బోన్సాయ్ మనుషులు
"డైనింగ్ టేబుల్ ఒక అలంకారం అయిపోయిందండీ!" ఇంట్లో అడుగుపెట్టగానే అంది పార్వతి."
సంభ్రమంగా చూశాను.
"హాలులో సగం ఆక్రమించి అన్నిటికీ అడ్డుగా ఉంటోంది. దాన్ని కోయించి చిన్న చిన్న టేబుళ్ళుగా, టీపాయ్లుగా చేయిస్తే మంచిది”
నా భార్య మాటలకు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా చూశాను. నా గురించి నా ఫీలింగ్సు గురించి తెలిసి కూడా ఆమె అలా మాట్లాట్టం నన్ను నిర్విణుణ్ణి చేసింది.
"ఏవిటలా చూస్తున్నారు. నిన్ననే ఏదో పేపర్లో చదివేను. ఒక సంవత్సరం పాటు ఉ పయోగించని వస్తువు ఇంట్లో ఉంచుకోవడం అనవసరమట”
నేను మాట్లాడలేకపోయాను. బాధతో కుమిలిపోతూ డైనింగ్ టేబుల్ని సమీపించాను.
హాలులో ఒక పక్కగా జాలిగొలుపుతూ ఉంది. చక్కని నగిషీ పనితనంతో అలరారుతూ ఒకనాటి వైభవానికి ప్రతీకగా నిలిచి ఉంది. నిట్టూరుస్తూ ఉంది!
నేను రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ముదురు టేకుతో దాన్ని ప్రత్యేకంగా చేయించాను. అంచులకూ, మధ్యలోని పద్మాలకూ రోజుడ్ ఉపయోగించాం. దాని కాళ్ళు దేవాలయస్తంభాల మీద కనిపించే సింహపు కాళ్ళను పోలి ఉంటాయి.
మా ఇంటికొచ్చిన ప్రతివారూ డైనింగ్ టేబుల్ పనితనాన్ని మెచ్చుకుని తీరేవారంటే అతిశయోక్తి కాదు.
ఎన్ని ఆశలతో చేయించాను దాన్ని!
నాకు తెలీకుండానే నిట్టూర్చాను.
మా నాన్నగారు గ్రామ పెద్దగా ఉండేవారు. ఇంట్లో కూడా ఆయన మాటకు ఎదురుండేది కాదు. అలాగని పులిలా ఉండేవారూ కాదు..................
బోన్సాయ్ మనుషులు "డైనింగ్ టేబుల్ ఒక అలంకారం అయిపోయిందండీ!" ఇంట్లో అడుగుపెట్టగానే అంది పార్వతి." సంభ్రమంగా చూశాను. "హాలులో సగం ఆక్రమించి అన్నిటికీ అడ్డుగా ఉంటోంది. దాన్ని కోయించి చిన్న చిన్న టేబుళ్ళుగా, టీపాయ్లుగా చేయిస్తే మంచిది” నా భార్య మాటలకు ఆశ్చర్యంగా, అపనమ్మకంగా చూశాను. నా గురించి నా ఫీలింగ్సు గురించి తెలిసి కూడా ఆమె అలా మాట్లాట్టం నన్ను నిర్విణుణ్ణి చేసింది. "ఏవిటలా చూస్తున్నారు. నిన్ననే ఏదో పేపర్లో చదివేను. ఒక సంవత్సరం పాటు ఉ పయోగించని వస్తువు ఇంట్లో ఉంచుకోవడం అనవసరమట” నేను మాట్లాడలేకపోయాను. బాధతో కుమిలిపోతూ డైనింగ్ టేబుల్ని సమీపించాను. హాలులో ఒక పక్కగా జాలిగొలుపుతూ ఉంది. చక్కని నగిషీ పనితనంతో అలరారుతూ ఒకనాటి వైభవానికి ప్రతీకగా నిలిచి ఉంది. నిట్టూరుస్తూ ఉంది! నేను రాజమండ్రిలో పనిచేసేటప్పుడు ముదురు టేకుతో దాన్ని ప్రత్యేకంగా చేయించాను. అంచులకూ, మధ్యలోని పద్మాలకూ రోజుడ్ ఉపయోగించాం. దాని కాళ్ళు దేవాలయస్తంభాల మీద కనిపించే సింహపు కాళ్ళను పోలి ఉంటాయి. మా ఇంటికొచ్చిన ప్రతివారూ డైనింగ్ టేబుల్ పనితనాన్ని మెచ్చుకుని తీరేవారంటే అతిశయోక్తి కాదు. ఎన్ని ఆశలతో చేయించాను దాన్ని! నాకు తెలీకుండానే నిట్టూర్చాను. మా నాన్నగారు గ్రామ పెద్దగా ఉండేవారు. ఇంట్లో కూడా ఆయన మాటకు ఎదురుండేది కాదు. అలాగని పులిలా ఉండేవారూ కాదు..................© 2017,www.logili.com All Rights Reserved.