"మతవిశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవి ఇన్హేలర్ల స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గాని, సమాజపు ఆరోగ్యానికి గాని పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా 'సైడ్ ఎఫెక్ట్స్' చాలా ప్రమాదకరమైనవి. వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలూ సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రొజు ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరుపిస్తూనే ఉంది.
ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలు, భాద్రతాభావము కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్ధ ప్రయత్నమే. ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్దిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకు గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకము, బలహీనతా కాదు.
దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికీ ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి."
మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది? మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి? మతాల నేపధ్యం, లాభనష్టల గురించి విస్తృత అధ్యయనం తో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.
"మతవిశ్వాసాల ద్వారా సమకూరే ఉపయోగాలేవి ఇన్హేలర్ల స్థాయిని మించవు. వాటివల్ల వ్యక్తిగత ఆరోగ్యానికి గాని, సమాజపు ఆరోగ్యానికి గాని పట్టిన 'జలుబు' ఎంతమాత్రమూ తగ్గదు. పైగా 'సైడ్ ఎఫెక్ట్స్' చాలా ప్రమాదకరమైనవి. వ్యక్తిగతంగా నిరపాయకరంగా అనిపించే నమ్మకాలూ సామూహికంగా ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తాయో రొజు ప్రపంచమంతటా జరుగుతున్న మతహింస నిరుపిస్తూనే ఉంది. ప్రాణులను సృష్టించినది దేవుడనే భావన మానవజాతి చరిత్రలో ఒక దశలో తలెత్తిన తప్పుడు నమ్మకం. మతాన్ని నమ్మడమంటే సుఖసంతోషాలు, భాద్రతాభావము కరువైన ప్రపంచంలో వాటిని వెతుక్కునేందుకు చేసే వ్యర్ధ ప్రయత్నమే. ఈనాటి సామాన్యుల జీవితాల్లోని సామాజిక ఆర్దిక అనిశ్చితస్థితి వారిని మరింత అయోమయానికీ, గుడ్డి నమ్మకాలకు గురిచేస్తోందనడంలో సందేహం లేదు. ఇది కొందరి వ్యక్తిగత నమ్మకము, బలహీనతా కాదు. దేవుడున్నాడని వాదించేవారికి సమాధానం చెప్పాలంటే దేవుడులేడని వాదిస్తే సరిపోదు. వారికీ ఆ అపోహ ఎప్పుడు, ఎందుకు, ఎలా కలిగిందో కూడా చెప్పాలి." మతం అనే భావన ఎప్పుడు ఎలా పురుడుపోసుకుంది? మతానికి గల చారిత్రక, సామాజిక, మానసికమైన మూలాలు ఎక్కడున్నాయి? మతాల నేపధ్యం, లాభనష్టల గురించి విస్తృత అధ్యయనం తో వైజ్ఞానికంగా లోతుగా విశ్లేషించే రచన ఇది.
© 2017,www.logili.com All Rights Reserved.