందుకు వెళ్ళకుండా చెయ్యడానికి ఎన్నో అడ్డంకులను కల్పించడానికి కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది ఒంటరి పోరాటం.
ఈ ఒంటరి పోరాటాన్ని ఆరుగురు త్యాగమూర్తులు ఎలా సాగించిందీ ఈ పుస్తకం వివరిస్తుంది.
ఈ పుస్తకం మిగతా జీవిత చరిత్ర గ్రంధాల కంటె భిన్నమైనది. ఇందులో ఆ మహానీయుల జననం, మరణం, వంటి సాధారణ వివరాలు కొన్ని యిచ్చినప్పటికీ, ప్రాధాన్యత మాత్రం వారు చేసిన సంఘ సంస్కరణ కృషికే ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్తల గురించి ఈ తరం వారు తెలుసుకోవలసింది సాధారణ జీవిత వివరాలకంటే, - సంఘంతో వారు సాగించిన పోరాటం గురించే పాఠకులు తెలుసుకోవడం ముఖ్యం అని ఈ రచయిత అభిప్రాయం. ఆ విధంగా ఇది ఆరుగురు సంఘ సంస్కరణోధ్యమాల కధ.
ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గురించి చెప్పక తప్పదు. భారత దేశంలో మొదటిలో జరిగిన సంఘ సంస్కరణోధ్యామాలన్నీ స్త్రీల అభ్యుదయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జరిగినవే! సతీసహగమనమైనా, కన్యా శుల్క వరశుల్క సమస్యలైనా, - అన్నీ స్త్రీకీ శారీరక, మానసిక సమస్యలను కలిగించేవే.
ఈ సమస్యలన్నింటికీ మూల కారణం స్త్రీ, పురుషుల మధ్య సమానత లేకపోవటం. అన్ని విధాలా స్త్రీని అణగ ద్రోక్కడం. ఈ మూల కారణాన్ని తోలగొంచేందుకే తొలి తరం సంఘ సంస్కర్తలందరూ అహర్నిశలూ శ్రమించారు. పాఠకులకు ఈ పుస్తకం స్పూర్తి నివ్వగలదని నా ఆకాంక్ష.
- కోడూరి శ్రీరామమూర్తి
ఈ చిన్న పుస్తకంలో ఆరుగురు సంఘసంస్కర్తల సంస్కరణోధ్యమ కధలను పిల్లలకూ, పెద్దలకూ ఆసక్తికరంగా వుండేటట్టు వివరించడం జరిగింది. రాజా రామ మోహన రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, ఉన్నవ లక్ష్మినారాయణ, దరిశి చెంచయ్య, ఈ ఆరుగురి పేర్లు సంఘ సంస్కరణోధ్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవి. వీరు చేసిన త్యాగాలు సనాతన వాదులతో సలిపిన పోరాటాలు, చిరస్మరణీయమైనవి. కాలగమనంలో సాంఘిక జీవనంలో ఎన్నో దురాచారాలు చోటు చేసుకుంటాయి. ఈ కధ ఒక నాటి సతీసహగమనాలతో ప్రారంభమై నేటి వరకట్న సమస్య వరకూ వున్నది. ఇట్లాంటి దురాచారాలను ధీశాలూరు చూస్తూ ఊరుకోరు. మందిలో ఒకరుగా వాటిని అంగీకరించరు. వీటిని సరిచెయ్యడానికి ఎన్ని కష్టాలు ఎదురయినా నడుం బిగిస్తారు. ఈ కృషిలో వారికి ఎవరూ తోడూ వుండరు. పైగా వాళ్లు ముందుకు వెళ్ళకుండా చెయ్యడానికి ఎన్నో అడ్డంకులను కల్పించడానికి కూడా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది ఒంటరి పోరాటం. ఈ ఒంటరి పోరాటాన్ని ఆరుగురు త్యాగమూర్తులు ఎలా సాగించిందీ ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం మిగతా జీవిత చరిత్ర గ్రంధాల కంటె భిన్నమైనది. ఇందులో ఆ మహానీయుల జననం, మరణం, వంటి సాధారణ వివరాలు కొన్ని యిచ్చినప్పటికీ, ప్రాధాన్యత మాత్రం వారు చేసిన సంఘ సంస్కరణ కృషికే ఇవ్వడం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్తల గురించి ఈ తరం వారు తెలుసుకోవలసింది సాధారణ జీవిత వివరాలకంటే, - సంఘంతో వారు సాగించిన పోరాటం గురించే పాఠకులు తెలుసుకోవడం ముఖ్యం అని ఈ రచయిత అభిప్రాయం. ఆ విధంగా ఇది ఆరుగురు సంఘ సంస్కరణోధ్యమాల కధ. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని గురించి చెప్పక తప్పదు. భారత దేశంలో మొదటిలో జరిగిన సంఘ సంస్కరణోధ్యామాలన్నీ స్త్రీల అభ్యుదయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జరిగినవే! సతీసహగమనమైనా, కన్యా శుల్క వరశుల్క సమస్యలైనా, - అన్నీ స్త్రీకీ శారీరక, మానసిక సమస్యలను కలిగించేవే. ఈ సమస్యలన్నింటికీ మూల కారణం స్త్రీ, పురుషుల మధ్య సమానత లేకపోవటం. అన్ని విధాలా స్త్రీని అణగ ద్రోక్కడం. ఈ మూల కారణాన్ని తోలగొంచేందుకే తొలి తరం సంఘ సంస్కర్తలందరూ అహర్నిశలూ శ్రమించారు. పాఠకులకు ఈ పుస్తకం స్పూర్తి నివ్వగలదని నా ఆకాంక్ష. - కోడూరి శ్రీరామమూర్తి
© 2017,www.logili.com All Rights Reserved.